Homeబిజినెస్Toyota Sienna: ఉమ్మడి కుటుంబం కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ఇది బెస్ట్ కారు..

Toyota Sienna: ఉమ్మడి కుటుంబం కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ఇది బెస్ట్ కారు..

Toyota Sienna: SUV కార్లను తీసుకురావడంలో Toyota కంపెనీ ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి Innova కార్ల వినియోగదారులను ఇంప్రెస్ చేసింది. అప్పటినుంచి SUV వేరియంట్ లో 7 సీటర్ కారు తీసుకురావడంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. అయితే 2026 కొత్త సంవత్సరం సందర్భంగా కంపెనీ Sienna న్యూ మోడల్ న్యూ మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. ఇందులో హైబ్రిడ్ ఇంజన్ తో పాటు పూర్తిగా మార్చిన డిజైన్ కనిపిస్తుంది. అలాగే లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన […]

Toyota Sienna: SUV కార్లను తీసుకురావడంలో Toyota కంపెనీ ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి Innova కార్ల వినియోగదారులను ఇంప్రెస్ చేసింది. అప్పటినుంచి SUV వేరియంట్ లో 7 సీటర్ కారు తీసుకురావడంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. అయితే 2026 కొత్త సంవత్సరం సందర్భంగా కంపెనీ Sienna న్యూ మోడల్ న్యూ మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. ఇందులో హైబ్రిడ్ ఇంజన్ తో పాటు పూర్తిగా మార్చిన డిజైన్ కనిపిస్తుంది. అలాగే లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఫీచర్లు ఉండడంతో నేటి తరం వారికి ఇది అనుగుణంగా ఉండనుంది. అంతేకాకుండా ఉమ్మడి ఫ్యామిలీ కలిసి విహారయాత్రలకు వెళ్లడానికి ఇది బాగా సరిపోతుంది అన్న చర్చ సాగుతుంది. ఈ కారు పూర్తి వివరాల్లోకి వెళితే..

Toyota Sienna డిజైన్ వేరే లెవెల్ అని అనుకోవచ్చు. దీని ముందడి భాగంలో LED డే అండ్ నైట్ వచ్చే హెడ్ లాంప్స్ ఉన్నాయి. మెటాలిక్ గ్రిల్ తోపాటు బ్యాక్ సైడ్ ప్రీమియం లుక్ అందించే ఎల్ఈడి టెయిల్ లైట్స్ ఆకర్షణీయంగా కనిపిస్తాయి. జూన్ ప్రొటెక్షన్ తో పవర్ లిఫ్ట్ గేట్ సేఫ్టీగా ఉంటుంది.
18 అంగుళాల 6 స్పోక్ డార్క్ ఫినిష్డ్ అలాగే వీల్స్ ఆకట్టుకుంటాయి. ఇందులో లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఇంటీరియర్ ఫీచర్లు ఉన్నాయి. ఆటో డిమింగ్ రియల్ వ్యూ మిర్రర్, USB చార్జింగ్ పోర్టు, ఎయిర్ ఫిల్టర్ తో కూడిన ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ డ్రైవర్ తో పాటు ప్రయాణికులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అలాగే 12.3 అంగుళాల డిజిటల్ గేర్ క్లస్టర్, 7 అంగుళాల Odometer, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే, ఆడియో, వాయిస్ కమాండ్, టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్ వంటివి ఉన్నాయి. 11.6 అంగుళాల ఎంటర్టైన్మెంట్ డిస్ప్లే చూడొచ్చు. పవర్ విండోస్ తోపాటు సెవెన్ సీటర్ బూట్ స్పేస్ సౌకర్యవంతంగా ఉంటుంది.

కొత్తగా వచ్చిన ఈ కారులో హైబ్రిడ్ ఇంజన్ ను చేర్చారు. ఇది 2.5 లీటర్ ఫోర్ సిలిండర్ తో పనిచేస్తుంది. 245 హార్స్ పవర్ తో పనిచేసే ఈ ఇంజన్ లీటర్ ఇంధనానికి 36 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఇంజన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. ఇందులో మూడో ఇంజన్ గా ఎలక్ట్రిక్ మోటార్ ని కూడా చేర్చారు. ఈ కారు చూడడానికి చిన్నగా అనిపించినప్పటికీ దూర ప్రయాణాలకు అనుగుణంగా ఉంటుంది. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబం కలిసి విహారయాత్రలకు వెళ్లడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. దీనిని 40,420 డాలర్ల ధరగా నిర్ణయించారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper