AP Exit Polls: దేశంలో సర్వేల్లో క్రెడిబిలిటీ ఉన్న సంస్థల్లో యాక్సిస్ మై ఇండియా(Axis My India) ఒకటి. ఏ ఎన్నికలైనా ఆ సంస్థ సర్వే వెల్లడించిందంటే..వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. అందుకే ఎక్కువమంది మై యాక్సిస్ ఇండియా సర్వే కోసం ఎదురు చూస్తుంటారు. ఈనెల 1న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ సర్వేలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఏపీ అసెంబ్లీకి సంబంధించి మెజారిటీ సర్వేలు టిడిపి(TDP) కూటమికి అనుకూల ఫలితాలు ఇచ్చాయి.అయితే అందులోయాక్సిస్ మై ఇండియా సంస్థ లేదు. ఒకరోజు ఆలస్యంగా ఫలితాలను ప్రకటించింది.
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏపీలో టిడిపి కూటమి 21 పార్లమెంట్ స్థానాల వరకు గెలుపొంద వచ్చని అంచనా వేసింది. వైసిపి(YCP) రెండు నుంచి నాలుగు స్థానాలకే పరిమితం కానుందని తేల్చేసింది. అసెంబ్లీ స్థానాలకు సంబంధించి టీడీపీ కూటమి 98 నుంచి 120 స్థానాలను గెలిచే ఛాన్స్ ఉందని తేల్చి చెప్పింది. ఇక వైసిపి 55 నుంచి 77 సీట్లలో గెలిచే అవకాశాలు ఉన్నట్లు తేలింది. కూటమిలో టిడిపికి 78 నుంచి 96 సీట్లు దక్కే ఛాన్స్ ఉందని..జనసేనకు16 నుంచి18 సీట్లు, బిజెపికి ఆరు సీట్లు వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా ఈ సర్వే స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తే ఒక రెండు స్థానాల్లో గెలుపొందుతుందని కూడా అంచనా వేసింది.
Also Read: Chandrababu: చంద్రబాబు వ్యూహం సక్సెస్
ఓటింగ్ శాతం లో కూడా టిడిపి కూటమి ముందంజలో ఉంది. ఏకంగా 50 శాతం ఓటు షేర్ సాధించనుందని తేలింది. వైసిపి కేవలం 44% ఓటింగ్ తో సరిపెట్టుకుంది. తెలుగుదేశం పార్టీ 144 స్థానాల్లో పోటీ చేస్తే.. 41 శాతం ఓట్లు, 21 సీట్లలో పోటీ చేసిన జనసేన ఏడు శాతం ఓట్లు, పది చోట్ల పోటీ చేసిన బిజెపికి రెండు శాతం ఓట్లు దక్కినట్లు ఈ సర్వేలో తేలింది.మహిళలు, పురుషులు ఎన్డీఏకు జై కొట్టినట్లు తేల్చింది. పురుషులు 52%, మహిళలు 48% టిడిపి కూటమికి ఓటు వేసినట్లు స్పష్టమైంది.
Also Read: Exit Polls 2024: జాతీయ సర్వేలు వారికి.. లోకల్ సర్వేలు వీరికి.. ఎగ్జిట్ పోల్స్ పల్స్ పట్టాయా?
అయితే భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తేలింది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఒక ఓటు, కూటమి ఎంపీ అభ్యర్థులకు మరో ఓటు వేసినట్లు స్పష్టమైంది. పార్లమెంట్ స్థానాలకు సంబంధించి వైసీపీకి రెండు నుంచి నాలుగు స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. కానీ అసెంబ్లీ సీట్లకు సంబంధించి 70 వరకు దాటవచ్చని ఈ సర్వే ద్వారా తేలింది. ఈ లెక్కన భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు స్పష్టమైంది. అయితే గత ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థులు 23 మంది గెలిచారు. కానీ ఈసారి వైసీపీ సింగిల్ డిజిట్ కు పరిమితం అవుతుందని మై యాక్సిస్ ఇండియా సంస్థ సర్వేలో స్పష్టమైంది.