Homeజాతీయ వార్తలుUPI Payment Charges: యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. కేంద్రం సంచలన ప్రకటన

UPI Payment Charges: యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. కేంద్రం సంచలన ప్రకటన

UPI Payment Charges: దేశవ్యాప్తంగా యూపీఐ ఆధారిత డిజిటల్‌ చెల్లింపుల వినియోగం రోజురోగు పెరుగుతోంది. చిన్న కిరాణా దుకాణం నుంచి పెద్ద వ్యాపార సంస్థల వరకు యూపీఐ ద్వారా లావాదేవీలు సర్వసాధారణమయ్యాయి. ప్రస్తుతం ఈ చెల్లింపులపై ఎటువంటి ఛార్జీలు లేనప్పటికీ, త్వరలో మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎండీఆర్‌) ఛార్జీలను విధించేందుకు కేంద్రం యోచిస్తోందన్న వార్తలు ఆంగ్ల మీడియాలో వచ్చాయి. అయితే, ఈ వార్తలను కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్‌ ఛార్జీలు విధించే ప్రతిపాదనలు పూర్తిగా ఊహాగానాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ ప్రచారం తప్పుదోవ పట్టించేలా ఉందని, పౌరుల్లో అనవసర ఆందోళనలకు కారణమవుతుందని ఎక్స్‌లో ఒక ప్రకటనలో తెలిపింది. డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని పునరుద్ఘాటించింది.

మీడియా కథనాలు ..
అధిక విలువైన యూపీఐ లావాదేవీల నిర్వహణకు ఖర్చులు పెరుగుతున్నాయని బ్యాంకులు, ఫిన్‌టెక్‌ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో, రూ.3 వేలకు పైబడిన లావాదేవీలపై ఎండీఆర్‌ ఛార్జీలను విధించేందుకు కేంద్రం చర్చలు జరుపుతోందని, బ్యాంకులు, ఎన్‌పీసీఐ, ఫిన్‌టెక్‌ సంస్థలతో సంప్రదింపుల తర్వాత ఒకటి లేదా రెండు నెలల్లో నిర్ణయం తీసుకోవచ్చని వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలను కేంద్రం నిరాధారమైనవిగా కొట్టిపారేసింది.

ఎండీఆర్‌ ఛార్జీలు..
2022 వరకు యూపీఐ ఆధారిత చెల్లింపుల ప్రాసెసింగ్‌ కోసం వ్యాపారులు బ్యాంకులకు ఒక శాతం లోపు ఎండీఆర్‌ ఛార్జీలు చెల్లించేవారు. అయితే, డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు కేంద్రం 2022లో ఈ ఛార్జీలను తొలగించింది. అప్పటి నుంచి ఈ ప్రాసెసింగ్‌ ఖర్చులను భర్తీ చేసేందుకు బ్యాంకులు, ఫిన్‌టెక్‌ సంస్థలకు కేంద్రం సబ్సిడీలు అందిస్తోంది.

యూజర్లపై భారం ఉండదు..
ఒకవేళ ఎండీఆర్‌ ఛార్జీలు తిరిగి విధించినా, అవి వ్యాపారులపైనే ఉంటాయి, యూజర్లపై కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యూపీఐ వినియోగదారుల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరని స్పష్టమైంది. యూపీఐ లావాదేవీలపై ఛార్జీల విధానంపై వచ్చిన ఊహాగానాలను కేంద్రం ఖండించడంతో ఈ అంశంపై స్పష్టత వచ్చింది. డిజిటల్‌ చెల్లింపులను మరింత ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కషి చేస్తోందని, యూజర్లకు ఎటువంటి ఆర్థిక భారం ఉండబోదని నిర్ధారించింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular