Amaravathi Capital: అమరావతికి వైసిపి జై కొట్టాల్సిందే.. మూడు రాజధానులు అంటే చెల్లదిక!

గత ఐదేళ్ల వైసిపి పాలనలో అమరావతి నిర్వీర్యమైంది. మూడు రాజధానుల విషయంలో అడుగు ముందుకు వేయలేకపోయింది. అనుకున్నది సాధించలేకపోయింది. ఇప్పుడు అమరావతికి జై కొట్టాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది.

Written By: Dharma, Updated On : August 17, 2024 12:49 pm

Amaravathi Capital

Follow us on

Amaravathi capital: మూడు రాజధానుల అంశాన్ని వైసిపి పక్కన పెట్టినట్టేనా? ఆ స్టాండ్ కు కాలం చెల్లినట్టేనా? అమరావతికి జై కొట్టక తప్పదా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదో ఆసక్తికర చర్చ నడుస్తోంది. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది. అందరి ఆమోదంతో రాజధానిగా అమరావతిని ఎంపిక చేసింది. కానీ వైసీపీ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. అమరావతిని కేవలం శాసన రాజధానికి పరిమితం చేసింది. పాలనా రాజధానిగా విశాఖను ప్రకటించింది. దీంతో అమరావతి రైతులు పోరాట బాట పట్టారు. సుదీర్ఘకాలం పోరాటం చేశారు. అయినా వైసీపీ వెనక్కి తగ్గలేదు. ఇంతలో హైకోర్టు సైతం అమరావతి ఏకైక రాజధాని అని తేల్చి చెప్పింది. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది నాటి వైసిపి ప్రభుత్వం. ప్రస్తుతం ఆ కేసు పెండింగ్లో ఉంది. ఇంతలో ప్రజాక్షేత్రంలో అమరావతికి ప్రజలు మద్దతు తెలిపారు. ఎన్నికల్లో వైసీపీకి దెబ్బతీశారు. రాజధాని ప్రకటించిన విశాఖలో సైతం ఓడించారు. అమరావతి ప్రాంతంలోమరి ఘోరంగా ఓడించారు. దీంతో వైసిపి రెండిటికి చెడ్డ రేవడిగా మారింది.

* శరవేగంగా అమరావతి
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానికి కొత్త కళ వచ్చింది. జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. నిపుణులు నివేదికలు ఇచ్చారు. అటు కేంద్రం సైతం 15 వేల కోట్ల రూపాయల సాయం ప్రకటించింది. వివిధ సంస్థల రాక ప్రారంభమైంది. కార్యకలాపాలు మొదలుకానున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ స్పందన ఏంటి? అన్నది తెలియడం లేదు.

* సంకేతాలు ఇచ్చిన వైసిపి
కేంద్ర బడ్జెట్లో అమరావతి రాజధాని కి 15000 కోట్ల రూపాయలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇది ప్రపంచ బ్యాంకు నుంచి అపురూపంలో అందించినదని తెలియడంతో వైసిపి అభ్యంతరం వ్యక్తం చేసింది. నేరుగా గ్రాంట్ రూపంలో మంజూరు చేయాలని వైసిపి ఎంపీలు కోరారు. దీంతో అమరావతికి ఇండైరెక్టుగా జై కొట్టినట్లేనని తేలింది. అయితే నేరుగా వైసీపీ మాత్రం అమరావతి గురించి మాట్లాడిన దాఖలాలు లేవు.

* ఇప్పుడంత ప్రాధాన్యం లేదు
మరోవైపు ఇప్పుడు వైసీపీ మూడు రాజధానులు అన్న పట్టించుకునే వారు లేరు. అలాగని అమరావతికి మద్దతు తెలిపిన అక్కడ ప్రజలు పట్టించుకోరు. అందుకే ఎలాంటి భావన వ్యక్తం చేయడం లేదు. గత ఐదేళ్లుగా అమరావతిని వ్యతిరేకించి.. ఇప్పుడు ఏ మొఖం పెట్టుకొని సమర్థిస్తామని వైసిపి నేతలు బాహటంగానే చెబుతున్నారు. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో అమరావతి రాజధానిని కదిలించే ఛాన్స్ లేకుండా చట్టం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే ఇంత జరిగాక అమరావతి రాజధానిని కదిలించేందుకు ఎవరూ ప్రయత్నించరు. అటువంటి ప్రయత్నాలను ప్రజలు కూడా హర్షించరు. మొత్తానికైతే వైసీపీ మూడు రాజధానులు అంశం కనుమరుగైనట్టే.