Homeబిజినెస్What is Bloodbath: స్టాక్ మార్కెట్లలో వాడే ‘బ్లడ్ బాత్’ అనే పదానికి అర్థం ఇదే..

What is Bloodbath: స్టాక్ మార్కెట్లలో వాడే ‘బ్లడ్ బాత్’ అనే పదానికి అర్థం ఇదే..

What is Bloodbath: పశ్చిమాసియాలో అనిశ్చితి నేపథ్యంలో భారతీయ స్టాక్ మార్కెట్లు ఇటీవల భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ సుమారు 1040 పాయింట్లు (1.6%) కోల్పోయి 63,400కి దిగజారింది. నిఫ్టీ 280 పాయింట్లు (1.4%) నష్టపోయి 19,200 లెవెల్‌కు పడిపోయింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా 1నుంచి 2% క్షీణత చూపాయి.ఈ సమయంలో ఈరోజును బ్లడ్ బాత్ అని పిలుస్తున్నారు. అసలు బ్లడ్ బాత్ అంటే ఏమిటీ? ఈ పదాన్ని ఎప్పుడు ఉపయోగించారు? ప్రపంచంలో అతిపెద్ద బ్లడ్ బాత్ ఎప్పుడు జరిగింది.

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇందులో భాగంగా ఈ గురువారం సెన్సెక్స్ సుమారు 1040 పాయింట్లు కోల్పోయింది. ఇదే సమయంలో అమెరికాలో ఆర్థిక డేటా ఆందోళనలు, FIIలు (విదేశీ ఇన్వెస్టర్లు) 800 కోట్ల డాలర్ల అమ్మకాలు చేసిన నేపథ్యంలో మార్కెట్‌లు కుంగిపోయాయి. ట్రంప్ వాణిజ్య ఆందోళనలు, ఇన్‌ఫ్లేషన్ డేటా దెబ్బలు పెద్ద ఇంపాక్ట్ చూపాయి. ఈ పతనంతో ఇన్వెస్టర్ల సంపద 5.3 లక్షల కోట్ల రూపాయలు ఆవిరింది. మార్కెట్ క్యాప్ రూ. 440 లక్షల కోట్ల నుంచి రూ. 435 లక్షల కోట్లకు తగ్గింది. విశ్లేషకులు దీనిని బ్లడ్ బాత్ గా పోలుస్తున్నారు.

బ్లడ్ బాత్ అనే పదం అసలు స్టాక్ మార్కెట్‌కు చెందినది కాదు. ఇది మొదట యుద్ధాలు, హింసాత్మక సంఘటనల్లో భారీ రక్తపాతం జరిగినప్పుడు వాడే పదం. తర్వాత మీడియా , ఆర్థిక విశ్లేషకులు మార్కెట్లలో భారీ పతనాలను డ్రామాటిక్‌గా వివరించేందుకు ఈ పదాన్ని ఉపయోగించడం ప్రారంభించారు. 20వ శతాబ్దం మధ్యకాలం నుంచి ఫైనాన్షియల్ జర్నలిజంలో ఈ పదం విస్తృతంగా ప్రాచుర్యం పొందింది.

ప్రపంచంలో అతిపెద్ద బ్లడ్ బాత్ 1987 సంవత్సరంలో జరిగింది. ఒక్క రోజులోనే అమెరికా మార్కెట్ సుమారు 22% పడిపోయింది. ఇది అత్యంత తీవ్ర సింగిల్-డే క్రాష్‌గా గుర్తింపు పొందింది. 2026 మార్చి 1 (సోమవారం) నాడు మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు, యుద్ధ భయాలతో భారత మార్కెట్ భారీ నష్టాల్లో ముగిసింది. ఒక్కరోజులో సుమారు రూ.10 లక్షల కోట్ల ఇన్వెస్టర్ సంపద ఆవిరైంది. ఈ పరిస్థితిని బ్లడ్ బాత్ గా పేర్కొంటారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular