Anil Ravipudi New Movie: సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్లను అందరు తక్కువ అంచనా వేసి మాట్లాడుతారు. కానీ వాళ్ల వల్లే సినిమాలకు ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. సినిమా రీచ్ పెరుగుతుంది. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు అందరికీ నచ్చకపోవచ్చు కానీ కమర్షియల్ సినిమాలు చాలా ఎక్కువమంది కి నచ్చుతుంటాయి… ఈ సినిమాలు ప్రేక్షకులను అన్ని రకాలుగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి. సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడు హీరోలో తనను తాను చూసుకుంటాడు కాబట్టి కమర్షియల్ సినిమాల్లో హీరో చాలా ఎఫెక్టివ్ గా ఉంటాడు. తను అనుకున్నది చేసేస్తాడు, ఎమోషనల్ గా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. ఎలివేషన్స్ విషయంలో టాప్ రేంజ్ లో ఉంటాడు. కాబట్టి స్క్రీన్ మీద అలాంటి హీరోను చూసినప్పుడు నిజ జీవితంలో మనం చేయలేని పని హీరో చేస్తున్నాడు. కాబట్టి అది మనమే చేస్తున్నాం అనే భ్రమలో ఆడియన్స్ ఉంటారు. దాని వల్ల ప్రేక్షకులకు చాలా హై ఫీల్ కలుగుతుంది. అందుకే ప్రతి ప్రేక్షకుడు కమర్షియల్ సినిమాలోని హీరోకి చాలా బాగా కనెక్ట్ అవుతూ ఉంటాడు…
Also Read: ‘స్పిరిట్’ నుండి వివేక్ ఒబెరాయ్ ఫస్ట్ లుక్ వచ్చేసింది..ఇదేమి మాస్ బాబోయ్!
వాళ్ళకి అభిమానులుగా మారిపోతుంటారు. ఈ విషయాన్ని బాగా గమనించిన అనిల్ రావిపూడి ప్రతిసారి కమర్షియల్ సినిమాని యాక్షన్ ఎంటర్ టైనర్ లాగా తెరకెక్కించి సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన వెంకటేష్ – కళ్యాణ్ రామ్ లను పెట్టి సినిమా చేస్తున్నాడు… బావ బామ్మర్ది కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది.
తమిళ్ సినిమా ఇండస్ట్రీలో కార్తీ హీరోగా అరవింద్ స్వామి ప్రధానపాత్రను పోషించిన ‘సత్యం సుందరం’ సినిమాలో కూడా వాళ్ళిద్దరు బావ బామ్మర్దులు గానే నటించారు. ఈ సినిమా రిఫరెన్స్ తోనే అనిల్ రావిపూడి ఇప్పుడు వెంకటేష్ కళ్యాణ్ రామ్ లను పెట్టి చేస్తున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. ఇక అదే కథతో సినిమా చేస్తాడా? లేదంటే ఇందులో ఇంకేమైనా వేరియేషన్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు అనేది తెలియాల్సి ఉంది.
మొత్తానికైతే బావ బామ్మర్ది మధ్య కామెడీ సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్స్ ని మిక్స్ చేసి మరీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇక విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు అనిల్ రావిపూడి ‘సత్యం సుందరం’ నుంచి ఈ మూవీ కథను కాపీ చేస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు…