Homeబిజినెస్Zomato Anniversary Campaign: బిల్డప్ కోసం లోగో తీసేస్తే.. కోట్లు బొక్క..

Zomato Anniversary Campaign: బిల్డప్ కోసం లోగో తీసేస్తే.. కోట్లు బొక్క..

Zomato Anniversary Campaign: క్రియేటివిటీ.. ఇది ఆకర్షించే విధంగా ఉండాలి. జనాలలో ఆలోచన తెచ్చే విధంగా ఉండాలి. ఒకరకంగా నూతనత్వం వైపు అడుగులు వేసే విధంగా ఉండాలి. అలాకాకుండా చదివేస్తే ఉన్న మతి పోయే విధంగా ఉండకూడదు. కానీ ఈ కంపెనీ ప్రతినిధులకు అది అర్థమయ్యేలోగానే అసలు నష్టం జరిగిపోయింది. కోట్లు ఖర్చుపెట్టినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. మనదేశంలో ఇంటి దగ్గరికి నచ్చిన ఫుడ్ తెచ్చి ఇచ్చే వ్యవస్థ కు శ్రీకారం చుట్టింది zomato. దీనికి ప్రత్యేకంగా […]

Zomato Anniversary Campaign: క్రియేటివిటీ.. ఇది ఆకర్షించే విధంగా ఉండాలి. జనాలలో ఆలోచన తెచ్చే విధంగా ఉండాలి. ఒకరకంగా నూతనత్వం వైపు అడుగులు వేసే విధంగా ఉండాలి. అలాకాకుండా చదివేస్తే ఉన్న మతి పోయే విధంగా ఉండకూడదు. కానీ ఈ కంపెనీ ప్రతినిధులకు అది అర్థమయ్యేలోగానే అసలు నష్టం జరిగిపోయింది. కోట్లు ఖర్చుపెట్టినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.

మనదేశంలో ఇంటి దగ్గరికి నచ్చిన ఫుడ్ తెచ్చి ఇచ్చే వ్యవస్థ కు శ్రీకారం చుట్టింది zomato. దీనికి ప్రత్యేకంగా హోటల్స్ లేవు. సొంతంగా వంటవాళ్ళు లేరు. కేవలం కస్టమర్లు కోరుకున్న ఆహారాన్ని.. కోరుకున్న చోటు నుంచి.. వారు ఉన్న చోటుకు తెచ్చి ఇస్తుంది. దీనికోసం కొంత ఛార్జ్ వసూలు చేస్తూ ఉంటుంది. ఇలా భారతీయులకు ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ అనే అవసరాన్ని సృష్టించి కోట్లు సంపాదిస్తున్నది జొమాటో కంపెనీ. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో ఈ కంపెనీ నిర్వాహకులకు ఒక పనికిమాలిన ఆలోచన వచ్చింది. దానిని వాళ్ళు క్రియేటివిటీ అనుకున్నారు. కానీ అది బొక్క పెడుతుందని.. కోట్లు ఖర్చుపడినప్పటికీ ఉపయోగం లేకుండా చేస్తుందని అనుకోలేదు.

ఇటీవల జోమాటో 18వ వార్షికోత్సవం జరుపుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జాతీయస్థాయి మీడియా పత్రికలలో భారీగా ప్రకటనలు ఇచ్చింది. ఈ ప్రకటనలో జొమాటో తన లోగోను మర్చిపోయింది. పైగా మాది 18వ వార్షికోత్సవం.. మా గురించి మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మేము ఎవరో మీకు చెప్పాల్సిన పని లేదు అంటూ అందులో క్యాప్షన్ ఇచ్చాడు. వాస్తవానికి తమ లోగో లేకపోయినప్పటికీ జనాలు గుర్తిస్తారని జొమాటో నిర్వాహకులు భావించారు. కానీ వారు అనుకున్నదొకటి.. జరిగింది మరొకటి.image.png

జొమాటో కంపెనీ నిర్వాహకులు కోట్లు ఖర్చుపెట్టి జాతీయస్థాయి పత్రికలలో భారీగా ప్రకటనలు ఇస్తే.. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. లోగో ఇవ్వకుండా.. కేవలం జనాల మెదడుకు పదును పెట్టే విధంగా క్యాప్షన్స్ రాసుకువచ్చారు. దీంతో అసలు యాడ్ ఇచ్చింది ఎవరు.. ఆ కంపెనీ ఎవరిది అని తెలుసుకోలేక రీడర్లు కన్ఫ్యూజ్ అయ్యారు. అంతేకాదు ఆ యాడ్ ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కోటక్ మహీంద్రా వాళ్లు బేక్ క్రియేటివిటీతో యాడ్స్ రూపొందించారు.. వాళ్ల లోగో లేకపోయినా సరే జనాలు గుర్తించగలిగేలా యాడ్ తయారు చేశారని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. దీంతో ఈ విషయం కోటక్ మహేంద్ర బ్యాంక్ వరకు వెళ్ళింది. దీంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి.. కోటక్ మహేంద్ర నిర్వాహకులు వినూత్నమైన మార్గాన్ని అనుసరించారు..

“మా లోగో లేకపోయినప్పటికీ కస్టమర్లు గుర్తిస్తున్నారు. సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇదంతా వారు మాపై చూపిస్తున్న ప్రేమకు నిదర్శనం. ఇదంతా మా సేవలకు లభించిన గొప్పదనం అంటూ” కోటక్ మహేంద్ర నిర్వాహకులు పేర్కొన్నారు. దీంతో కోట్లు ఖర్చుపెట్టి జోమాటో యాడ్స్ వేస్తే ఫలితం లేకుండా పోయింది. చివరికి రూపాయి ఖర్చు పెట్టకుండా కోటక్ మహీంద్రా దండిగా ప్రచారాన్ని సొంతం చేసుకుంది. అందువల్లే లోగో లేకుండా.. ప్రచారం చేసుకుంటే కోట్లు బొక్క పడతాయి.. చివరికి ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper