https://oktelugu.com/

Actor: ఎయిర్పోర్ట్ లో బుల్లెట్స్ తో దొరికిపోయిన నటుడు… అధికారులు షాక్!

Actor: సాధారణంగా ప్రతి ప్యాసింజర్ లగేజ్ ని ఎయిర్పోర్ట్ అధికారులు ఎంట్రన్స్ లో చెక్ చేస్తారు. చెక్ ఇన్ అనంతరం బోర్డింగ్ కి అనుమతి ఇస్తారు.

Written By: , Updated On : June 3, 2024 / 10:50 AM IST
Actor Karunas detained at chennai airport for carrying bullets

Actor Karunas detained at chennai airport for carrying bullets

Follow us on

Actor: ప్రముఖ నటుడు ఎయిర్పోర్ట్ కి తుపాకీ బుల్లెట్స్ తో వెళ్లడం కలకలం రేపింది. ఆయన బ్యాగ్ చెక్ చేసిన అధికారులు నివ్వెరపోయారు. చెన్నై ఎయిర్పోర్ట్(Chennai Airport) వేదికగా జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే నటుడు కరుణాస్ చెన్నై ఎయిర్పోర్ట్ కి తుపాకీ బుల్లెట్స్ తో వెళ్లారు. సాధారణంగా ప్రతి ప్యాసింజర్ లగేజ్ ని ఎయిర్పోర్ట్ అధికారులు ఎంట్రన్స్ లో చెక్ చేస్తారు. చెక్ ఇన్ అనంతరం బోర్డింగ్ కి అనుమతి ఇస్తారు.

నటుడు కరుణాస్(Actor Karunas) లగేజిని కూడా రెగ్యులర్ చెకప్ లో భాగంగా అధికారులు తనిఖీ చేశారు. ఆయన బ్యాగ్ లో బుల్లెట్స్ ఉండటం అధికారులు గమనించారు. మొత్తం 40 బుల్లెట్స్ ఉన్నట్లు గుర్తించారు. బ్యాగ్ లో బుల్లెట్స్ క్యారీ చేయడం పై కరుణాస్ ని అధికారులు విచారించారు. అవి తన లైసెన్స్డ్ రివాల్వర్ బుల్లెట్స్ అని కరుణాస్ సమాధానం చెప్పారు.

Also Read:Nagarjuna-Dhanush: నాగార్జున ధనుష్ లను కలుపుతున్న శేఖర్ కమ్ముల…మ్యాటరెంటంటే..?

తగు పత్రాలు చూపించడంతో అధికారులు ఆయన్ని వదిలివేశారు. వ్యక్తిగత పనిలో భాగం కరుణాస్ ఆదివారం చెన్నై నుండి తిరుచ్చి వెళుతున్నారు. ఫ్లైట్ మిస్ అవుతుందనే హడావుడిలో కరుణాస్ తన బ్యాగ్ లో ఉన్న బుల్లెట్స్ ని ఇంటి వద్ద పెట్టడం మర్చిపోయాడు. బుల్లెట్స్ తో ఎయిర్పోర్ట్ కి రావడంతో అధికారులు విమానం ఎక్కకుండా అడ్డుకున్నారు. పేలుడు పదార్థాలతో విమానంలో ప్రయాణించడం కుదరదని కరుణాస్ ని తిప్పి పంపారని తెలుస్తుంది.

Also Read: Rajamouli-Mahesh Babu: రాజమౌళి మహేష్ బాబు సినిమా విషయం లో ఏం జరుగుతుంది…

కరుణాస్ పై విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. కరుణాస్ జానపద గాయకుడిగా కెరీర్ మొదలుపెట్టాడు. దర్శకుడు బాల(Director Bala) నటుడిగా మొదటి అవకాశం ఇచ్చాడు. బాల తెరకెక్కించిన నంద చిత్రంతో కరుణాస్ వెండితెరకు పరిచయం అయ్యాడు. ప్లే బ్యాక్ సింగర్ గా కూడా పలు చిత్రాల్లో కరుణాస్ పాటలు పాడారు. కోలీవుడ్ సక్సెస్ ఫుల్ కమెడియన్స్ లో కరుణాస్ ఒకరు. 2016 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాడు.