spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh Pooja Room Controversy: క్షుద్ర పూజలపై లోకేష్ ఫుల్ క్లారిటీ!

Nara Lokesh Pooja Room Controversy: క్షుద్ర పూజలపై లోకేష్ ఫుల్ క్లారిటీ!

Nara Lokesh Pooja Room Controversy: ఏపీ మంత్రి నారా లోకేష్ విషయంలో వింత ప్రచారం జరిగింది. ఆయన పూజ చేసే గదిలో ఒక విచిత్రమైన బొమ్మ కనిపించింది. కొందరైతే క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. దీనిపై మంత్రి లోకేష్ స్పందించారు. తన పూజ గదిలో ఉన్న బొమ్మల గురించి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఇదే అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నారా లోకేష్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఏదైనా అంశాలపై శరవేగంగా స్పందిస్తారు. ఇప్పుడు ఈ బొమ్మపై కూడా అదే విధంగా స్పందించారు నారా లోకేష్.

Also Read: పవర్‌ హౌస్‌గా కరీంనగర్‌.. రాష్ట్ర రాజకీయాల్లో కీలక ముద్ర..

* ఉగాది పూజల్లో..
తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పర్వదినం ఘనంగా జరిగింది. రాజకీయ పార్టీల నేతలు వారి కార్యాలయాలు, నివాసాల్లో పూజలు జరిపారు. ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా తన ఇంట్లో ఉగాది వేడుకలు జరుపుకున్నారు. కుమారుడు దేవాన్సుతో కలిసి ఉగాది పండుగ చేసుకున్నట్లు ఫోటోలను షేర్ చేశారు. ఈ కొత్త ఏడాదిలో చేదు అనుభవాలు లేకుండా.. మధురమైన క్షణాలతో నింపుదాం. ఉగాది పండుగ కాబట్టి.. నా కఠినమైన డైట్ ను ఒక్క రోజుకు పక్కన పెట్టి పండగ స్పెషల్ వంటలను ఆస్వాదిస్తున్నాను అంటూ మంత్రి నారా లోకేష్ ఫోటోలతో సహా ట్విట్ చేశారు. అయితే ఆ ఫోటోలో దేవుడి ఫోటోల పక్కన ఓ బొమ్మ కనిపించింది. ఆ బొమ్మ ఏంటి అంటూ కొందరు ప్రశ్నించారు. కొందరైతే క్షుద్ర పూజలకు వాడే చేతబడి బొమ్మ మీ ఇంటి మందిరంలో ఉంది ఏంటి? అని సోషల్ మీడియాలో ప్రశ్నించారు.

* అది దేవాన్సు తయారుచేసిన బొమ్మ..
అయితే సోషల్ మీడియాలో దీనిపై విమర్శలు రావడంతో మంత్రి లోకేష్ స్పందించారు. మా పూజ గదిలోని బొమ్మల గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నవారి కోసం… ఇది దేవాన్సు తన నాలుగేళ్ల వయసులో చేతితో తయారు చేసిన శివుని బొమ్మ.. చిన్న శివలింగం. దేవాన్సు శివుడు పై భక్తితో బొమ్మలను తయారు చేశాడు. వాటిని మేము జ్ఞాపకం గా పూజ గదిలో ఉంచాము. కొందరికి విశ్వాసం అర్థం అవుతుంది. కొందరికి అర్థం కాదు. కానీ ఇలాంటి భక్తికి వివరణ అవసరం లేదు. హర హర మహాదేవ్ అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.

Nara Lokesh Pooja Room Controversy (1)
Nara Lokesh Pooja Room Controversy (1)
Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Lenin 10 Days Collection

Lenin Movie : ‘లెనిన్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా జోరు తగ్గలేదు..

Lenin Movie : అఖిల్ 'లెనిన్' చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై 13 రోజులైనప్పటికీ కూడా, కొన్ని సెంటర్స్ లో నేటికీ కూడా భారీ...
Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Oktelugu Epaper