Andhra Pradesh : ఏపీలో( Andhra Pradesh) కొత్త రేషన్ కార్డుల జారీపై ఒక క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఈ కేవైసీ ప్రక్రియ జరుగుతున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా కొత్త రేషన్ కార్డుల జారీపై అనేక రకాలుగా ప్రచారం నడిచింది. ఈ తరుణంలో తాజాగా పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఈ కేవైసీ ప్రక్రియ నడుస్తున్న సంగతి తెలిసిందే. రేషన్ కార్డులో ఉన్న ప్రతి లబ్ధిదారుడి ఈ కేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. అటు తరువాతే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఉంటుందని తాజాగా క్లారిటీ వచ్చింది. దీంతో లబ్ధిదారుల్లో ఒక రకమైన సంతోషం వ్యక్తం అవుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఉంటుందని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎట్టకేలకు దీనిపై క్లారిటీ వచ్చింది.
Also Read : ఈ నెలలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్.. కీలక ప్రకటన చేసిన సీఎం
కూటమి ( Alliance) అధికారంలోకి వచ్చి దాదాపు పది నెలలు అవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కో హామీని నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ తరుణంలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈరోజు స్పష్టమైన ప్రకటన చేశారు. మే నెల నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఏప్రిల్ 30 తో ఈ కేవైసీ ప్రక్రియ ముగియనుంది. వెనువెంటనే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రి ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీ రేషన్ కార్డు సైజు తగ్గించి అన్ని వివరాలతో వీటిని జారీ చేయనున్నట్లు ఫుల్ క్లారిటీ ఇచ్చారు మంత్రి నాదెండ్ల మనోహర్. దీంతో లబ్ధిదారుల్లో ఒక రకమైన ఆశలు చిగురిస్తున్నాయి. గత కొంతకాలంగా రేషన్ కార్డుల కోసం లక్షలాదిమంది లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.
* ఏళ్ల తరబడి నిలిచిన ప్రక్రియ..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. లక్షలాదిమంది దరఖాస్తులు చేసుకున్న మంజూరు ప్రక్రియ మాత్రం జరగలేదు. మరోవైపు కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది సమీపిస్తోంది. ఇప్పటికీ చాలామంది అర్హులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో కొత్త కార్డుల జారీ సమయంలోనే కుటుంబ సభ్యుల పేర్ల జోడింపులు, తొలగింపులకు అవకాశం ఇవ్వబోతున్నారు. ఇదే విషయంపై స్పష్టతనిచ్చారు మంత్రి నాదెండ్ల మనోహర్.
* క్యూఆర్ కోడ్ తో రేషన్ కార్డులు..
అయితే ఈసారి మారిన సాంకేతిక పరిజ్ఞానానికి అనుసంధానంగా రేషన్ కార్డుల ప్రక్రియ జారీ జరగనుంది. క్యూఆర్ కోడ్ లాంటి భద్రత ఫీచర్లతో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఉంటుందని మంత్రి వెల్లడించారు. అయితే గత ఐదేళ్లుగా రేషన్ కార్డులపై సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండేది. అయితే ఈసారి రేషన్ కార్డులపై ఎవరి బొమ్మలు ఉండవని మంత్రి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కేవైసీ పూర్తయిన తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీపై ఒక స్పష్టత రానుంది. దాదాపు అర్హులందరికీ రేషన్ కార్డులు అందించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
* అనర్హులకు పెద్దపీట..
గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అనర్హులకు రేషన్ కార్డులు( ration cards ) జారీ చేశారని విమర్శ ఉంది. దానిని సరి చేసేందుకు కూటమి ప్రభుత్వం ఈ కేవైసీకి పూనుకుందని ఒక ప్రచారం ఉంది. వాస్తవానికి లక్షలాదిమంది దరఖాస్తులు రేషన్ కార్డుల కోసం చేసుకున్నారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు సిద్ధమవుతున్న తరుణంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. దీంతో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. అయితే కూటమి ప్రభుత్వం ఈ కేవైసీ పూర్తి చేసిన తర్వాత అనర్హులను ఏరివేయనుంది. అటు తరువాత కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది.
Also Read : కరువుపై ఏపీ ప్రభుత్వం ప్రకటన!