Oppo Find X10: భారతదేశంలో Oppo మొబైల్స్ కు ఆదరణ ఎక్కువగా ఉంది. ఈ కంపెనీ నుంచి మార్కెట్లోకి ఇప్పటికే ఎన్నో మోడల్స్ వచ్చాయి. అయితే లేటేస్ట్ గా దీని నుంచి Oppo Find X10 ఫ్లాగ్షిప్ ఫోన్ రాబోతుంది. ఈ మొబైల్ గురంచి అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఈ స్మార్ట్‌ఫోన్ కు సంబంధించి కొన్ని లీక్స్ ఆసక్తికరంగా ఉంటున్నాయి. 2026 చివరలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్న ఈ మొబైల్ డిస్ప్లే, కెమెరా, బ్యాటరీ, ప్రాసెసర్ ఎలా ఉంబడోతున్నాయో చూద్దాం..
డిస్ప్లే:
ఒప్పో ఫైండ్ X10లో 6.59 అంగుళాల ఫ్లాట్ OLED డిస్ప్లే ఉండనుంది. ఇది 1.5K రిజల్యూషన్‌తో వస్తుందని లీక్స్ చెబుతున్నాయి. అలాగే 120Hz లేదా 165Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేసి.. HDR10+ ఫీచర్లతో ప్రీమియం విజువల్ అనుభవాన్ని అందిస్తుంది.దీంతో మూవీస్ చూసేవారికి ఇది అనుగుణంగా ఉండనుంది. అంతేకాకుండా ఎలాంటి వాతావరణంలోనైనా అద్భుతమైన కాంతిని అందజేస్తుంది.
కెమెరా:
ఒప్పో ఫైండ్ X10లో డ్యూయల్ కెమెరాలు ఉండనున్నాయి. 200MP రియర్ మెయిన్ కెమెరా, 200MP పెరిస్కోప్ టెలిఫోటోతో ఉండవచ్చు. జూమ్ లో-లైట్ పెర్ఫార్మెన్స్లో రిజల్యూషన్ తగ్గకుండా నాణ్యమైన ఫొటోలను అందిస్తుంది. 50MP అల్ట్రా-వైడ్ లెన్స్ కూడా ఉండే అవకాశం. మొత్తంగా హై-రిజల్యూషన్ తో ఫొటోలను తీసుకోవచ్చు. ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ వారికి ఈ కెమెరా అద్భుతంగా పనిచేస్తుంది.
బ్యాటరీ:
ఒప్పో కొత్త మొబైల్ లో 8000 mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీతో భారీ అప్‌గ్రేడ్ ఇవ్వనుంది. ఈ బ్యాటరీ 80W వైర్డ్, 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేయనుంది. గతంలో మార్కట్లోకి వచ్చిన ఫైండ్ X9 (7025mAh) కంటే ఎక్కువ డే లాంగ్ ను అందిస్తుంది.
ప్రాసెసర్:
వేగమైన పనితీరును కోరుకునేవారికి ఈ ఫోన్ ఉపయోగపడనుంది. ఎందుకంటే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9500+ లేదా 9600 చిప్సెట్తో పవర్ అవుతుంది. LPDDR6 RAM, UFS 5.0 స్టోరేజ్‌తో హై పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. AI కెపాబిలిటీస్ ఉండడంతో గేమింగ్, మల్టీటాస్కింగ్ లో వర్క్ చేసేవారికి ఫుల్ సపోర్ట్ ఇవ్వనుంది.
ధర:
భారత్‌లో 12GB+256GB వేరియంట్ ఒప్పో ఫైండ్ ఘ 10 మొబైల్ ధర రూ. 79,990ఉండనుంది. ప్రో మోడల్ రూ.1,00,000కు పైగానే ఉండే అవకాశం ఉంది. ప్రీమియంల ఫోన్ల కోసం ఎదురుచూసేవారికి ఇది బెస్ట్ ఎంపిక అని అంటున్నారు.