Sree Vishnu Vishnu Vinyasam OTT Release Date: తన డిఫరెంట్ కామెడీ టైమింగ్ తో జెన్ జీ ఆడియన్స్ ని అలరిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని ఏర్పాటు చేసుకున్న శ్రీ విష్ణు(Sree Vishnu), ఈమధ్య కాలం లో వరుసగా హిట్స్ ని అందుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు. నేడు ఆయన హీరో గా నటించిన ‘విష్ణు విన్యాసం'(Vishnu Vinyasam) చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్ లో విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయినప్పటికీ శ్రీ విష్ణు కి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్న కారణంగా ఈ చిత్రానికి బంపర్ ఓపెనింగ్ వసూళ్లు వచ్చాయి. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి ప్రస్తుతం గంటకు రెండు వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు, శ్రీవిష్ణు కి ఎలాంటి మార్కెట్ ఉంది అనేది. ఓవర్సీస్ లోని నార్త్ అమెరికా లో కూడా ఈ చిత్రానికి కేవలం ప్రీమియర్ షోస్ నుండి 78 వేల డాలర్లు వచ్చాయి.
Also Read: ‘స్పిరిట్’ నుండి వివేక్ ఒబెరాయ్ ఫస్ట్ లుక్ వచ్చేసింది..ఇదేమి మాస్ బాబోయ్!
ఇది ఇలా ఉండగా ఈ చిత్రానికి విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ రేంజ్ లో జరిగింది . నిర్మాతకు ఈ సినిమాని నిర్మించడానికి 19 కోట్ల రూపాయిలు ఖర్చు అయితే , ఈ సినిమాకు థియేట్రికల్ + నాన్ థియేట్రికల్ కలిపి 26 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. అంటే విడుదలకు ముందే నిర్మాతకు టేబుల్ ప్రాఫిట్స్ అన్నమాట. ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ మంచి ఫ్యాన్సీ రేట్ కి కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు విడుదలైన శ్రీవిష్ణు సినిమాలన్నీ ఓటీటీ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ సంస్థ నే కొనుగోలు చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా కూడా వాళ్ళే కొనుగోలు చేయడం గమనార్హం. దాదాపుగా 8 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది . ప్రతీ సినిమాలాగానే , ఈ సినిమా కూడా నాలుగు వారాల్లో ఓటీటీ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.
అంటే మార్చి 25 న ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో లో మనం చూడొచ్చు అన్నమాట. థియేటర్స్ లో ఈ చిత్రం కచ్చితంగా యావరేజ్ రేంజ్ లోనే ఆడేలా అనిపిస్తోంది. కానీ ఓటీటీ లో ఈ చిత్రానికి ఇంకా మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. శ్రీ విష్ణు మార్క్ కామెడీ టైమింగ్ అయితే ఈ సినిమాలో కూడా వర్కౌట్ అయ్యిందని , ఆయన్ని అభిమానించే వాళ్లకు ఈ చిత్రం కచ్చితంగా నచ్చుతుందని అంటున్నారు విశ్లేషకులు . చూడాలి మరి ఫుల్ రన్ లో ఈ చిత్రం ఎంత మేరకు రాబడుతుంది ?, ఆ తర్వాత విడుదలయ్యే ఓటీటీ లో ఎలాంటి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుంది అనేది.