TDP: ఫేక్‌ సర్వే ఫేక్‌.. ఫలితాలూ ఫేక్‌.. టీడీపీ నవ్వులపాలు..

TDP: జూన్‌ 1న విడుదల చేసిన ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల్లో యాక్సిస్‌ మై ఇండియా సంస్థ కూడా ఏపీలో సర్వే ఫలితాలను ప్రకటించింది. ఇందులో వైసీపీ ఓడిపోతుందని పేర్కొంది. దీనిపై వైసీపీ నాయకులు మండి పడుతునారు.

Written By: Raj Shekar, Updated On : June 3, 2024 10:58 am

TDP fake survey

Follow us on

TDP: దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిడంతో ఇప్పుడు అంతా ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. జూన్‌ 1న ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు(Exit Poll Results) వచ్చాయి. దేశంలో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని దాదాపు అన్ని సర్వేలు తేల్చాయి. బీజేపీకి(BJP) భారీగా సీట్లు వస్తాయని ప్రకటించాయి. ఇక ఎవరికీ అంతు చిక్కని ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా ఎటూ తేల్చలేదు. కొన్ని వైసీపీకి అనుకూలంగా ఫలితాలు ఇవ్వగా, కొన్ని సంస్థలు టీడీపీ, జనసేన(Janasena), బీజేపీ కూటమికే మగ్గు చూపాయి. ఈ క్రమంలో ఏపీ నేతలతోపాటు ప్రజల్లో ఉత్కంఠ కొనసాగుతుంది.

టీడీపీ ఫేక్‌ సర్వే..
ఇప్పటికే గెలుపుపై ధీమా లేకపోవడంతో డీలా పడిన టీడీపీ.. తాజాగా ఎగ్జిట్‌ పోల్స్‌ను కూడా ప్రభావితం చేసిందని వైసీపీ ఆరోపిస్తోంది. మేనేజ్‌ చేయడంలో చంద్రబాబు(Chandrababu) సిద్ధహస్తుడని పేర్కొంటోంది. తాజాగా ఎగ్జిట్‌ పోల్‌ సర్వే ఫలితాలనూ ప్రభావితం చేశాడని ఆరోపిస్తోంది. ఇందుకు తగిన ఆధారాలను కూడా చూపుతోంది.

యాక్సిస్‌ మై ఇండియా సంస్థ..
జూన్‌ 1న విడుదల చేసిన ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల్లో యాక్సిస్‌ మై ఇండియా సంస్థ కూడా ఏపీలో సర్వే ఫలితాలను ప్రకటించింది. ఇందులో వైసీపీ ఓడిపోతుందని పేర్కొంది. దీనిపై వైసీపీ నాయకులు మండి పడుతునారు. ఈ సంస్థ సర్వేకు అసలు క్రెడిబులిటీ లేదని విమర్శిస్తున్నారు. రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌ ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల్లో ఈ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌ పూర్తిగా తప్పాయి. ఇప్పుడు ఈ సంస్థ ఏపీ సర్వే ఫలితాలను కూడా ఇచ్చింది. అయితే దీనిని టీడీపీ నేతలు అహో.. ఒహో అని కీర్తించడం హాస్యాస్పదంగా ఉంది. క్రెడిబులిటీ లేని సంస్థ ఇచ్చిన ఫలితాలు చూసి టీడీపీ పరువు పోగొట్టుకుంది.

Also Read: Chandrababu: చంద్రబాబు వ్యూహం సక్సెస్

ఇండియా టుడే..
ఇక ఇండియా టుడే సర్వే ఫలితాలను కూడా టీడీపీ మేనేజ్‌ చేసినట్లు వైసీపీ ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను వైసీపీ విడుదల చేసింది. ఇందులో ఏపీ మొత్తం స్థానాలను 177గా పేర్కొంది. ఇది కూడా టీడీపీ పనే అని ఆరోపిస్తున్నారు. ఎన్ని స్థానాలు ఉన్నాయో తెలియకుండా సర్వే చేశామని చెబుతున్నాయని విమర్శిస్తున్నారు. ఇలాంటి సంస్థలు టీడీపీకి అధికారం వస్తుందని సర్వేల్లో పేర్కొన్నాయని పేర్కొంటున్నారు. దీనిపై టీడీపీ నేతలు స్పందించలేదు.

కౌంటింగ్‌ ఏజెంట్లతో వీడియో కాన్ఫరెన్స్‌..
ఇక టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా టీడీపీ కౌంటింగ్‌ ఏజెంట్లతో ఆదివారం(జూన్‌ 2న) వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కౌంటింగ్‌ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఏమరుపాటుగా ఉండొద్దని సూచించారు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

Also Read: AP Elections 2024: ఏపీలో ఫలించిన బిజెపి అగ్రనేతల వ్యూహం

బాబు మేనిప్లేట్‌లో ఫస్ట్‌..
ఇక సర్వే ఫలితాలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఎగ్జిట్‌ పోల్స్‌ను కూడా చంద్రబాబు మేనేజ్‌ చేశాడని ఆరోపించారు. ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా అధికారులను ప్రభావితం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

అల్లర్లకు కుట్ర..
మరోవైపు కౌంటింగ్‌ రోజు అల్లర్లకు కొన్ని శక్తులు కుట్ర చేస్తున్నాయని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. చాలా అప్రమత్తంగా ఉండాలని కోరారు. పోలీసులు దీనిపై దృష్టిపెట్టాలని కోరారు.