ఏపీ హైకోర్టు నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 55 సివిల్ జడ్జి ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 55 ఉద్యోగ ఖాళీల్లో మహిళలకు 18 ఉద్యోగాలు కేటాయించగా పురుషులకు 37 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
Also Read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సౌత్ వెస్ట్రన్ రైల్వేలో ఉద్యోగాలు..?
http://hc.ap.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా 2021 సంవత్సరం జనవరి 2వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుని 800 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు.
Also Read: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. లక్ష రూపాయల వేతనంతో ఉద్యోగాలు..?
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గుంటూరు, రాజమండ్రి, కర్నూలు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలలో పరీక్ష కేంద్రాలు ఉంటాయి. ఏపీ హైకోర్టులో మొత్తం 68 సివిల్ జడ్జ్ (జూనియర్ డివిజన్) ఉద్యోగ ఖాళీలు ఉండగా ఈ ఉద్యోగాలలో 13 ఉద్యోగాలను హైకోర్టు బదిలీల ద్వారా భర్తీ చేస్తుంది. పరీక్ష కేంద్రాలు, పరీక్ష తేదీలకు సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని ఏపీ హైకోర్టు వెల్లడించింది.
మరిన్ని: విద్య / ఉద్యోగాలు కోసం
అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఎంపికైతే భారీగా వేతనం లభిస్తుంది. వెబ్ సైట్ లో ఉద్యోగ అర్హతలు, ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్తులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు,
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Ap high court recruitment 2020 apply online for 55 civil judge jobs
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com