Vallabhaneni Vamsi : వైసిపి అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీ తరచూ మీడియాలో కనిపించేవారు. వైసిపి ప్రభుత్వం లో వీరు ముగ్గురు కీలక నేతలుగా కొనసాగే వారు. ముఖ్యంగా టిడిపి మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేసేవారు. మీడియా దొరికితే చాలు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించేవారు. ఇక శాసనసభ వేదికగా కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేసేవారు. దీంతో అప్పట్లో మీడియా మొత్తం వీరి చుట్టూ తిరిగేది. వీరు ఏం మాట్లాడినా సంచలనమయ్యేది. ఓ వర్గం మీడియా వీరికి విపరీతమైన ప్రచారం కల్పించేది.
ఏపీలో వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత వీరు ముగ్గురు కూటమి ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు వీరి ముగ్గురు టిడిపి నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత, ఆయన కుమారుడి మీద రాయడానికి వీలు లేని భాషలో ఆరోపణలు చేశారు. అయితే వీటన్నింటినీ మనసులో పెట్టుకున్న కూటమి ప్రభుత్వం వీరిని నేరుగా టార్గెట్ చేయకుండా.. వీరు పాల్పడిన అవకతవకలపై కేసులు నమోదు చేసింది. ఇందులో వంశీ జైలుకు వెళ్లొచ్చారు. ఇటీవల బెయిల్ మీద విడుదలయ్యారు. ఇక కొడాలి నాని శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఆయనపై కూడా కేసును నమోదైనప్పటికీ ముందస్తు బెయిల్ తీసుకున్నారు. ఇక పేర్ని నాని కూడా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు.
వంశీ జైలు నుంచి విడుదలైన తర్వాత.. శస్త్ర చికిత్స చేయించుకుని బయటికి వచ్చిన తర్వాత కొడాలి నాని.. పేర్ని నాని ముగ్గురు ఒకచోట భేటీ అయ్యారు.. వీరు ముగ్గురు ఏలూరు జిల్లా వంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో ఓ వైసీపీ నేత ఇంట్లో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరు ముగ్గురు ఒకే వేదిక మీద కూర్చున్నారు. కొడాలి నాని శస్త్ర చికిత్స చేయించుకొని రావడంతో ఆయనను వల్లభనేని వంశీ, పేర్ని నాని పరామర్శించారు. ఇక వీరు ముగ్గురు ఒకేచోట భేటీ కావడంతో రాజకీయంగా సంచలనంగా మారింది. మరోవైపు ఇటీవల వైసిపి అధినేత జగన్ ఏపీలో వరుస పర్యటనలు సాగిస్తున్నారు. త్వరలో ఆయన నెల్లూరులో పర్యటించబోతున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డిని ఆయన జైల్లో పరామర్శించనున్నారు. పేర్ని నాని, వల్లభనేని వంశీ, కొడాలి నాని వైసీపీలో కీలకమైన నాయకులు కావడంతో.. వారు ముగ్గురు బేటి కావడం ప్రాధాన్య సంతరించుకుంది. ఇక ఇటీవల జైలు నుంచి విడుదలైన తర్వాత వల్లభనేని వంశీ వైసిపి అధినేత జగన్ ను కలిశారు. అండగా ఉంటానని జగన్ వంశీకి హామీ ఇచ్చారు.
ఇక పేర్ని నాని, వంశీ, కొడాలి నాని ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి చర్చించుకున్నారని తెలుస్తోంది. వారి వారి నియోజకవర్గాలలో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి మాట్లాడినట్టు తెలుస్తోంది. గడచిన ఎన్నికల్లో వంశీ, నాని ఓడిపోయారు. ఇక వైసిపిలో ఈ ముగ్గురు కీలక నాయకులు కావడం.. ఒకే చోట భేటీ కావడంతో.. కార్యకర్తలు వారిని చూసేందుకు భారీగా వచ్చారు. వారితో ఫోటోలు దిగడానికి పోటీలు పడ్డారు.
కృష్ణా : వల్లభనేని వంశీ నివాసానికి కొడాలి నాని..
వల్లభనేని వంశీని పరామర్శించిన కొడాలి నాని. పేర్ని నాని..#vallabhanenivamsi #KodaliNani #AndhraPradesh pic.twitter.com/foE4n2hc81
— Telugu Stride (@TeluguStride) July 5, 2025