Post Office Schemes: హాయిగా ఉండాల్సిన సమయంలో ఆర్థిక భద్రత ఉండాలంటే ఇప్పటినుంచే సరైన పథకాలలో చిన్న చిన్న మొత్తంలో అయినా సరే పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి. సీనియర్ సిటిజన్స్ కి ప్రభుత్వం ఒక పొదుపు పథకాన్ని ప్రారంభించింది. ఎస్సీ ఎస్ఎస్ అనే ఈ పథకం ముఖ్యంగా వృద్ధుల కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. రిటైర్ అయిన తర్వాత ఈ పథకం వాళ్లకు అండగా నిలుస్తుంది. ఎస్సి ఎస్ ఎస్ పథకం చాలా సులభమైనది అలాగే ఇందులో పెట్టుబడి పెట్టడం వలన చాలా ప్రయోజనాలు పొందొచ్చు. ఈ పథకంలో మీకు ప్రభుత్వం నుంచి వడ్డీ హామీ లభించడంతో పాటు పండు మినహాయింపు కూడా ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పోస్ట్ ఆఫీస్ లలో అలాగే గుర్తింపు పొందిన బ్యాంకులలో ఎస్సీ ఎస్ఎస్ పథకం అందుబాటులో ఉంది. ఈ పెట్టుబడితో వృద్ధులకు భవిష్యత్తులో ఆర్థిక భరోసా లభిస్తుంది. ఈ పథకం పదవి కాలం ఐదు ఏళ్ళు. 5 ఏళ్ళు పూర్తి అయిన తర్వాత మీరు దీనిని మరో మూడు ఏళ్లు పొడిగించుకోవచ్చు.
Also Read: ఆ నేతలకు టిడిపి డోర్ క్లోజ్!
మీరు ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన తర్వాత చివరి ఏడాదిలో మీకు మీరు పెట్టుబడి పెట్టిన బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ లో దరఖాస్తు చేసినప్పుడు మీకు పెరుగుదల ఎంపిక కూడా అందుబాటులో ఉంటుంది. వృద్ధులు దీంట్లో మరికొన్ని ఏళ్ళు కొనసాగించడం వలన వాళ్ళు పొదుపుపై ఎక్కువ వడ్డీని కూడా పొందవచ్చు. ముఖ్యంగా వృద్ధులకు ఇది మంచి ఆదాయ వనరుగా చెప్పవచ్చు. ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన వడ్డీ రేటును నిర్ణయిస్తుంది. ప్రతి ఏడాది కూడా ఏప్రిల్ 2024 నుంచి ఈ పథకంలో వడ్డీ రేటు 8.2% ఉంటుంది. మీకు వచ్చిన వడ్డీ మొత్తం ప్రతి మూడు నెలలకు ఒకసారి మీ బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది.
అంటే మీరు ఈ పథకంలో త్రైమాసికంలో వడ్డీ పొందుతారు. వృద్ధులకు ఈ పథకంలో నెల నెల లేదా త్రైమాసికంలో స్థిరమైన ఆదాయం లభిస్తుంది. వారి రోజువారి ఖర్చులకు ఇతర ఆర్థిక అవసరాలకు ఈ డబ్బు చాలా సహాయపడుతుంది. మీరు ప్రభుత్వ హామీతో ఉన్న ఎస్సీ ఎస్ఎస్ పథకంలో వెయ్యి రూపాయల నుంచి మొదలు పెట్టవచ్చు. గరిష్టంగా మీరు ఇందులో రూ.30 లక్షల వరకు కూడా పెట్టుకోవచ్చు. మీరు పెట్టే పెట్టుబడి రూ.1000 గుణాంకాలుగా ఉండాలి. అంటే మీరు ఈ పథకంలో రూ.10000 లేదా రూ.50వేల రూపాయలు కూడా డిపాజిట్ చేసుకోవచ్చు.