spot_img
Homeబిజినెస్Electric Scooter Mobile Charging Port: స్కూటర్ లోనే మొబైల్ చార్జింగ్.. ఇక మీకు చింతలేదు.....

Electric Scooter Mobile Charging Port: స్కూటర్ లోనే మొబైల్ చార్జింగ్.. ఇక మీకు చింతలేదు.. వీటిలో ఏ స్కూటర్ మీకు బెటర్…

Electric Scooter Mobile Charging Port: ఈరోజుల్లో మొబైల్ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిన విషయమే. చిన్న పనుల నుంచి పెద్దపెద్ద వ్యాపారులు సైతం ఫోన్లోనే కమ్యూనికేషన్స్ పెంచుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఈ ఫోన్లో చార్జింగ్ అవసరం చాలా ఉంటుంది. ఒక్కోసారి రోజంతా మొబైల్ వినియోగించాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి సమయం ఉండదు. అయితే ప్రత్యేకంగా మొబైల్ ఛార్జింగ్ కోసం సమయం కేటాయించకుండా డ్రైవింగ్ లో ఛార్జ్ అయ్యే అవకాశం ఇప్పుడు వచ్చింది. ఒకవైపు డ్రైవింగ్ చేసుకుంటూనే మరోవైపు మొబైల్ ఛార్జింగ్ చేసుకునేలా కొన్ని స్కూటర్లలో ఆప్షన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి మొబైల్ ఛార్జింగ్ ఉన్న బెస్ట్ స్కూటర్లు ఏవో ఇప్పుడు చూద్దాం..

వివిధ పనులు చేసే వారికి మొబైల్ చాలా అవసరం. ముఖ్యంగా మార్కెటింగ్ తో పాటు గిగ్ వర్కర్లకు ఆర్డర్లు తీసుకోవడానికి ఎప్పుడూ మొబైల్ లో చార్జింగ్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా వీరు బైక్ లేదా స్కూటర్ల పై ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇలాంటివారు ఒకవైపు రైడింగ్ చేస్తూనే మరోవైపు మొబైల్ ఛార్జింగ్ చేసుకునే అవసరం కొన్ని స్కూటర్లలో ఉంది. అలాంటి వాటిలో ముందుగా టీవీఎస్ కంపెనీకి చెందిన ఐ క్యూబ్ గురించి చెప్పుకోవచ్చు. ఈ స్కూటర్లో మొబైల్ ఛార్జింగ్ పాయింట్ సీటు కింద లభిస్తుంది. ఈ స్కూటర్లో 2.2 కిలో వాట్ నుంచి 5.3 కిలోవాట్ వరకు బ్యాటరీ ఆప్షన్లు ఉంటాయి. ఈ బ్యాటరీతో ఒకవైపు స్కూటర్ నడుస్తూనే మరోవైపు మొబైల్ ఛార్జింగ్ చేసుకోవచ్చు.

ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల కంపెనీ ఓలా తన టూ వీలర్స్ లో చార్జింగ్ పోర్టులు తప్పనిసరిగా ఉంటాయి. ఈ స్కూటర్లకు హ్యాండిల్ భాగంలోనే యుఎస్బి పోర్టు కనిపిస్తుంది. దీంతో ఒకవైపు మొబైల్ ఆన్ చేసుకొని మరోవైపు చార్జింగ్ పాయింట్ పెట్టుకోవచ్చు. ఈ చార్జింగ్ పాయింట్ గిగ్ వర్కర్లకు చాలావరకు ఉపయోగపడుతుంది. వీరు ఆర్డర్లు తీసుకొని బైక్ పై డ్రైవ్ చేస్తూనే మరోవైపు మొబైల్ ఛార్జింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

Ather కంపెనీకి చెందిన Rizta అనే స్కూటర్ లో ఉండే బ్యాటరీ తో మొబైల్ ఛార్జింగ్ అద్భుతంగా తీసుకోవచ్చు. ఈ స్కూటర్కు సీటు కింద చార్జింగ్ పాయింట్ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా 15వాట్ల మొబైల్ ఛార్జింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో బిజీగా ఉండే వారికి తొందరగా చార్జింగ్ కావాలని అనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. హీరో కంపెనీకి చెందిన Vida V1 అనే స్కూటర్ లోను ఉండే ఛార్జింగ్ పాయింట్ మార్కెటింగ్ చేసుకునే వారికి ప్లస్ పాయింట్ గా ఉండనుంది. ఎందుకంటే దీనికి యూఎస్బీ పోర్టు హ్యాండిల్ కిందనే ఉంటుంది. దీంతో ఒకవైపు ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటూనే మరోవైపు చార్జింగ్ పెట్టుకునే అవకాశం ఉంటుంది.

బజాజ్ కంపెనీకి చెందిన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ లోను హ్యాండిల్ బార్ కింద చార్జింగ్ పాయింట్ ఉంటుంది. ఇది కూడా మార్కెటింగ్ చేసే వారికి, గిగ్ వర్కర్లకు చాలావరకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా మొబైల్ ఛార్జింగ్ తప్పనిసరిగా అవసరం ఉన్నవారికి ఈ స్కూటర్లు ఫుల్ సపోర్ట్ గా ఉండనున్నాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Men's Mental Health

men’s health : మగవాళ్లు చెప్పుకోలేని ఐదు సమస్యలున్నాయి.. అవేంటో తెలుసా..

men's health : ‘నువ్వు మగాడివి బాస్.. ధైర్యంగా ఉండాలి.. కుటుంబానికి అండగా ఉండాలి..’అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఒక కుటుంబంలో ఎవరికి సమస్య వచ్చినా వాటి పరిష్కారానికి తీవ్ర కృషి...

body fat : కొవ్వుతో మెదడుపై ప్రభావం.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు..

body fat : ప్రస్తుత కాలంలో చాలామంది రకరకాల ఆహారాన్ని తింటూ ఉన్నారు. ముఖ్యంగా ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్ తో పాటు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో అదనపు...

Wrong Mobile Recharge : తప్పుడు నెంబర్కు రీఛార్జ్ చేశారా.. ఇలా చేస్తే మనీ రిఫండ్..

Wrong Mobile Recharge : మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవరికి వారే రీఛార్జ్ చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి తప్పుడు నెంబర్ పై రీఛార్జ్ అయ్యే అవకాశం...

IBPS PO 2026 : బ్యాంకు ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. 7,460 ఉద్యోగాలకు మరో ఛాన్స్‌!

IBPS PO 2026 : ఐబీపీఎస్‌(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌) పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో), స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(ఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ý డువు...
The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Oktelugu Epaper