Soundarya Love Story: సౌందర్య నవతరం మహానటిగా పేరు తెచ్చుకుంది. అభినవ సావిత్రి అని ఆమెను పరిశ్రమ కొనియాడింది. తెలుగు పరిశ్రమ సౌందర్య(Soundarya) ను సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేసింది. కన్నడ అమ్మాయి అయినప్పటికీ ఇక్కడే స్టార్ గా ఎదిగింది. అనంతరం తమిళ్, కన్నడ, హిందీతో పాటు పలు భాషల్లో చిత్రాలు చేసింది. ముఖ్యంగా తెలుగులో సౌందర్యకు విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. ఆమె కోసమే సినిమాకు వెళ్లే ఆడియన్స్ లేకపోలేదు. అయితే సౌందర్య అకాల మరణం అప్పట్లో సంచలనం రేపింది.
Also Read: రెచ్చగొట్టిన బ్రూక్.. పద్ధతిగా ఇచ్చిపడేసిన పంత్.. అట్లుంటది మరీ (వీడియో)
నటిగా కెరీర్ పీక్స్ లో ఉండగా సౌందర్య రాజకీయాల్లోకి వెళ్ళింది. బీజేపీ పార్టీలో చేరిన సౌందర్య 2004 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ తరపున ప్రచారం చేసింది. ఈ ప్రచార సభల్లో పాల్గొనే క్రమంలో విమానంలో ప్రయాణిస్తూ ప్రమాదానికి గురై కన్నుమూసింది. సౌందర్యతో పాటు ఆమె సోదరుడు కూడా అదే విమానంలో ఉన్నాడు. సౌందర్య మరణంతో ఆమె నటిస్తున్న పలు ప్రాజెక్ట్స్ రద్దు అయ్యాయి. ముఖ్యంగా బాలకృష్ణ నర్తనశాల అనే పౌరాణిక చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో మొదలుపెట్టాడు. ఈ చిత్రంలో సౌందర్య ద్రౌపది పాత్ర చేయాల్సి ఉంది.
సౌందర్య మరణంతో నర్తనశాల ఆగిపోయింది. ఇదిలా ఉంటే సౌందర్య మీద పలు ఎఫైర్ రూమర్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఇద్దరు తెలుగు హీరోలతో సౌందర్య ప్రేమలో పడ్డారని పుకార్లు వచ్చాయి. జగపతి బాబు(Jagapathibabu), వెంకటేష్(Venkatesh) లతో సౌందర్య అత్యధికంగా చిత్రాలు చేసింది. దాంతో సౌందర్యతో వారికి ఎఫైర్ ఉందంటూ గుసగుసలు వినిపించాయి. సౌందర్యతో లింక్ పెడుతూ ఓ ప్రముఖ పత్రిక వార్త ప్రచురించగా, నేరుగా వెళ్లి ఆ పత్రిక అధినేతను అడిగినట్లు జగపతిబాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సౌందర్య తనకు మంచి స్నేహితురాలు మాత్రమే అని జగపతిబాబు అన్నారు.
కాగా సౌందర్య ఒకరిని ప్రేమించిన మాట వాస్తవమేనట. అయితే ఆయన పరిశ్రమకు చెందిన వ్యక్తి కాదు. వరసకు మేనమామ అయ్యే వ్యక్తిని సౌందర్య ప్రేమించారట. అతన్నే వివాహం చేసుకోవాలని అనుకుందట. ఈ విషయాన్ని ఓ సందర్భంలో సీనియర్ నటి నిర్మల వెల్లడించారు. కారణం తెలియదు కానీ ఆమె కోరిక తీరలేదు. తన చిన్ననాటి మిత్రుడు, దగ్గర బంధువు అయిన మరో అబ్బాయి రఘును సౌందర్య 2003లో వివాహం చేసుకుంది. పెళ్ళైన ఏడాదికే ఆమె అకాల మరణం చెందారు. అతి చిన్న ప్రాయంలో పరిశ్రమకు వచ్చిన సౌందర్య మరణించే నాటికి ఆమె వయసు కేవలం 31 ఏళ్ళు మాత్రమే.