spot_img
Homeబిజినెస్DMart profit reasons: DMart కు ఎప్పటికీ లాభాలు రావడానికి కారణాలు ఇవే..

DMart profit reasons: DMart కు ఎప్పటికీ లాభాలు రావడానికి కారణాలు ఇవే..

DMart profit reasons: తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులు అందించి.. ఎప్పుడు లాభాల బాటలో కొనసాగుతున్న D Mart గురించి తెలియని వారు తక్కువ మందే ఉంటారు. ఈ రిటైల్ దిగ్గజం 2002లో ముంబైలో ప్రారంభమై దేశవ్యాప్తంగా 12 కి పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 461 కు పైగా స్టోర్లు ఉన్నట్లు తెలుస్తోంది. సామాన్యులను ఆకట్టుకునే విధంగా తక్కువ ధరకే నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచి.. ఒకే చోట అన్ని రకాల వస్తువులను అందించే విధంగా ఈ స్టోర్లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఎన్నో రకాల స్టోర్లను స్థాపిస్తున్న ఈ కంపెనీ ఎప్పటికీ లాభాల్లోనే కొనసాగుతుంది. అలా లాభాల్లో కొనసాగడానికి దీని యాజమాన్యం తీసుకుని నిర్ణయాలే కారణం అని తెలుస్తుంది. అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? వీరు చేసే పనులు ఏంటి?

డి మార్ట్ రిటైల్ కంపెనీ నిరంతరం లాభాల్లో ఉండడానికి ఖర్చు నియంత్రణ, సరఫరా వ్యవస్థ, వ్యాపార క్రమశిక్షణ వంటివి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.

సొంతంగానే స్టోర్లు:
చాలా సంస్థలు అద్దె భవనాల్లో తాత్కాలిక భవనాల్లో ఏర్పాటు చేస్తూ ఉంటారు. కానీ డిమార్ట్ మాత్రం ప్రత్యేకంగా స్థలం కొనుగోలు చేసి లేదా స్థలాన్ని 25 నుంచి 30 ఏళ్ల పాటు దీర్ఘకాలంగా లీజుకు తీసుకొని నిర్వహిస్తూ ఉంటుంది. దీంతో ప్రతినెల అద్దె చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా అద్దె ఖర్చు తగ్గుతుంది. కొందరు నిపుణుల ప్రకారం ఇలా చేయడం వల్ల 3 నుంచి 8 శాతం వరకు డబ్బు ఆదా అవుతుంది.

సరఫరాదారులతో సత్సంబంధాలు:
డి మార్ట్ సంస్థలకు సరఫరా చేసే కంపెనీలతో సత్సంబంధాలు నెలకొల్పుతారు. సాధారణంగా కొన్ని కంపెనీలు సరఫరాదారులకు 30 నుంచి 90 రోజుల వరకు చెల్లింపులు చేస్తాయి. కానీ డిమార్ట్ మాత్రం ఏడు నుంచి 11 రోజుల్లోనే చెల్లింపు చేస్తుంది. దీంతో తయారీదారులు తక్కువ ధరకే వస్తువులను అందిస్తారు. పెద్ద మొత్తంలో సరుకులు కొనడం వల్ల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ తగ్గింపును నేరుగా వినియోగదారులకు ఇవ్వడం వల్ల కస్టమర్లు ఎప్పటికీ ఈ స్టోర్ లోకి రావడానికి ప్రయత్నిస్తారు.

నిత్యవసరాలపైనే ఎక్కువగా దృష్టి:
ఈ సంస్థ ఎక్కువగా నిత్యావసరాల వస్తువుల పైనే దృష్టి సారిస్తోంది. బియ్యం, అప్పులు, నూనె, సబ్బులు వంటి రోజువారీ అవసరాలు తీర్చే వస్తువులను ఇందులో ఉంచుతారు. అందువల్ల ఈ స్టాక్ ఎక్కువ కాలం స్టోర్లో నిల్వ ఉండకుండా ఉంటుంది. ఫలితంగా మూలధనం నిలిచిపోకుండా రొటేట్ అవుతూ ఉంటుంది.

ఫ్యాన్సీ కి దూరం:
ఈ స్టోర్లు ఏర్పాటు చేసే క్రమంలో లగ్జరీ డిజైన్ ల గురించి ఎక్కువగా ఆలోచించరు. స్టోర్లో అవసరమైన రాక్స్, స్పేస్ చాలా సింపుల్ గా ఉంటుంది. దీంతో నిర్మాణం, నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయి.

యాడ్స్ కు దూరం:
డి మార్ట్ కు సంబంధించి ఎక్కడ ప్రత్యేకంగా అడ్వర్టైజ్మెంట్ కనిపించదు. దీంతో ప్రకటనల ఖర్చు సేవ్ అవుతాయి. వీటికి వినియోగించే ఖర్చులను తగ్గించి వినియోగదారులకు తక్కువ ధరకే వస్తువులను అందించాలని ప్రయత్నిస్తారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper