Motorola Edge 70 Pro: Motorola కంపెనీ నుంచి మార్కెట్లోకి వచ్చి ఫోన్లకు ఎక్కువగా ఆదరణ ఉంటాయి. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి ఎడ్జ్ 70 ఫ్యూజన్ ఫోన్ ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో Motorola Edge 70 Pro మొబైల్ లో ఇటీవల రిలీజ్ చేశారు. అయితే ఇది గతంలో కంటే అప్డేట్ వర్షంతో పాటు.. ఆధునిక ఫీచర్లను కలిగి ఉంది. అంతేకాకుండా ఇందులో నాణ్యమైన కెమెరాతో పాటు బ్యాటరీ వ్యవస్థ బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా కంటెంట్ సృష్టించే వారికి.. మల్టీ టాస్కింగ్ కోసం ఫోన్ వాడేవారికి ఈ మొబైల్ బాగా యూస్ అవుతుందని అంటున్నారు. మరి ఈ ఫోన్ పూర్తి వివరాలు కి వెళ్తే..
Motorola Edge 70 Pro మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే.. ఇందులో 6.8 AMOLED డిస్ప్లే ఉండనుంది. ఇది 1.5 కే Resolution తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 16 వెర్షన్ తో పనిచేసే ఇందులో మీడియా టెక్ డైమెన్సిటీ 8500 ప్రాసెసర్ ఉండనుంది. 12gb రామ్ తో పాటు 256 స్టోరేజ్ తో ఉండే ఈ మొబైల్ డిజైన్ కూడా అద్భుతంగా ఉంటుంది. దీంతో రెగ్యులర్గా మూవీస్ చూసే వారితోపాటు గేమింగ్ కోరుకునే వారికి ఈ మొబైల్ డిస్ప్లే బాగా పనిచేస్తుంది.
మోటరోలా ఎడ్జ్ 70 ప్రో కెమెరా పనితీరు మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా అమర్చారు. అలాగే 50 ఎంపీ అల్ట్రావైడ్ సెన్సార్ తో పనిచేస్తుంది. 50 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాతోపాటు వీడియో రికార్డింగ్ కోసం పనిచేస్తుంది. అయితే వీడియో రికార్డింగ్ చేయాలని అనుకునే వారికి 4k resolution తగ్గకుండా ఉంటుంది. ఈ కెమెరాలో ఏఐ తరహాలో ఫోటోలను కూడా తీర్చిదిద్దుకునే అవకాశం ఉంది. అలాగే ఇలాంటి వాతావరణం లోనైనా అద్భుతమైన బ్రైట్నెస్ ఉండడంవల్ల ఫోటోలను నాణ్యత మెరుగ్గా ఉండనుంది.
ఈ మొబైల్లో బ్యాటరీ వ్యవస్థ కూడా మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 6500 mAh బ్యాటరీని చేర్చారు. ఈ బ్యాటరీ 90 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో పని చేస్తుంది. అలాగే ఇందులో అదనపు ఫీచర్లు కూడా నేటి తరం వారికి బాగా ఉపయోగపడనున్నాయి. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, యూఎస్బీ టైప్ సి పోర్టు, బ్లూటూత్ 5.4, వైఫై, జిపిఎస్ టెక్నాలజీ వంటివి ఆకర్షణీయంగా ఉంటాయి. మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో 8 GB రామ్, 256 జీబీ స్టోరేజ్ కలిగిన మొబైల్ ధర రూ.38,999 తో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ మొబైల్ ధర రూ. 41,999 గా ఉంది. రోజువారి వినియోగదారులతో పాటు మిడిల్ క్లాస్ పీపుల్స్ కు అందుబాటులో ఈ ధరలు ఉండడంతో చాలామంది ఈ మొబైల్ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.