Raghurama Krishnam Raju: టిడిపి కూటమిలో( TDP Alliance ) రఘురామకృష్ణంరాజు రెబల్ గా మారుతారా? గతంలో వైసిపి మాదిరిగానే వ్యవహరిస్తారా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఏపీలో టీడీపీ కూటమి ఏడాది పాలన పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సుపరిపాలనకు తొలి అడుగు పేరుతో అమరావతిలో భారీ సభను కూడా ఏర్పాటు చేసింది. ఇందులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అయితే ఈ సభలో ఎమ్మెల్యేలకు ఘోర అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు రఘురామకృష్ణంరాజు. అలా చేయడం తప్పని కూడా వ్యాఖ్యానించారు. అసలు ఇది సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తెలిసి జరిగిందో? తెలియక జరిగిందో? తనకు తెలియదన్నారు. దీనిని మొదటి తప్పిదంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు రఘురామకృష్ణంరాజు.
Also Read: టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెటైర్లు!
* వేర్వేరుగా సిట్టింగ్
సుపరిపాలనకు తొలి అడుగు సభలో కలెక్టర్లు, ఎస్పీలు, ఎంపీలను ఓ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి.. ఎమ్మెల్యేలను మాత్రం మరో టేబుల్ దగ్గర కార్పొరేషన్ డైరెక్టర్లతో కూర్చోబెట్టడాన్ని తప్పు పట్టారు రఘురాం కృష్ణంరాజు( Raghuram Krishnam Raju ) . దీనిపై ఎమ్మెల్యేల నుంచి అభ్యంతరాలు వచ్చాయని.. చాలామంది ఫిర్యాదు చేసినట్లు కూడా డిప్యూటీ స్పీకర్ చెప్పుకొచ్చారు. స్పీకర్ తో పాటు తనను సైతం ఆహ్వానించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ తాను ఈ సభకు వెళ్లి ఉంటే అక్కడ ఉన్న పరిస్థితులను చూసి వెంటనే బయటకు వచ్చేసే వాడినని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించకపోవడం ఏంటని ప్రశ్నించారు. కలెక్టర్ కంటే ఎమ్మెల్యే ప్రోటోకాల్ పెద్దదన్న విషయాన్ని గుర్తు చేశారు. సుపరిపాలనకు తొలి అడుగు సభలో ఎమ్మెల్యేలకు జరిగిన అవమానంపై తాను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
* సోషల్ మీడియాలో వైరల్..
రఘురామకృష్ణంరాజు కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో( social media) విపరీతంగా వైరల్ అవుతున్నాయి. టిడిపి కూటమి పై అసంతృప్తితో ఉన్నారా? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నరసాపురం పార్లమెంట్ స్థానానికి పోటీ చేశారు రఘురామకృష్ణంరాజు. ఆ ఎన్నికల్లో విజయం సాధించి పార్లమెంటులో అడుగు పెట్టారు. అయితే అక్కడికి ఆరు నెలల కాలానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో విభేదించారు. అప్పటి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేవారు. క్రమేపి ఆ పార్టీకి దూరమయ్యారు. ఇప్పుడు కూడా టిడిపి కూటమి విషయంలో అలానే వ్యవహరిస్తారా? అన్న అనుమానాలయితే కలుగుతున్నాయి. కానీ రఘురామకృష్ణం రాజు ఈ విషయంలో అధికారుల తీరును తప్పుపడుతున్నారు. వారిపైనే ఫిర్యాదు చేస్తానని చెబుతున్నారు. మొత్తానికైతే రఘురామకృష్ణంరాజు పెద్ద కలకలమే సృష్టించారు.
ప్రోటోకాల్ ప్రకారం చీఫ్ సెక్రటరీ, కలెక్టర్ కంటే ఎమ్మెల్యే ఎక్కువ
ఎమ్మెల్యే స్థాయి తగ్గిస్తున్నారు
ఎంపీ,ఎస్పీ,కలెక్టర్ లకు సెపరేట్ టేబుల్ పెట్టి కార్పొరేషన్ డైరెక్టర్,సభ్యులతో ఎమ్మెల్యే లను పెట్టి వారి స్థాయి తగ్గించినట్లుగా నేను భావిస్తున్నా – టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు pic.twitter.com/bzin4OlDVq— Anitha Reddy (@Anithareddyatp) June 26, 2025