Homeబిజినెస్Maruti Suzuki upcoming cars 2027: వచ్చే ఏడాదిలో Maruti Suzuki నుంచి మూడు కొత్త...

Maruti Suzuki upcoming cars 2027: వచ్చే ఏడాదిలో Maruti Suzuki నుంచి మూడు కొత్త కార్లు.. ఎలా ఉంటాయంటే

Maruti Suzuki upcoming cars 2027: ఆటోమోబైల్ రంగంలో Maruti Suzuki కంపెనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది.. దీని నుంచి మార్కెట్లోకి వచ్చిన దాదాపు అన్ని కార్లు వినియోగదారులను ఆకర్షిస్తాయి. కొన్ని కార్లు దశాబ్దాల కిందట మార్కెట్లోకి వచ్చి ఇప్పటికీ ఆదరణ పొందుతున్నాయి. అయినా కూడా ఈ కంపెనీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ నేటి తరం వారికి కొత్త కొత్త మోడల్స్ ను మార్కెట్ లోకి తీసుకువస్తుంది. మిగతా కంపెనీలకు పోటీ చేస్తూ ఎలక్ట్రిక్ కారును కూడా […]

Maruti Suzuki upcoming cars 2027: ఆటోమోబైల్ రంగంలో Maruti Suzuki కంపెనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది.. దీని నుంచి మార్కెట్లోకి వచ్చిన దాదాపు అన్ని కార్లు వినియోగదారులను ఆకర్షిస్తాయి. కొన్ని కార్లు దశాబ్దాల కిందట మార్కెట్లోకి వచ్చి ఇప్పటికీ ఆదరణ పొందుతున్నాయి. అయినా కూడా ఈ కంపెనీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ నేటి తరం వారికి కొత్త కొత్త మోడల్స్ ను మార్కెట్ లోకి తీసుకువస్తుంది. మిగతా కంపెనీలకు పోటీ చేస్తూ ఎలక్ట్రిక్ కారును కూడా ఇటీవల ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే వచ్చే 12 నెలల్లో ఈ కంపెనీ మూడు కొత్త కారులను తీసుకువస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన కార్లను అప్డేట్ చేస్తూ తీసుకురావడంతో ఇవి ఎలా ఉంటాయో తెలుసుకోవాలని ఆసక్తి చాలామందిలో ఉంది. ఇంతకీ మార్కెట్లోకి రాబోయే ఆ కార్లు ఏవి? వాటి పనితీరు ఎలా ఉండబోతోంది?

మారుతి సుజుకి కంపెనీ హాచ్ బ్యాక్ కార్ల ఉత్పత్తిలో స్పెషల్ అని అంటుంటారు. అయితే దీని నుంచి SUV కూడా రిలీజ్ అయి పేరు తెచ్చుకున్నాయి. అలాంటి వాటిలో Brezza ఒకటి. ఈ కారును ఇప్పటికే చాలామంది కొనుగోలు చేశారు. అయితే నేటి తరం వారికి ఆకర్షించేలా మరింత కొత్తగా దీనిని తయారు చేస్తున్నారు. ఈ కొత్త బ్రెజ్జా కారు రీ డిజైన్ చేసుకోబడుతుంది. దీనికి ఉండే హెడ్ ల్యాంప్, టెయిల్ లాంప్స్ ఆకర్షించనున్నాయి. ఇందులో కొత్తగా 16 అంగుళాల రెండు టోన్ అల్లాయ్ వీల్స్ అమర్చనున్నారు. ఒకటి లేదా రెండు కొత్త కలర్లలో కనిపించనుంది. ఇంటీరియర్ డిజైన్ విషయానికి వస్తే ఇప్పటివరకు బ్రెజ్జా లో 9 అంగుళాల స్క్రీన్ ఉండేది. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే కారులో 10.1 అంగుళాల టచ్ స్క్రీన్ కనిపించనుంది. అలాగే 1.5 లీటర్ నేచురల్లీ అస్పిరేటెడ్ ఇంజన్ ఉండనుంది.

మారుతి కంపెనీ నుంచి మరో కారు బాలెనో గురించి ఇప్పటివరకు చాలామందికి తెలిసిన విషయమే. అయితే ఇది కూడా ఇప్పుడు కొత్తగా రూపుదిద్దుకుంటుంది. ఈ మోడల్ కొత్త కారులో రేడియేటర్ గ్రిల్ ఉండనుంది. లోయర్ ఎయిర్ ఇంటెక్ గ్రిల్, ఫ్రంట్ బంపర్ కొత్తగా కనిపిస్తుంది. ఇవి రెండు మాత్రమే ఇందులో మార్పులు ఉంటాయి. మిగతా కొన్ని మార్కులతో ఈ కొత్త కారు మార్కెట్లోకి రాబోతుంది.

ఇదే కంపెనీకి చెందిన ప్రీమియం కారు ఫ్రాంక్స్ కారులో 10.1 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం ఉండనుంది. ఆకర్షించే డిజైన్ తో పాటు ఇందులో ఇంజన్ వ్యవస్థ కూడా మారిపోయే అవకాశం ఉంది. 1.2 లీటర్ నాచురల్ అస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉన్న ఈ కారు లీటర్ ఇంధనానికి 35 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.వచ్చే 12 నెలల్లో ఈ మూడు కార్లు మార్కెట్లోకి రాబోతున్నాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper