Homeఆంధ్రప్రదేశ్‌TDP Joining Conditions :ఆ నేతలకు టిడిపి డోర్ క్లోజ్!

TDP Joining Conditions :ఆ నేతలకు టిడిపి డోర్ క్లోజ్!

TDP Joining Conditions : తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) అప్రమత్తం అయ్యింది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు చూసి జాగ్రత్త పడుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేరిన వారితో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. హత్య రాజకీయాల వరకు పరిస్థితి దారితీసింది. అందుకే వైసీపీ నుంచి చేరికల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని.. అన్ని సవ్యంగా ఉంటేనే వారిని చేర్చుకోవాలని కిందిస్థాయి నాయకత్వానికి సూచిస్తుంది రాష్ట్ర నాయకత్వం. గత ఎన్నికలకు ముందు.. ఫలితాలు వచ్చిన తర్వాత నేతల నుంచి ద్వితీయ శ్రేణి నాయకుల వరకు టిడిపిలో చేరారు. అటువంటి వారి చేరికతో టిడిపి బలపడింది. కానీ అదే స్థాయిలో విభేదాలు కూడా ఎక్కువవుతున్నాయి. అవి పార్టీకి మైనస్ గా మారాయి. అందుకే ఈ చేరికల విషయంలో బ్రేక్ చెప్పాలని ప్రభుత్వం భావిస్తోంది.

Also Read : ఆహా ఎంత బాగా తిడుతున్నావ్ సామీ.. ఓ వర్గానికి నువ్వు ఇన్ స్పిరేషన్ అంతే!

* తప్పకుండా షరతులు..
టిడిపిలో చేరాలనుకునే వారికి షరతులు వర్తిస్తాయి అంటోంది ఆ పార్టీ హై కమాండ్. చేరికల విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.’ టిడిపి అధినేత చంద్రబాబు( TDP chief Chandrababu) ఆదేశానుసారం ఇతర పార్టీ నాయకులను టిడిపిలోకి జాయిన్ చేసుకునే ముందు తప్పనిసరిగా వారి గురించి కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలి. వారి గురించి పూర్తిగా కేంద్ర కార్యాలయం విచారణ చేసిన తర్వాత పార్టీ అనుమతితో వారిని ఆహ్వానించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు అందరూ గమనించగలరు’ అంటూ మంగళగిరి కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల తెలుగుదేశం పార్టీలో జరిగిన పరిణామాల దృష్ట్యా హై కమాండ్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

* కేంద్ర కార్యాలయానికి సమాచారం ఇవ్వాల్సిందే
గత మాదిరిగా పార్టీలో చేరాలనుకునే వారికి చేర్చుకుంటామంటే కుదరదు. కచ్చితంగా కేంద్ర కార్యాలయానికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ నుంచి అనుమతి వచ్చిన తర్వాతే టిడిపిలో చేరికలు ఉంటాయని స్పష్టత ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున టిడిపిలో చేరారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నేతలు అధికార పార్టీలోకి వచ్చారు. అయితే వీరిలో కొందరు కోవర్టులు ఉన్నారని సీఎం చంద్రబాబు స్వయంగా కడప మహానాడు వేదికగా కామెంట్ చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు ఇస్తామన్నారు. కొవ్వొత్తులను పార్టీలోకి పంపాలనుకుంటే ఆటలు సాగవని.. వలస పక్షులు వస్తాయి.. పోతాయి అంటూ కామెంట్స్ చేశారు. కొవ్వొత్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.

* కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యం..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన వారితో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. మొదటినుంచి జండా మోసిన వారిని కాదని కొత్తగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యమిస్తున్నారని హై కమాండ్ కు ఫిర్యాదులు వెల్లువెత్తుతాయి. ఈ పరిస్థితుల్లోనే హై కమాండ్ ఈ ప్రత్యేక ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ సైతం తమ పార్టీ శ్రేణులకు మరోసారి అల్టిమేటం ఇచ్చారు. పార్టీ లైన్ దాటి మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. రెండు పార్టీలు ఏకకాలంలో ఈ ప్రకటన చేయడంపై భిన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిఘా వర్గాల హెచ్చరికతోనే ఈ రెండు పార్టీలు అలాంటి ప్రకటన చేసి ఉంటాయని అనుమానాలు వస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular