Mr Bachchan Movie Collection: 2 రోజులకే క్లోసింగ్.. ప్రమోషన్ ఖర్చులను కూడా రాబట్టలేకపోయిన ‘మిస్టర్ బచ్చన్’

ఒకప్పుడు రవితేజ సినిమా వస్తుందంటే మొదటి రోజు మొదటి ఆట చూసేయడం ఆడియన్స్ కి ఒక అలవాటు గా ఉండేది. కానీ ఇప్పుడు రవితేజ సినిమా అంటే, ఆమ్మో రవితేజ సినిమానా?, ఎందుకులే టీవీ లో వచ్చినప్పుడు చూసుకుందాం అని అనుకునే స్థాయికి పడిపోయింది.

Written By: Vicky, Updated On : August 17, 2024 12:40 pm

Mr Bachchan Movie Collection

Follow us on

Mr Bachchan Movie Collection: మాస్ మహారాజ రవితేజ అంటే ఒక బ్రాండ్..సూపర్ స్టార్ లీగ్ లో ఉండాల్సిన హీరో, ఆ రేంజ్ టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ ఆయన. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా, చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ, క్యారక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన, ఆ తర్వాత హీరోగా మారి ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, ఖడ్గం, వెంకీ, దుబాయ్ శ్రీను, భద్ర, కృష్ణ, కిక్, విక్రమార్కుడు, నేనింతే, బలుపు, క్రాక్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటా రెండా ఎన్నో సూపర్ హిట్లు, సెన్సేషనల్ బ్లాక్ బూస్టర్లు, ఇండస్ట్రీ రికార్డ్స్ ని షేక్ చేసిన సినిమాలు తీసిన హీరో. కానీ ఈమధ్య ఎడాపెడా చేతికి దొరికిన స్క్రిప్ట్ తో సినిమాలు చేస్తూ తనకి ఉన్న మార్కెట్ మొత్తాన్ని సర్వ నాశనం చేసుకుంటూ ముందుకు పోతున్నాడు.

ఒకప్పుడు రవితేజ సినిమా వస్తుందంటే మొదటి రోజు మొదటి ఆట చూసేయడం ఆడియన్స్ కి ఒక అలవాటు గా ఉండేది. కానీ ఇప్పుడు రవితేజ సినిమా అంటే, ఆమ్మో రవితేజ సినిమానా?, ఎందుకులే టీవీ లో వచ్చినప్పుడు చూసుకుందాం అని అనుకునే స్థాయికి పడిపోయింది. ఆయన అభిమానులు ఎప్పటి నుండో రవితేజ నుండి ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రాజా ది గ్రేట్ తర్వాత రవితేజ సుమారుగా 12 సినిమాలు చేస్తే, అందులో కేవలం క్రాక్, ధమాకా చిత్రాలు మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. మిగిలిన సినిమాలన్నీ అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నాయి. చాలా కాలం తర్వాత హరీష్ శంకర్ లాంటి క్రేజీ కమర్షియల్ డైరెక్టర్ తో సినిమా ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం చేస్తున్నాడు కదా, కచ్చితంగా ఈ సినిమాతో భారీ కం బ్యాక్ ఇస్తాడని అందరూ అనుకున్నారు. విడుదలకు ముందు పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ సినిమా పై అంచనాలను అమాంతం పెంచేసాయి. ఇక ప్రొమోషన్స్ అయితే చెప్పక్కర్లేదు.

టీజర్, ట్రైలర్, ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇలా ఎన్నో ఈవెంట్స్ చేశారు. కేవలం ఇలాంటి ప్రొమోషన్స్ కోసం నిర్మాత చేత ఆరు కోట్ల రూపాయిల వరకు డైరెక్టర్ హరీష్ శంకర్ ఖర్చు చేయించాడు అని టాక్ నడుస్తుంది. మొదటి రోజు ఈ చిత్రానికి కేవలం 4 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, రెండవ రోజు ఈ చిత్రానికి కోటి రూపాయిల లోపే షేర్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్ గా చూసుకుంటే, ఈ చిత్రం క్లోసింగ్ లో ఆరు కోట్ల రూపాయిల కంటే తక్కువ షేర్ ని రాబట్టే ప్రమాదం ఉందట. అంటే ప్రొమోషన్స్ కోసం నిర్మాత చేసిన ఖర్చులను కూడా ఈ చిత్రం రాబట్టలేకపోయింది అన్నమాట. స్టార్ హీరోల లీగ్ లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు స్థాయి రెమ్యూనరేషన్ తీసుకునే రేంజ్ నుండి నేడు కనీసం ప్రమోషన్ ఖర్చులను కూడా రాబట్టలేని రేంజ్ కి పడిపోయాడంటే, రవితేజ మార్కెట్ ఏ స్థాయిలో పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇక నుండి అయినా ఆయన తన అభిమానులకు తగ్గట్టుగా సినిమాలు చేస్తాడో, లేకపోతే ఉన్న ఈ కాస్త మార్కెట్ ని కూడా పోగొట్టుకుంటాడో చూడాలి.