Homeఆంధ్రప్రదేశ్‌Yanamala Ramakrishnudu controversy: ఆ సీనియర్ నేతకు ఇబ్బందిగా డ్రగ్స్ కలకలం!

Yanamala Ramakrishnudu controversy: ఆ సీనియర్ నేతకు ఇబ్బందిగా డ్రగ్స్ కలకలం!

Yanamala Ramakrishnudu controversy: తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారం కాదు కానీ.. ఏపీలో మాత్రం ఓ సీనియర్ నేతకు ఇది మాయని మచ్చ. తన రాజకీయ ప్రస్థానంలో ఏ మచ్చ లేకుండా కొనసాగుతున్నారు సీనియర్ మోస్ట్ లీడర్ యనమల రామకృష్ణుడు( yanamalai Ramakrishnudu ). ఇప్పుడు తెలంగాణలో డ్రగ్స్ తీసుకున్నట్టు భావిస్తున్న పుట్టా మహేష్ కుమార్ యాదవ్ స్వయాన రామకృష్ణుడు అల్లుడు. అయితే ఇది పొలిటికల్ గా తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ చేస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. అందుకే పార్టీ వ్యవహారాలకు మహేష్ కుమార్ యాదవ్ ను దూరంగా ఉంచింది. మరోవైపు మహేష్ తండ్రి టిడిపి ఎమ్మెల్యే సుధాకర్ రెడ్డి. ఆయన గతంలో టీటీడీ చైర్మన్గా వ్యవహరించారు. ప్రస్తుతం మైదాకూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. అటు మహేష్ భార్య దివ్య తుని ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే ఇప్పటివరకూ మహేష్ కుటుంబ ప్రస్తావన పెద్దగా పైకి రాలేదు. డ్రగ్స్ కలకలం తోనే ఇదంతా బయటకు వచ్చింది. ముఖ్యంగా యనమల రామకృష్ణుడు తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది.

టిడిపిలో తనదైన ముద్ర..
తెలుగుదేశం పార్టీలో( Telugu Desam Party) తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు యనమల రామకృష్ణుడు. పార్టీలో క్రమశిక్షణ కలిగిన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. రాజకీయ ప్రత్యర్థులపై ఆయన సునిసితంగా విమర్శలు చేయగలరు. రాజకీయ ప్రత్యర్థులు సైతం ఆయనను గౌరవిస్తారు. అటువంటిది అల్లుడు డ్రగ్స్ తీసుకుని దొరికిపోవడం నిజంగా ఆయనకు లోటు. పైగా తెలుగుదేశం పార్టీలో ఒకే కుటుంబానికి ఇన్ని అవకాశాలు ఇచ్చారా అనేది ఒక చర్చ నడుస్తోంది ఈ పరిణామంతో. ఇప్పటికే యనమల రామకృష్ణుడుకు గౌరవప్రదమైన పదవి ఇవ్వాలన్న విజ్ఞప్తులు పార్టీలో ఉన్నాయి. ఎందుకంటే పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు గౌరవప్రదమైన పదవీ విరమణ కోరుకుంటున్నారు.

ఒకే కుటుంబంలో అవకాశాలు..
ప్రత్యేక పరిస్థితుల నడుమ మొన్న ఎన్నికలు జరిగాయి. పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపు అనేది కష్టంగా మారింది. చాలా రాజకీయ కుటుంబాలకు ఒక్కటే టికెట్ లభించింది. కానీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ విషయంలో మాత్రం చాలా అవకాశాలు దక్కాయి. అప్పటికే ఎమ్మెల్సీగా యనమల రామకృష్ణుడు ఉన్నారు. ఆయన అల్లుడితోపాటు కుమార్తెకు సైతం చాన్స్ ఇచ్చారు. అదే సమయంలో వియ్యంకుడికి రాయలసీమలో టిక్కెట్ ఇచ్చారు. ఇన్ని అవకాశాలు తీసుకున్నాక కూడా మహేష్ కుమార్ యాదవ్ ఇటువంటి తప్పుచేసి కుటుంబాన్ని బయటపెట్టేశారు అనేది ఒక విమర్శ ఉంది. అన్నింటికీ మించి యనమల రామకృష్ణుడు పై ఈ ప్రభావం ఉంటుందన్న టాక్ నడుస్తోంది. దానికి కారణం లేకపోలేదు.

పదవికి ఎదురు చూస్తుండగా..
ప్రస్తుతం యనమల రామకృష్ణుడు మంచి పదవి కోసం ఎదురుచూస్తున్నారు. ఆయనకు గవర్నర్ పోస్ట్ కానీ.. రాజ్యసభ పదవి కాని ఇస్తారని ప్రచారంలో ఉంది. అయితే ఇప్పటికే అశోక్ గజపతిరాజుకు గవర్నర్గా ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు యనమల కోరుకుంటున్నట్లు రాజ్యసభ పదవి ఇస్తారన్న అంచనాలు ఉన్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే అల్లుడు డ్రగ్స్ కేసులో చిక్కుకోవడం ఆయనకు మైనస్ గా మారింది. ఒకవైపు అదే కుటుంబంలో అన్ని పదవులు ఇచ్చాక కూడా యనమలకు రాజ్యసభ ఇవ్వడం ఏమిటనే ప్రశ్న వినిపిస్తోంది. కొద్ది రోజులపాటు ఆ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం మేలని ఎక్కువ మంది సూచిస్తున్నారు. కానీ యనమల క్రమశిక్షణతో పాటు ఆయన సీనియారిటీ చంద్రబాబుకు తెలుసు. కచ్చితంగా గౌరవప్రదమైన పదవి ఇస్తారని యనమల అనుచరులు చెబుతున్నారు. అయితే తాజా పరిణామాలతో త్వరలో భర్తీ చేయబోయే నాలుగు రాజ్యసభ పదవుల్లో యనమలకు ఒకటి దక్కుతుందో? లేదో? చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper