Homeఆంధ్రప్రదేశ్‌Good news for AP unemployed youth: నిరుద్యోగులకు ఉగాది రోజున గుడ్ న్యూస్!

Good news for AP unemployed youth: నిరుద్యోగులకు ఉగాది రోజున గుడ్ న్యూస్!

Good news for AP unemployed youth: ఏపీ ప్రభుత్వం( AP government) దూకుడు పెంచింది. కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఉగాదికి కీలక ప్రకటన ఉంటుందని వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. ఇప్పటికే మంత్రి నారా లోకేష్ ఈ విషయంపై బహిరంగ ప్రకటన చేశారు. ఉగాదికి మరో వారం రోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో జాబ్ క్యాలెండర్ తయారీలో యంత్రాంగం తలమునకలై ఉన్నట్లు తెలుస్తోంది. జాబ్ క్యాలెండర్ను ప్రకటించి నిరుద్యోగ యువతకు భరోసా ఇవ్వాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉపాధ్యాయ నియామకాలు, కానిస్టేబుల్ పోస్టుల భర్తీతో ప్రభుత్వం పట్ల నిరుద్యోగ యువతలో సానుకూలత ఉంది. అందుకే జాబ్ క్యాలెండర్ ప్రకటించి వారి నమ్మకాన్ని అలాగే కొనసాగించాలని చూస్తున్నట్లు సమాచారం.

ప్రత్యేక ప్రణాళికతో..
ప్రభుత్వ ఉద్యోగాల( Government employees) విషయంలో కూటమి ప్రభుత్వం ఒక ప్రణాళికగా ముందుకు వెళ్తోంది. దాదాపు 16 వేల ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీ నియామక ప్రక్రియను పూర్తి చేసింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఈ ఏడాది మరో డీఎస్సీ ప్రకటనకు సిద్ధపడుతోంది. మొన్ననే 6000 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అనేది నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని చూస్తోంది కూటమి ప్రభుత్వం. అందుకే శాఖల వారిగా ఖాళీలను చూపించి జాబ్ క్యాలెండర్ విడుదలకు సన్నాహాలు చేస్తోంది. తప్పకుండా జాబ్ క్యాలెండర్ ప్రకటించి దాని ప్రాప్తికి ఉద్యోగాల నియామకం చేపడతామని మంత్రి నారా లోకేష్ బహిరంగ ప్రకటన కూడా చేశారు.

Also Read: సజ్జలను సైడ్ చేసిన జగన్!

90 వేల వరకు ఖాళీలు..
దాదాపు ప్రభుత్వ శాఖల్లో( government departments ) ఓ 90 వేల వరకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా రెవెన్యూ, పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, వైద్య ఆరోగ్యశాఖలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోలీస్ శాఖలో సైతం కిందిస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు కొరత ఉంది. అయితే అన్ని శాఖల్లో పదోన్నతుల ద్వారా విభాగాధిపతుల నియామకం జరుగుతోంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది నిలిచిపోయింది. అందుకే కీలక పోస్టుల భర్తీతో పాటు దిగువ స్థాయి సిబ్బంది నియామకానికి సంబంధించి ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. 2029 ఎన్నికల వరకు ఉద్యోగాల నోటిఫికేషన్లను వరుసగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగా ఈ ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు అన్ని సన్నాహాలు చేస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular