Allu Arjun Atlee Movie Update: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్ (Allu Arjun)… తను చేసిన చాలా సినిమాలు అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. రీసెంట్ గా ఈయన చేసిన పుష్ప 2(Pushpa 2) సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొట్టి పలు రికార్డులను సైతం బ్రేక్ చేశాడు. ఇలాంటి క్రమంలోనే తన తదుపరి సినిమా విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలు మరోక ఎత్తుగా మారబోతున్నాయి. ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఇండియాలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా దాదాపు 800 కోట్ల బడ్జెట్లో తెరకెక్కుతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో తనను తాను మరోసారి స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ఇప్పటివరకు భారీ బడ్జెట్ తో సినిమాలు చేసినప్పటికి ఇంత భారీ బడ్జెట్ రేంజ్ లో మాత్రం ఆయన ఎప్పుడూ సినిమా చేయలేదు. మరి ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే 2000 కోట్లకు పైన కలెక్షన్లు అయితే వస్తాయి.
Also Read: రెచ్చగొట్టిన బ్రూక్.. పద్ధతిగా ఇచ్చిపడేసిన పంత్.. అట్లుంటది మరీ (వీడియో)
ఒకవేళ డిజాస్టర్ గా మారితే మాత్రం సినిమా భారీ నష్టాలను మిగిల్చే అవకాశం అయితే ఉంది…ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ తండ్రిగా మలయాళం సూపర్ స్టార్ అయిన మోహన్ లాల్ నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకుంటే ఇండియాలో తనకు తిరుగు ఉండదు.
ఆ రకంగా ఆయన నెంబర్ వన్ పొజిషన్ ను అందుకోవచ్చనే ఉద్దేశ్యంలో అల్లు అర్జున్ ఉన్నాడు. మరి తను అనుకున్నట్టుగానే ఇక మీదట కూడా ఆయన మంచి సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇక ఇప్పటికే రాజమౌళి (Rajamouli) లాంటి దర్శకుడు పాన్ వరల్డ్ లో సినిమా చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఈ సినిమాతో పలు సంచలనాలను క్రియేట్ చేయాలని ఆయన చూస్తున్నాడు. మరి దానికి తగ్గట్టుగానే అట్లీ(Atlee) సైతం అల్లు అర్జున్ (అల్లు Arjun) తో పలు రికార్డులను తిరగరాస్తు సినిమాని నెక్స్ట్ లెవెల్లో నిలిపే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా సూపర్ సక్సెస్ ను సాధిస్తుందా లేదా అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…