Pawan Kalyan Comments: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై( AP deputy CM Pawan Kalyan ) స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు మాజీ మంత్రి పేర్ని నాని. ప్రకాశం జిల్లాలో జలజీవన్ మిషన్ పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు పవన్. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రానివ్వనని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. కూటమి కొనసాగుతోందని.. ఏ పార్టీని నియంత్రించలేదని.. తనకు అనుభవం లేదని.. సీఎం చంద్రబాబు పాలన అనుభవంతో ఆర్థికంగా రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారని చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ కు ధీటుగా బదులిచ్చారు మాజీమంత్రి పేర్ని నాని.
Also Read: జగన్ పై అభిమానం.. కూటమిపై తిట్ల వర్షం.. సికాకుళం యాసలో తిడితే ఆ కిక్కే వేరప్పా
2019లో చెప్పారుగా..
ఈరోజు మీడియా సమావేశంలో పేర్ని నాని( perni Nani ) మాట్లాడారు. 2019లో ఇదే మాదిరిగా పవన్ ప్రకటనలు చేశారని.. జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రానివ్వనని చెప్పుకున్నారని.. కానీ అప్పుడు ఏమైందని ప్రశ్నించారు. ఎవరిని ముఖ్యమంత్రి చేయాలో.. అది ప్రజలు తేల్చుకోవాల్సిన అంశమని.. అసలు పవన్ నువ్వెవడివి అంటూ తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. సినిమా డైలాగులు చెబుతున్నవి తమరు అంటూ బదులిచ్చారు. తప్పుడు మాటలు అంటే బాగుండదని కూడా హెచ్చరించారు. ప్రస్తుతం పేర్ని నాని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: ఇండో సోల్ సోలార్ కంపెనీతో కూటమి ప్రభుత్వం కుమ్మక్కయిందా?
ప్రజల మధ్యకు రావాలి
చంద్రబాబు( CM Chandrababu) పాలిస్తారని.. తాను పోరాడుతానని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. దానిపై మాట్లాడారు పేర్ని నాని. చంద్రబాబు అవసరాల కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ పనిచేస్తారని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఖూనీ జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేసులతో ఉక్కు పాదం మోపుతుంటే కనిపించడం లేదా అని నిలదీశారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. ప్రస్తుతం కేసులతో వైసిపి నేతలు కొట్టుమిట్టాడుతున్న తరుణంలో.. పేర్ని నాని పవన్ కళ్యాణ్ కు లెక్కలతో పని చెప్పడం విశేషం. గట్టిగానే తన వాయిస్ వినిపిస్తూ హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం పేర్ని నాని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నువ్వు ఎవరివి పవన్ కళ్యాణ్ .. జగన్ ను మళ్లీ అధికారంలోకి రానివ్వను అనడానికి? : పేర్ని నాని
ఒకరిని సీఎం చేయాలన్నా, వద్దు అన్నా అంతిమ తీర్పు ప్రజలదే అని గుర్తుపెట్టుకోవాలి – మాజీ మంత్రి పేర్ని నాని pic.twitter.com/JipqxCYttq
— ChotaNews App (@ChotaNewsApp) July 5, 2025