Jagans Plan for Rayachoti Ticket: రాజకీయాల్లో అవసరాలు మాత్రమే పనిచేస్తాయి. పార్టీల లాభనష్టాలు, అధినేతల ఇష్టాలు బట్టి నేతలకు అవకాశాలు దక్కుతుంటాయి. అది ఏ పార్టీలోనైనా సాధ్యమే. తెలుగుదేశం( Telugu Desam) పార్టీలో ఒక వెలుగు వెలిగారు మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. పార్టీ పట్ల విధేయత గా ఉండే నేత ఆయన. కానీ గత ఎన్నికల్లో పార్టీ అవసరాల కోసం పక్కకు తప్పుకున్నారు. వైసీపీ నుంచి టిడిపిలో చేరిన వసంత కృష్ణ ప్రసాద్ కోసం దేవినేని ఉమామహేశ్వరరావును తప్పించారు. అయితే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సైతం అటువంటి విధేయ నేతను పక్కకు తప్పించేందుకు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. నేతలు పెద్ద ఎత్తున బయటకు వెళ్ళిపోతున్నారు. ఈ క్రమంలో పార్టీలో ఒక ఊపు తేవాలంటే తెలుగుదేశం పార్టీ నుంచి కీలక నేతలను వైసీపీలోకి ఆకర్షించాలి. అయితే టిడిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్న ఓ కుటుంబం ఇప్పుడు వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధపడుతోంది. అయితే అలా వస్తున్న నేత కోసం.. జగన్మోహన్ రెడ్డి తన విధేయ నేతను పక్కన పెడతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
Also Read: YSRCP Adala Prabhakar Reddy Humiliation : వైసీపీలో అవమాన భారంతో ఆ మాజీ మంత్రి!
టిడిపికి రాజీనామా..
2024 ఎన్నికల్లో రాజంపేట( Rajampet ) నుంచి పోటీ చేసిన సుగవాసి సుబ్రహ్మణ్యం టిడిపికి రాజీనామా చేశారు. ఆయన త్వరలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో రాయచోటి నియోజకవర్గం నుంచి ఆయనకు టికెట్ హామీ మేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయన సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే గడికోట శ్రీకాంత్ రెడ్డిని పక్కన పెట్టడం ఖాయం. గడికోట శ్రీకాంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి చిన్ననాటి స్నేహితుడు. దానిని గుర్తించి కాంగ్రెస్ పార్టీలోకి రప్పించారు. రాయచోటి నుంచి అవకాశమిచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సైతం గడికోట శ్రీకాంత్ రెడ్డి కి అవకాశం కల్పించారు. కానీ మంత్రి పదవి ఇవ్వలేదు. ఇప్పుడు పార్టీకి ఒక ఊపు తేవాలని.. టిడిపి నుంచి వస్తున్న నేతకు ఆశ్రయం ఇచ్చేందుకు.. శ్రీకాంత్ రెడ్డి ని పక్కకు తప్పించేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధపడినట్లు ప్రచారం జరుగుతోంది.
బలమైన కుటుంబం.. రాయచోటిలో( Rayachoti) సుగవాసి పాలకొండ్రాయుడు బలమైన నేతగా ఎదిగారు. చంద్రబాబు, వైయస్ రాజశేఖర్ రెడ్డి తో పాటుగా తొలిసారిగా 1978లో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1983 ఎన్నికల్లో సైతం స్వతంత్ర పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1985లో రాజంపేట ఎంపీ అయ్యారు. అటు తరువాత టిడిపి నుంచి వరుసగా రాయిచోటి నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గడికోట శ్రీకాంత్ రెడ్డికి రాజశేఖర్ రెడ్డి తో పాటు జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యమిస్తూ వచ్చారు. అయితే ఈసారి గడికోట శ్రీకాంత్ రెడ్డిని తప్పించి టిడిపి నుంచి వస్తున్న సుగవాసి సుబ్రహ్మణ్యం కు జగన్ టిక్కెట్ కేటాయించనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే గడికోట శ్రీకాంత్ రెడ్డి కి అన్యాయం జరుగుతుందన్న మాట.
Also Read: Gadikota Srikanth Reddy : జగన్ కు దూరంగా స్నేహితుడు.. రాజకీయాల నుంచి శాశ్వతంగా!
గడిచిన ఎన్నికల సమయంలో..
వాస్తవానికి 2024 ఎన్నికల్లో గడికోట శ్రీకాంత్ రెడ్డిని( gadi Kota Srikanth Reddy) తప్పిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. వైసిపి హయాంలో సీఎంఓలో కీలక అధికారిక వ్యవహరించిన ధనుంజయ రెడ్డికి పొలిటికల్ గా ఛాన్స్ ఇస్తారని అప్పట్లో టాక్ నడిచింది. అయితే గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేయడంతో దానికి బ్రేక్ పడినట్లు సమాచారం. ప్రస్తుతం రాయచోటిలో గడికోట శ్రీకాంత్ రెడ్డి పై ఎమ్మెల్యేగా గెలిచారు రాంప్రసాద్ రెడ్డి. దీంతో ఏకంగా ఆయన మంత్రి అయ్యారు. అయితే మంత్రిని తట్టుకోవడం గడికోట శ్రీకాంత్ రెడ్డి కి ఇబ్బందిగా మారింది. అయితే ఇప్పుడు సుగవాసి కుటుంబం టిడిపి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనుండడంతో.. గడికోట శ్రీకాంత్ రెడ్డిని ఎలా వినియోగించుకుంటారో చూడాలి. వాస్తవానికి మొన్నటి ప్రభంజనంలో రాజంపేట నుండి ఓడిపోయారు సుగవాసి సుబ్రహ్మణ్యం. మరి అటువంటి నేతను తెచ్చుకొని.. నమ్మకస్తుడైన గడికోట శ్రీకాంత్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి వదులుకోవడం మాత్రం విమర్శలకు తావిస్తోంది.