ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక.. ఏపీలో పెద్ద సిటీగా అవతరించింది విశాఖ. అందుకే.. జగన్ సీఎం అయ్యాక విశాఖను పాలనా రాజధానిగా కూడా ప్రతిపాదించింది. మరోవైపు. విశాఖ ఆసియాలోనే వేగంగా ఎదుగుతున్న సిటీ. ఈ నేపథ్యంలో విశాఖకే కాదు మొత్తం ఏపీకే తలమానికంగా ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఉంది. అందుకే.. విశాఖకు మరో పేరే ఉక్కు నగరం కూడా. అలా సిటీతో ఎంతగానో అనుబంధం పెనవేసుకుపోయిన స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. ప్రైవేటీకరించడం ఖాయమని ఇప్పటికే కేంద్రం కుండబద్దలు కొట్టింది.
Also Read: పవన్ కల్యాణ్ కు సపోర్టుగా లగడపాటి
అయితే.. కేంద్రం ఈ నిర్ణయం ఎందుకిలా తీసుకుందో తెలియదు కానీ.. ఆ పెట్టుబడుల నుంచి తప్పుకొని ప్రైవేటుకు అప్పజెప్పేసి లాభాల బాట పట్టిస్తామంటూ చెబుతోంది. విశాఖ ఉక్కు ఆ మధ్య దాకా లాభాల్లోనే ఉంది. గతేడాది కరోనాతో ప్రపంచం మొత్తం నష్టాల్లోకి వెళ్లిపోయింది. అందువల్ల ఒక్క ఉక్కునే అనడం భావ్యం కాదు. మరోవైపు చూస్తే సొంత గనులు విశాఖ ఉక్కుకు లేవు. అవి కనుక ఇచ్చి చూసి ఆ తరువాత కూడా నష్టాలలో ఉంటే అప్పుడు ఆలోచించాలి. కానీ.. ఇవేమీ చేయకుండా ఉక్కు నష్టపడిన కర్మాగారం. అంతే దాన్ని తాము అమ్మేస్తామని కేంద్రం దూకుడుగా వ్యవహరిస్తోంది.
అంతేకాదు.. ఉక్కు కర్మాగారం అసలైన విలువకు ఆరు రెట్లు తక్కువకు తెగనమ్మాలని చూడడం విడ్డూరం. ఇంతటి ఘనమైన విశాఖ ఉక్కుకు కేంద్రం కట్టిన విలువ కేవలం 32 వేల కోట్లు. ఉక్కు కర్మాగారానికి ఉన్న భూములే ఇరవై వేల ఎకరాలు. మెగా సిటీ విశాఖలో ఆ భూముల విలువ ఇప్పుడున్న ధరల ప్రకరాం అక్షరాలా రెండు లక్షల కోట్లు. దాంతో పాటు ఇతర స్థిర చరాస్తులు కూడా ఉన్నాయి. అంటే కేవలం 32 వేల కోట్లకు ఉక్కుని తెగనమ్మితే కొనుక్కున్న వారికి వచ్చేది అక్షరాల లక్షా 68 వేల కోట్ల లాభం.
Also Read: పాత రేషన్ విధానమే బెటర్ అంట
కాలంతో పాటే ఉక్కు భూముల ధరలు పెరిగితే ఎన్ని లక్షల కోట్లో వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయడం అంటారా..? అమ్మడం అంటారా..? తెగ నమ్మడం అంటారా..? మొత్తానికి చూస్తే దీని వెనక ఏదో భారీ కుట్ర ఉందని ఉక్కు కార్మిక సంఘాలు ఆందోళనకారులు అంటున్నారు. ఇప్పుడు అందరూ కూడా అదే ఆలోచనలో పడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఇదంతా అంటున్న వారూ ఉన్నారు. ఉక్కు వెనక ఉన్న తుక్కు ప్లాన్లు ఇవే అయితే మాత్రం విశాఖ భగ్గుమనడం ఖాయంగా కనిపిస్తోంది. మరి కేంద్రం ఈ చెత్త నిర్ణయం వెనుక అసలు కథ ఏంటో కూడా అర్థం కాకుండా ఉంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Center behind the steel is the rust determination
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com