spot_img
Homeఎంటర్టైన్మెంట్Krishnam Raju Birthday: రెబల్ స్టార్ కథానాయకుడే కాదు, రాజకీయ నాయకుడు కూడా !

Krishnam Raju Birthday: రెబల్ స్టార్ కథానాయకుడే కాదు, రాజకీయ నాయకుడు కూడా !

Krishnam Raju Birthday: తెలుగు సినిమా రెబల్ స్టార్, కథానాయకుడు, రాజకీయ నాయకుడు కృష్ణంరాజు పుట్టినరోజు నేడు. 1940లో జనవరి 20న ఆయన జన్మించారు. 1970, 1980లలో స్టార్ హీరోగా ఆయన తన హవాని కొనసాగించారు. మొత్తం 183 తెలుగు సినిమాలలో నటించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి.. 12వ లోక్‌సభ ఎన్నికలలో కాకినాడ లోకసభ నియోజకవర్గం నుంచి గెలిచి రాజకీయ నాయకుడిగానూ ఆయన పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.

Krishnam Raju Birthday
Krishnam Raju Birthday

ఆ తర్వాత 13వ లోక్‌ సభకు కూడా నరసాపురం లోకసభ నియోజకవర్గం నుంచి ఎన్నికై అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో స్థానం కూడా సాధించారు. అయితే, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి నుంచి లోక్ సభకు పోటీ చేసి కృష్ణంరాజు ఓడిపోయారు. ఇక అప్పటి నుంచి ఆయన మళ్ళీ రాజకీయంగా ఉన్నత స్థానికి ఎదగలేకపోయారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు కృష్ణంరాజు కుటుంబ స్వగ్రామం.

పైగా విజయనగర సామ్రాజ్య వారసులు కృష్ణంరాజు. కృష్ణంరాజుకు జీవిత భాగస్వామి శ్యామలా దేవి. 1996లో నవంబర్ 21న వీరి వివాహం జరిగింది. వీరికి ప్రసిద్ధి, ప్రకీర్తి, ప్రదీప్తి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. నేడు ఆయన పుట్టినరోజు.. కృష్ణంరాజుకు మా ఓకే తెలుగు నుండి ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు.

Also Read: విషాదం: ప్రముఖ తెలుగు నటుడు మృతి !

కృష్ణంరాజు జీవిత కాలంలో అందుకున్న అవార్డులు రివార్డులు ఇవే !

• రాష్ట్రపతి అవార్డులు
1977 అమర దీపం చిత్రానికి ఉత్తమ నటన
1978 మన వూరి పాండవులు చిత్రానికి ఉత్తమ నటన

• ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్
ఉత్తమ నటుడు – తెలుగు – అమరదీపం (1977)

• ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు (2006)

2014 – రఘుపతి వెంకయ్య అవార్డు

Also Read: ‘గని’ టీజర్ లో వరుణ్ తేజ్ పంచ్ అదిరింది !

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper