YSRCP Firebrand Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో చాలామంది ఫైర్ బ్రాండ్స్ ఉన్నారు. అందులో ఎక్కువగా మాత్రం ఫేమస్ అయ్యింది కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్. ఇక పేర్ని నాని, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్ లాంటివారు ఫైర్ బ్రాండ్స్ గా ఉన్నారు. అయితే వల్లభనేని వంశీ మోహన్ దాదాపు 5 నెలల పాటు జైలు జీవితం అనుభవించారు. కొడాలి నాని అనారోగ్యంతో బాధపడుతున్నారు. గుండెకు బైపాస్ సర్జరీ జరిగింది. ఇప్పుడిప్పుడే కోలుకొని బయటకు వస్తున్నారు. పేర్ని నాని పై కూడా కేసులు నమోదయ్యాయి. కానీ ఎలాగోలా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అయితే ఈ ముగ్గురు ఫైర్ బ్రాండ్స్ ఇప్పుడు ఒకే వేదికపై వచ్చారు. బెయిల్ పై విడుదలైన వల్లభనేని వంశీ మోహన్ ను కొడాలి నానితో పాటు పేర్ని నాని పరామర్శించారు. దీంతో ఈ ముగ్గురు ఫైర్ బ్రాండ్స్ ఒకే ఫ్రేమ్ పై కనిపించారు. సోషల్ మీడియాలో దీనిపై విపరీతంగా వైరల్ అవుతోంది. ఫైర్ బ్రాండ్స్ ఇజ్ బ్యాక్ అంటూ సోషల్ మీడియా శ్రేణులు పోస్టులు వైరల్ చేస్తున్నాయి.
Also Read: కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీ ఒకే చోట.. సుదీర్ఘ భేటీ..ఆంధ్రా లో ఏం జరుగుతోంది?
అధినేత పై అమితమైన అభిమానం
అయితే ఈ ముగ్గురు నేతలకు ఒక ప్రత్యేకత ఉంది. జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) పై ఈగ వాలనివ్వరు. పేర్ని నాని ఎటాక్ మామూలుగా ఉండదు. లాజిక్ జత చేసి మాట్లాడతారు. ప్రత్యర్థిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తారు. కొడాలి నాని అయితే డైరెక్ట్ అటాక్ చేస్తారు. అయితే ఆయన మాటల్లో బూతులు ధ్వనిస్తాయి. డైరెక్టుగా బూతులుకు దిగిపోవడం ఆయనకు మైనస్. వల్లభనేని వంశీ మోహన్ అయితే లోతైన పదాలతో మాట్లాడతారు. తాతలతోపాటు పూర్వీకుల ప్రస్తావన తెచ్చి విరుచుకుపడుతుంటారు. ఒక్కోసారి టంగ్ స్లిప్ అవుతారు. గతంలో ఇలా చేసే ఇప్పుడు జైలు జీవితం అనుభవించారు.
Also Read: పవన్ ను పాయింట్ తో కొట్టిన పేర్ని నాని
పార్టీకి అవసరం..
అయితే ఈ ముగ్గురి అవసరం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉంది. కానీ గతం మాదిరిగా ఈ ముగ్గురు దూకుడు పెంచుతారా అంటే అనుమానమే. అయితే పేర్ని నాని( perni Nani ) మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికీ అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. కొడాలి నాని మాత్రం అనారోగ్యం కారణంగా సైలెంట్ అయ్యారు. వల్లభనేని వంశీ మోహన్ అరెస్టు సమయంలో పరామర్శకు వచ్చారు. ఆ సమయంలో కూడా దూకుడుగా మాట్లాడారు. ఏం చేస్తారులే కేసులే కదా పెడతారు అంటూ చాలా తేలిగ్గా తీసుకున్నారు. అటు తరువాత ఆయన అనారోగ్యానికి గురయ్యారు. బైపాస్ సర్జరీ జరిగింది. ఆపై విదేశాలకు వెళ్లకుండా లుక్ అవుట్ నోటీసుల జారీ కూడా జరిగింది. మరోవైపు వల్లభనేని వంశీ మోహన్ ఇటీవలే విడుదలయ్యారు. ఆయన సైతం అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతానికైతే కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీ మోహన్ సైలెంట్ గా ఉంటారు. పేర్ని నాని అదే దూకుడు కొనసాగిస్తారు. అయితే మరి జగన్మోహన్ రెడ్డి ఈ ముగ్గురిని ఎలా వినియోగించుకుంటారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.