Homeఆంధ్రప్రదేశ్‌Buchaya Chowdary - Pawan kalyan: టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పై డిప్యూటీ...

Buchaya Chowdary – Pawan kalyan: టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెటైర్లు!

Buchaya Chowdary – Pawan kalyan: నేడు రాజమండ్రి లో ‘అఖండ గోదావరి’ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు కేంద్ర టూరిజం మినిస్టర్ గజేంద్ర సింగ్ షికావత్(Tourism Minister Gajendra Singh Shikavat), రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి(Bjp MP Purandeswari) లు కూడా ముఖ్య అతిథులుగా అయ్యారు. అదే విధంగా ఏపీ టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu), తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి(Gorantla Buchaya Chowdary) వంటి వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ రావడంతో అశేషంగా అభిమానులు తరళి వచ్చారు. ప్రతీ సభలో లాగానే ఇక్కడ కూడా వాళ్ళ హడావుడి వేరే లెవెల్ లో ఉన్నింది. అయితే తన ప్రసంగం లో పవన్ కళ్యాణ్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గురించి మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

సభకు విచ్చేసిన ప్రతీ ఒక్కరి గురించి మాట్లాడుతూ బుచ్చయ్య చౌదరి వంతు రాగానే ‘పట్టువదలని విక్రమార్కులు..నాకు ఇష్టమైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను. మనం తగ్గలే తప్ప ఆయన తగ్గడు, మనం ఆయన్ని చూసి ఈ విషయం నేర్చుకోవాలి. మనకి ఇలాంటివి ఆయనే నేర్పించాలి. రాష్ట్ర హితువుని, రాజమండ్రి హితువుని, గోదావరి జిల్లాల హితువుని కోరుకునే ఆయనకు నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ ఈయన గురించి ఎందుకు ఇలా మాట్లాడుతాడో 2024 ఎన్నికలకు ముందు జరిగిన కొన్ని సంఘటనలు చూస్తే అర్థం అవుతుంది. ఈ ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే సీట్ కోసం జనసేన పార్టీ నుండి కందుల దుర్గేష్ చాలా గట్టి పోరాటమే చేసాడు. ఎందుకంటే ఆయన మొదటి ఈ స్థానాన్ని తనకు కంచు కోటగా మార్చుకున్నాడు. ఎంతో డబ్బు ఖర్చు చేసాడు.

కానీ అప్పట్లో టీడీపీ తరుపున సిట్టింగ్ ఎమ్మెల్యే గా కూర్చున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాత్రం తానూ ఆ స్థానాన్ని వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. సీఎం చంద్రబాబు ప్రత్యేకించి రిక్వెస్ట్ చేసిన, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ చేసినా ఆయన వెనక్కి తగ్గలేదు. అవసరమైతే రాజీనామా చేస్తాను, మీ ఇష్టమొచ్చినోళ్లకు ఇచ్చుకోండి, నేను పోటీ చేస్తే ఈ స్థానం నుండే పోటీ చేస్తాను అని మొండిపట్టు పట్టాడు. మరో వైపు కందుల దుర్గేష్ వర్గం కూడా తగ్గలేదు. రాజమండ్రి మొత్తం ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు,కానీ ఫలితం మాత్రం లేదు. చివరికి పవన్ కళ్యాణ్,చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చి,నిడదవోలు నుండి కందుల దుర్గేష్ ని పోటీ చేయించారు. ఆయన అయిష్టంగానే పోటీ చేసాడు కానీ, భారీ మెజారిటీ తో గెలుపొందాడు. అంతే కాకుండా టూరిజం మరియు సినిమాటోగ్రఫీ శాఖకు మినిస్టర్ గా వ్యవహరించే అవకాశం కూడా వచ్చింది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
RELATED ARTICLES

Most Popular