Workplace Punishment: ఒక ఆఫీసులో ఒక వ్యక్తి బాగా పనిచేస్తున్నాడని అంటారు.. అతనికి ఏ పని అప్పజెప్పినా.. వెంటనే పూర్తి చేస్తాడని చెబుతారు. అంతేకాకుండా ఎవరికైనా సహాయం కావాలంటే అతడిని అడగండి… అని అంటారు.. అయితే ఈ పరిస్థితిని చూసి కొందరు తమల్ని మెచ్చుకుంటున్నారు.. అని అనుకుంటున్నారు. వాస్తవానికి ఇది పొగడ్త కాదు.. పనిష్మెంట్.. ఇది కొత్తలో బాగానే ఉటుంది. కానీ ఆ తరువాత చికాకు కలిగిస్తుంది. ఎంతలా అంటే..ఆ వ్యక్తి ఒత్తిడి తట్టుకోలేక రాజీనామా చేసేంత వరకు.. మరి ఇలా ఎందుకు ఉంటుంది? బాగా పనిచేస్తున్నాడని అనిపించుకున్న వ్యక్తికి సమస్యలు ఎదురైతే ఏం చేయాలి?
మీరు ఉద్యోగులైతే.. మీరు ఒక విషయాన్ని గమనించండి.. ఎవరైతే బాగా పనిచేస్తారో.. వారికే ఎక్కువగా వర్క్ ఉంటుంది. ఇక ఇంపార్టెంట్ వర్క్ వస్తుంది.. పెద్ద ప్రాజెక్టు వస్తుంది.. ఆ వ్యక్తికి ఇవ్వండి హ్యాండిల్ చేస్తుంది… ఆమె పూర్తి చేస్తుంది.. అని చెబుతారు.ఇలా అనేసరికి ఆ వ్యక్తికి ఇంప్రెస్ అనిపిస్తుంది. అంతేకాకుండా మిగతా వారి కంటే తాను ప్రత్యేకం అనిపిస్తుంది. కానీ ఆ తరువాతే అసలు కథ మొదలవుతుంది.
ఇలా చాలా కాలం తరువాత పనిచేసినా కూడా.. రివార్డ్స్ రావు. ఇంకా అదనంగా పని పెరుగుతుంది. కార్యాలయంలో చెప్పిన ప్రతీ పని చేయడం వల్ల రిసోర్స్ ఉంటుందని అనుకుంటారు. కానీ భారం పెరుగుతుందన్న విషయాన్ని మరిచిపోతుంటారు. ఉదాహరణకు ఒక వ్యక్తి వర్క్ కెపాసిటీ 100 శాతం అయితే.. తన స్థాయికి మించి 140 శాతం వర్క్ చేస్తున్నాడు. అంటే 40 శాతం మీకోసం చేసేది కాదు. ఇలాంటప్పుడు రివార్డ్ ఎందుకు వస్తుంది?
ఇది రాను రాను 200 శాతం కూడా కావొచ్చు. అయితే ఇక్కడే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. అంటే భారం పడకుండా ఉండడానికి ‘బౌండరీస్’ పెట్టుకోవాలి. అంటే ఒక వ్యక్తి మరో వ్యక్తికి అదనంగా పనిచేయమన్నప్పుడు సున్నితంగా తిరస్కరించండి. అది ఎలా ఉండాలంటే.. ‘ఈ పని మరో వ్యక్తి కూడా చేస్తాడు’ అని చెప్పండి. ఇలా చెప్పడం వల్ల మీ పనితనాన్ని తగ్గించడం కాదు.. మీరు హద్దులు ఏర్పరుచుకుంటున్నట్లు. ఇలా చేయడం వల్ల భవిష్యత్ లో భారం తగ్గుతుంది.