అమెరికా ‘తానా’లో గెలుపు ఈయనదే!

అమెరికాలో తెలుగోళ్ల పంచాయతీ ఎట్టకేలకు తేలింది. హోరాహోరీగా సాగిన పోరులో నిరంజన్ దే విజయం సాధ్యమైంది. తాజాగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2021 ఎన్నికల్లో శృంగవరపు నిరంజన్ ప్రభంజనం సృష్టించారు. తానా అధ్యక్షుడిగా ఘన విజయం సాధించారు. కర్నూలు చెందిన నిరంజన్ అమెరికాలో సెటిలయ్యారు. తన సమీప ప్రత్యర్థి నరేన్ కొడాలిపై 1758 ఓట్ల మెజార్టీతో గెలిచి తానా అధ్యక్షుడయ్యాడు. ముఖ్యంగా అమెరికా వ్యాప్తంగా తిరుగుతూ నిరంజన్ చేసిన ప్రచారం ఫలించింది. ‘కొడాలి ఓడాలి’ […]

Written By: NARESH, Updated On : May 30, 2021 3:13 pm
Follow us on

అమెరికాలో తెలుగోళ్ల పంచాయతీ ఎట్టకేలకు తేలింది. హోరాహోరీగా సాగిన పోరులో నిరంజన్ దే విజయం సాధ్యమైంది. తాజాగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2021 ఎన్నికల్లో శృంగవరపు నిరంజన్ ప్రభంజనం సృష్టించారు. తానా అధ్యక్షుడిగా ఘన విజయం సాధించారు. కర్నూలు చెందిన నిరంజన్ అమెరికాలో సెటిలయ్యారు. తన సమీప ప్రత్యర్థి నరేన్ కొడాలిపై 1758 ఓట్ల మెజార్టీతో గెలిచి తానా అధ్యక్షుడయ్యాడు.

ముఖ్యంగా అమెరికా వ్యాప్తంగా తిరుగుతూ నిరంజన్ చేసిన ప్రచారం ఫలించింది. ‘కొడాలి ఓడాలి’ అంటూ ఆయన అమెరికాలోని తెలుగు వాళ్లను మెప్పించగలిగారు.తానా అధ్యక్షుడిగా గెలిస్తే సమూల మార్పులు తీసుకొస్తానని నిరంజన్ చేసిన ప్రచారాన్ని ప్రవాసులు నమ్మి పట్టం కట్టారు.

తానా ఎన్నికల్లో నిరంజన్ ప్యానెల్ కార్యవర్గ పదవులు అన్నింటిని కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. మొత్తం 33875 ఓట్లలో 21వేలు పోలు కాగా.. 2800 ఓట్లు చెల్లలేదు. శృంగవరపు నిరంజన్ కు 10866 ఓట్లు రాగా.. నరేన్ కు 9108 ఓట్లు వచ్చాయి. దీంతో 1758 ఓట్ల మెజార్టీతో నిరంజన్ గెలుపొందారు.

అయితే చివరివరకు కూడా కొడాలి నరేన్ ప్యానెల్ పోరాడిన తెలుగు వారి నమ్మకాన్ని గెలుపొందలేకపోయింది. అందుకే దారుణంగా ఓడిపోయింది. నిరంజన్ ప్యానెల్ తీవ్ర పోటీ ఎదుర్కొన్నా గెలిచింది.