spot_img
Homeబిజినెస్India Two Wheeler Market Future: టూ వీలర్ మార్కెట్లో పెను మార్పు.. ఇక బైక్...

India Two Wheeler Market Future: టూ వీలర్ మార్కెట్లో పెను మార్పు.. ఇక బైక్ లు చరిత్రల్లోకేనా..

India Two Wheeler Market Future: భారతదేశంలో టూవీలర్ మార్కెట్‌ త్వరలోనే భారీ మార్పులు చోటు చేసుకోన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు చాలా మంది రోజూవారీ అవసరాల కోసం బైక్స్ ను కలిగి ఉన్నారు. ఇవి దాదాపు పెట్రోల్ ఇంజన్ తో పనిచేస్తున్నాయి. అయితే ప్రస్తుతం అందుబాటులోకి ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులోకి వస్తుండడంతో వీటి ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ప్రముఖ ఆర్థిక విశ్లేషణ సంస్థ Equirus Securities తాజా నివేదికలో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం రాబోయే పదేళ్లలో భారతదేశంలో బైక్ ల స్థానంలో స్కూటర్ల వినియోగం గణనీయంగా పెరుగుతోందని తెలపుతోంది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం నగర ప్రాంతాల్లో స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్ పెరిగిపోతుంది. రోజూవారీ అవసరాలకు బైక్ ల కంటే స్కూటర్లు ఎక్కువ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సులభంగా నడపగలగడం, తక్కువ స్థలంలో పార్కింగ్ సౌకర్యం ఉండటం వంటి అంశాలు స్కూటర్లను వినియోగదారులకు మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి. యువతతో ఉద్యోగులు ఎక్కువగా వీటిని ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ మార్పుకు మరో కీలక కారణం ఎలక్ట్రిక్ వాహనాల (EVs) పెరగడమేనని Equirus Securities తెలుపుతోంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పెరుగుతున్న ఇంధన ధరలు, పర్యావరణంపై పెరుగుతున్న అవగాహన వంటి అంశాలు EV స్కూటర్ల వినియోగాన్ని వేగంగా పెంచుతున్నాయి. నివేదిక ప్రకారం 2030 నాటికి ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్ వాటా సుమారు 38% వరకు చేరుతుందని, 2040 నాటికి అది 80%కు పైగా పెరిగే అవకాశం ఉందని Equirus Securities పేర్కొంటోంది. ఇది సంప్రదాయ పెట్రోల్ వాహనాలకు పెద్ద సవాల్‌గా మారనుంది.

వాహనాల కంపెనీలు సైతం ఈ మార్పులో కీలక పాత్ర పోషిస్తున్నాయి . పట్టణాల విస్తరణ, ఉద్యోగ అవకాశాల పెరుగుదలతో నగరాల్లో ప్రయాణ అవసరాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో తేలికగా నడపగలిగే, తక్కువ ఖర్చుతో నిర్వహించగలిగే వాహనాల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. స్కూటర్లు ఈ అవసరాలకు సరిపోయే ఉత్తమ ఎంపికగా నిలుస్తున్నాయి. మహిళా డ్రైవర్ల సంఖ్య పెరగడం కూడా స్కూటర్ల డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. స్కూటర్లు తేలికగా ఉండటం, గేర్ లేకుండా సులభంగా నడపగలగడం, సౌకర్యవంతమైన డిజైన్ వంటివి మహిళలకు అనుకూలంగా ఉండటంతో వీటి వినియోగం పెరుగుతోంది. ఇది మార్కెట్ ట్రెండ్‌ను మరింతగా స్కూటర్ల వైపు మళ్లిస్తోంది.

వీటితో పాటు నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటం స్కూటర్లకు మరో పెద్ద ప్లస్ పాయింట్. బైకులతో పోలిస్తే స్కూటర్లలో మెయింటెనెన్స్ ఖర్చులు తక్కువగా ఉండటం, EV స్కూటర్ల విషయంలో ఇంధన ఖర్చు దాదాపు లేకపోవడం వినియోగదారులను ఆకర్షిస్తోంది. దీని వల్ల దీర్ఘకాలంలో ఖర్చు తగ్గుతుందని భావించి ఎక్కువ మంది స్కూటర్లను ఎంచుకుంటున్నారు.రాబోయే సంవత్సరాల్లో బైకుల కంటే స్కూటర్లే రోడ్లపై ఎక్కువగా కనిపించే పరిస్థితి రావడం ఆశ్చర్యం కాదు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular