Tirumala Tirupati Devasthanams: నిత్య కళ్యాణం.. పచ్చ తోరణం గా భాసిల్లుతూ ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ దేవస్థానానికి చైర్మన్ అంటే మామూలు విషయం కాదు. స్వామివారి సేవ చైర్మన్ హోదాలో చేసుకోవడానికి చాలామంది పోటీ పడుతుంటారు. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి పాలకమండలి… చైర్మన్ ను నియమించడం నిత్యం ఒక ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే దీనికి అధికంగా పోటీ ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తలు.. ఇతర వ్యక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో తమ వ్యక్తులను నియమించాలంటూ సిఫారసులు చేస్తూ ఉంటారు.
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రస్తుతం చైర్మన్ హోదాలో బిఆర్ నాయుడు కొనసాగుతున్నారు. ఈయన టీవీ5 న్యూస్ ఛానల్ చైర్మన్ కూడా. ఈయన ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక రకాల కార్యక్రమాలు మొదలుపెట్టారు.. కొన్ని వివాదాలు బిఆర్ నాయుడు పనితీరును వివాదాస్పదం చేశాయి. ఇటీవల కాలంలో దర్శనాలు.. టికెట్ల జారీ.. భక్తుల ఇబ్బందులు.. ఇలాంటి అనేకాంశాలు తెరమీదకి వస్తున్న నేపథ్యంలో ఈసారి బిఆర్ నాయుడు కు ఎక్స్ టెన్షన్ ఉండకపోవచ్చు అని వార్తలు వస్తున్నాయి. ఇదే క్రమంలో కొత్త చైర్మన్ గా ఎవరూ ఊహించని వ్యక్తిని నియమిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
తిరుమల తిరుపతి దేవస్థానానికి కాబోయే చైర్మన్గా శ్రీనివాస రామానుజం అనే వ్యక్తి పేరు వినిపిస్తోంది. ఆయన పేరు లోకాద్రి నాయుడు అని తెలుస్తోంది. ఈయనది తిరుపతి.. విద్య.. సామాజిక.. వ్యాపార రంగాలలో ఈయనకు సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. తిరుపతిలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో ఈయన విజయ ఎడ్యుకేషనల్ సోసైటీకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ , నామినిగా కొనసాగుతున్నారు. శ్రీనివాస రామానుజం పేరు శ్రీ సత్యసాయి సేవా కార్యక్రమాలలో కూడా కనిపిస్తోంది. తిరుపతిలోని శ్రీ సత్య సాయి గ్రామీణ సేవా కేంద్రానికి సంబంధించిన ఒక అధికారిక సర్కులర్ లో కూడా ఆయన పేరు నమోదయి ఉంది. ఆయన పేరు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి చిత్తూరు జిల్లా వెబ్సైట్లో లియాన్ ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు సంబంధించిన వివరాలలో లోకాద్రి నాయుడు అలియాస్ శ్రీనివాస రామానుజం పేరు నమోదు. ఈ కంపెనీ పండ్ల గుజ్జు.. కాన్సన్ట్రేట్స్ తయారీ రంగంలో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక 2024 లో తిరుపతి ప్రాంతంలోని కీలక పదవులపై వచ్చిన రాజకీయ చర్చలలో కూడా నాడు లోకాద్రి నాయుడు పేరు ప్రస్తావనకు వచ్చింది.. అయితే ఈయనకు తిరుమల తిరుపతి దేవస్థానం పగ్గాలు అప్పగిస్తారని సమాచారం.
పైగా ఈయనకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తో దగ్గరి సంబంధాలు ఉన్నాయి. నరేంద్ర మోడీ.. అమిత్ షా తో నేరుగా మాట్లాడగలిగే చొరవ ఈయన సొంతం. గతంలో అనేక రకాలు వ్యాపారాలు చేసి ఇబ్బంది పడ్డారు. అప్పలపాలయ్యారు. ఒక దశలో తిరుపతి ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోయారు. ఆ తర్వాత పాల వ్యాపారం.. మైనింగ్ వ్యాపారం మొదలుపెట్టారు. అనంతరం తీసుకున్న అప్పులను మొత్తం తిరిగి చెల్లించారు. ఆ తర్వాత తన పేరును శ్రీనివాస రామానుజం అని మార్చుకున్నారు. ఈయన తండ్రి వాస్తు సిద్ధాంతిగా ఉన్నారు. ఈయన వద్దకు నందమూరి హరికృష్ణ అప్పట్లో వచ్చేవారు.. సెలబ్రిటీలకు శ్రీనివాస రామానుజన్ వాస్తు.. ఇతర వ్యవహారాలలో సలహాలు ఇచ్చేవారు. చాలామంది ఈయన సూచనలు పాటించేవారు. ఆయన కుమారుడే లోకాద్రి నాయుడు అలియాస్ శ్రీనివాస రామానుజం.. కేంద్ర పెద్దలతో బలమైన సంబంధాలు.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో అనుబంధం.. ఇలా అనేక అంశాలలో ఈయనకు గట్టి పట్టు ఉండడంతో.. కాబోయే తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ అని ప్రచారం జరుగుతుంది. మరి దీనిపై ఏపీ ప్రభుత్వం అధికారికంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.