Homeఆంధ్రప్రదేశ్‌Roja Tamil Nadu Election Statement: వైసీపీని ఇరకాటంలో పెట్టిన రోజా!

Roja Tamil Nadu Election Statement: వైసీపీని ఇరకాటంలో పెట్టిన రోజా!

Roja Tamil Nadu Election Statement: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ తమిళనాడు ఎన్నికల్లో స్టాలిన్ పార్టీకి మద్దతుగా నిలవాలని చూస్తోంది. ఎందుకంటే తమిళనాడులో తెలుగు ప్రజలు అధికం. ఆపై రాయలసీమకు దగ్గరగా ఉంటుంది తమిళనాడు. ఈ క్రమంలో మరికొద్ది రోజుల్లో జరిగే ఎన్నికల్లో స్టాలిన్ పార్టీ గెలవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా కోరుకుంటుంది. కరుణానిధి ఉండే సమయంలో చంద్రబాబుతో ఆయనకు మంచి సంబంధాలు ఉండేవి. స్టాలిన్ విషయానికి వస్తే చంద్రబాబుతో మంచి సంబంధాలే కానీ.. కేంద్రంలో బిజెపితో టిడిపి ఉండడంతో స్టాలిన్ స్నేహానికి అడ్డంకిగా మారింది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డితో మంచి సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు స్టాలిన్. ఈ నేపథ్యంలో తమిళనాడు ఎన్నికల్లో స్టాలిన్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు సమాచారం.

* బలం పెంచుకోవాలనుకుంటున్న బిజెపి.. తమిళనాడులో( Tamil Nadu ) బలం పెంచుకోవాలని చూస్తోంది భారతీయ జనతా పార్టీ. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు షేర్ పెరిగింది ఆ పార్టీకి. సీట్ల పరంగా ఒక్కటి కూడా రాకపోయినా ఓట్ల పరంగా మాత్రం మెరుగుపడింది. అందుకే ఈసారి మిత్రులతో ముందుకు సాగాలని నిర్ణయించింది. ఎట్టి పరిస్థితుల్లో అధికార పార్టీకి ధీటుగా నిలబడాలని చూస్తోంది. ఏ అవకాశాన్ని జారవిడుచుకోవడం లేదు. ఇటువంటి సమయంలో స్టాలిన్ పార్టీకి మద్దతుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలవనుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కచ్చితంగా ఇది భారతీయ జనతా పార్టీకి మింగుడు పడని విషయం.

* మద్దతుగా ప్రచారం..
స్టాలిన్ ( CM Stalin) పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు మాజీమంత్రి ఆర్కే రోజా. స్టాలిన్ పాలనను మెచ్చుకొని ఆయన మరోసారి అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. అవసరం అనుకుంటే డీఎంకేకు మద్దతుగా ప్రచారం చేస్తానని కూడా తేల్చి చెప్పారు. అయితే దీనిపై భారతీయ జనతా పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏపీలో కూటమిలో భాగస్వామిగా ఉంది బిజెపి. బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో టిడిపి కీలక భాగస్వామిగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆచితూచి వ్యవహరిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఏపీలో కూటమిపై విమర్శలు చేస్తుందే తప్ప.. కేంద్ర బిజెపిని పల్లెత్తు మాట అనడం లేదు. అయితే ఇప్పుడు తమిళనాడులో వైసిపి తీసుకున్న స్టాండ్ తో బిజెపి ఎలాంటి చర్యలకు దిగుతుందో చూడాలి. అయితే ఇప్పటివరకు కేంద్ర బిజెపి విషయంలో వైసీపీ సానుకూల నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. లోక్సభ స్పీకర్ ఎంపిక నుంచి పార్లమెంట్లో ప్రవేశపెట్టి పలు బిల్లుల వరకు మద్దతు తెలిపింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అటువంటిది తమిళనాడులో డీఎంకే కూటమికి మద్దతు అంటే సాహసంతో కూడుకున్న పని. అయితే అది రోజా స్వయంగా తీసుకున్న నిర్ణయమా? పార్టీ తీసుకున్న నిర్ణయమా? అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ రోజా సొంతంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం వైసీపీని ఇరకాటంలో పెట్టినట్టే..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Dharmendra Pradhan

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Samsung Galaxy S25

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...
Festivals this year

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....
YCP Leaders

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....
Oktelugu Epaper