Homeఆంధ్రప్రదేశ్‌YSR Congress Future Strategy: మావిగన్ సరే.. వాట్ ఈజ్ నెక్స్ట్ జగన్

YSR Congress Future Strategy: మావిగన్ సరే.. వాట్ ఈజ్ నెక్స్ట్ జగన్

YSR Congress Future Strategy: ప్రతి రాజకీయ పార్టీ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటుంది. తిరిగి ప్రజల మద్దతు పొందాలని చూస్తుంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం సాగు చట్టాలను తెచ్చింది. కానీ వ్యతిరేకత రావడంతో ఉపసంహరించుకుంది. ఏపీలో మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఈ అంశాల పైన ప్రజా వ్యతిరేకత వచ్చిందో.. వాటి జోలికి వెళ్తోంది. ఇప్పుడు రాజధాని విషయంలో కూడా అదే జరిగింది. మావిగన్ అనే కొత్త ప్రతిపాదన తెచ్చి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళిపోయారు. అయితే ఆ మావిగన్ పై ఎలా ముందుకు వెళ్లాలో తెలియడం లేదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు. ఏ మాట అంటే ప్రజల నుంచి ఏ స్థాయి విమర్శ మూటగట్టుకోవాల్సి వస్తుందోనన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది.

Also Read: ప్రదీప్ రంగనాథన్ ‘LIK’ మూవీ మొట్టమొదటి రివ్యూ.. ఇలాంటి కాన్సెప్ట్ తో ఇండియాలో ఇదే తొలి సినిమా..

* గందరగోళంలో వైసీపీ క్యాడర్..
ప్రజలు మూడు రాజధానుల రాగాన్ని తిరస్కరించారు.. ఇప్పుడు అధినేత జగన్ మావిగన్ ప్రతిపాదన తెచ్చారు. దీంతో ప్రజలకు ఏం చెప్పాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు తెలియడం లేదు. అమరావతిని స్మశాన వాటికతో కూడా పోల్చారు. దానిని ప్రజలు ఎవరూ మరువలేదు. పోనీ తాను సూచించిన మూడు రాజధానులపై మొన్నటి ఎన్నికల్లో ప్రస్తావన చేయలేదు. అయితే ప్రజలు మాత్రం అభివృద్ధి కోరుకుంటూ కూటమికి అవకాశం ఇచ్చారు. కానీ ఎప్పటికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాత పగలు, అసంబద్ధ వాదనలకే పరిమితం కావడం చూస్తుంటే మాత్రం ఆ పార్టీకి ఇబ్బందికరమే. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఆ పార్టీ చిన్న అవకాశం దొరికితే ఎదగాలని ప్రయత్నించాలి. కానీ లేనిపోని వివాదాలు కొనితెచ్చుకుంటుంది.

* తటస్థులపై ప్రభావం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మునుపటి మాదిరిగా లేదు. ఎందుకంటే 2014లో ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ చాలా యాక్టివ్ గానే ఉండేది. ప్రభుత్వ వైఫల్యాలతో పాటు ప్రజా సమస్యలను గుర్తించి మరీ పోరాటం చేసింది. 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత ఎందుకో ఆ పోరాట పటిమ కనిపించలేదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో. ప్రజల నాడిని పట్టుకోవడంలో కూడా వైసిపి నాయకత్వం విఫలమైంది. కేవలం అమరావతిపై బురద జల్లడం మాత్రమే తెలిసినట్టు ఉంది ఆ పార్టీకి. ఇప్పటికే అనవసరంగా అమరావతి జోలికి వెళ్లి తాటస్థులతో పాటు మేధావి వర్గానికి వ్యతిరేకంగా మారిపోయింది. అనవసరంగా ఇప్పుడు అమరావతిని వ్యతిరేకించి జాతీయస్థాయిలో కూడా చులకన అయింది. ఒక్కటంటే ఒక్క పార్టీ కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేదు. చివరకు కెసిఆర్ పార్టీ కూడా రాజ్యసభలో అమరావతికి అనుకూల మద్దతు తెలిపింది. అయితే ఈ నిర్ణయాలతో జగన్మోహన్ రెడ్డి సొంత క్యాడర్ కూడా దూరమయ్యే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన నిలబడాల్సింది పోయి.. లేనిపోని వివాదాలను సృష్టించుకుని నవ్వుల పాలు కావడం ఏంటి అనే ప్రశ్న వినిపిస్తోంది. మావిగన్ తో డ్యామేజ్ కంట్రోల్ ఘాటు వెళ్లిపోయింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మౌనం తప్పించి మరో మార్గం లేదు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper