UPI’s ‘Bullet’ Speed : ఆన్‌లైన్ పేమెంట్స్ చేస్తున్నారా? ఫోన్‌తో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చిటికెలో డబ్బులు పంపేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. యూపీఐ పేమెంట్లు ఇప్పుడు మరింత వేగంగా మారాయి. జూన్ 16 నుండి యూపీఐ ట్రాన్సాక్షన్లు ‘బుల్లెట్’ వేగంతో జరుగుతున్నాయట. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త గైడ్‌లైన్స్‌తో ఈ వేగం సాధ్యమైందని చెబుతోంది. అంటే, ఇకపై మీరు డబ్బు పంపినా, స్వీకరించినా కేవలం 15 సెకన్లలోనే పని పూర్తవుతుంది. ఇది డిజిటల్ చెల్లింపుల ప్రపంచంలో ఒక విప్లవం అనే చెప్పాలి.
30 నుండి 15 సెకన్లకు తగ్గిన సమయం
గతంలో యూపీఐ పేమెంట్ల కోసం గరిష్టంగా 30 సెకన్లు సమయం పట్టేది. కానీ, ఇప్పుడు ఎన్‌పీసీఐ ఆ సమయాన్ని ఏకంగా 15 సెకన్లకు తగ్గించేసింది. ఈ మార్పు కేవలం డబ్బు పంపడానికి మాత్రమే కాదు, ట్రాన్సాక్షన్ స్టేటస్ చెక్ చేయడం, ఫెయిల్ అయిన పేమెంట్లను తిరిగి పొందడం వంటి నాన్-ఫైనాన్షియల్ కార్యకలాపాలకు కూడా వర్తిస్తుంది. అంటే, ఈ పనులన్నీ కూడా ఇప్పుడు 30 సెకన్ల నుంచి కేవలం 10 సెకన్లలోనే పూర్తవుతాయి. ఈ స్పీడ్ తగ్గింపు గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం, యోనో ఎస్‌బీఐ, ఐమొబైల్ పే, ఇతర బ్యాంకింగ్ యాప్‌లు వంటి అన్ని యూపీఐ ప్లాట్‌ఫామ్‌లకు వర్తిస్తుంది. కాబట్టి, ఏ యాప్ వాడినా, మీ పేమెంట్ ఇప్పుడు ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ అవుతుంది.
Also Read: UPI Payment Charges: యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. కేంద్రం సంచలన ప్రకటన
యూపీఐ ట్రాన్సాక్షన్ ఎలా జరుగుతుంది?
సాధారణంగా, ఒక వ్యక్తి క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసిన తర్వాత, అతనికి సంబంధించిన బ్యాంక్ ఎన్‌పీసీఐ సిస్టమ్ ద్వారా మరో బ్యాంకుకు “పేమెంట్” రిక్వెస్ట్ పంపిస్తుంది. అప్పుడు అవతలి బ్యాంక్ ఆ అకౌంట్ యాక్టివ్‌గా ఉందా లేదా, వివరాలు సరిగ్గా ఉన్నాయా వంటివి చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత, డబ్బు అందినట్లు ఒక కన్ఫర్మేషన్ తిరిగి ఎన్‌పీసీఐ సిస్టమ్ ద్వారా మొదటి బ్యాంకుకు పంపిస్తుంది. ఆ కన్ఫర్మేషన్ మన మొబైల్‌కు చేరగానే, ట్రాన్సాక్షన్ సక్సెస్ అయినట్లు మనకు తెలుస్తుంది.
ఇప్పటివరకు ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి 30 సెకన్లు పట్టేది. కానీ జూన్ 16, 2025 నుండి ఇది కేవలం 15 సెకన్లలోనే పూర్తవుతుంది. అంటే, ఆ రెండు బ్యాంకుల మధ్య కమ్యూనికేషన్, చెకింగ్ ప్రాసెస్ మరింత వేగవంతం అయ్యాయని అర్థం. ఇది టెక్నాలజీ అప్‌గ్రేడ్, సర్వర్ల కెపాసిటీ పెరగడం వల్ల సాధ్యమైంది.
ఈ స్పీడ్ పెరగడం వల్ల మనకి చాలా లాభాలున్నాయి :
చిల్లర కోసం వెతకాల్సిన అవసరం లేదు, ట్రాన్సాక్షన్ ఎప్పుడు పూర్తవుతుందో అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పేమెంట్ చేసిన వెంటనే డబ్బు అకౌంట్‌లో పడిపోతుంది. ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా, లేదా స్టేటస్ తెలుసుకోవాలన్నా నిరీక్షణ సమయం సగానికి తగ్గింది. పేమెంట్లు వేగంగా, సజావుగా జరగడం వల్ల యూపీఐ పట్ల ప్రజల నమ్మకం మరింత పెరుగుతుంది. వ్యాపారులకు కూడా తమ ఖాతాల్లో డబ్బు వెంటనే జమ అవుతుంది, వారి వ్యాపారం మరింత సులభతరం అవుతుంది. సూపర్ మార్కెట్లు, పెట్రోల్ పంపులు, రద్దీగా ఉండే ప్రదేశాలలో క్యూలు తగ్గి, సమయం ఆదా అవుతుంది.
ఈ కొత్త అప్‌డేట్ డిజిటల్ లావాదేవీలను మరింత సులభతరం చేస్తుంది, వేగవం