spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Kiran Kumar Reddy: తెలంగాణ గవర్నర్ గా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి?

Kiran Kumar Reddy: తెలంగాణ గవర్నర్ గా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి?

Kiran Kumar Reddy: ఈ ఎన్నికల్లో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఓడిపోయారు. రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి చేతిలో 76 వేల ఓట్లతో ఓటమి చవిచూశారు. బిజెపి నుంచి ఆరుగురు పోటీ చేయగా.. ముగ్గురుకి ఓటమి ఎదురైంది. అందులో కిరణ్ కుమార్ రెడ్డి ఒకరు. అయితే రాజంపేట నియోజకవర్గం క్రిటికల్ అని తెలిసినా కిరణ్ రంగంలోకి దిగారు. అయితే ఆయన ఓడిపోయినా కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చింది. ఏపీలో కూటమి ప్రభుత్వం విజయం సాధించింది. అటు సోదరుడు కిషోర్ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇటువంటి తరుణంలో కిరణ్ కుమార్ రెడ్డి సేవలను వేరే విధంగా వినియోగించుకోవాలని బిజెపితో పాటు చంద్రబాబు భావిస్తున్నారు.

చిత్తూరు జిల్లాలో నల్లారి కుటుంబానికి ప్రత్యేక రాజకీయ నేపథ్యం. సుదీర్ఘకాలం ఆ కుటుంబం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగింది. తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన కిరణ్ పలుసార్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెక్ చెప్పడంతో ఎప్పుడూ మంత్రి పదవి దక్కలేదు. రాజశేఖర్ రెడ్డి రెండోసారి అధికారంలోకి వచ్చిన తరుణంలో.. అనూహ్యంగా స్పీకర్ పదవి కిరణ్ కుమార్ రెడ్డికి వరించింది. 2010లో రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో రోశయ్య సీఎం అయ్యారు. కొద్ది రోజులకే ఆయనను మార్చి స్పీకర్ గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ హై కమాండ్ అవకాశం ఇచ్చింది. మూడేళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా కిరణ్ వ్యవహరించారు. ఉమ్మడి ఏపీకి ఆయనే చివరి సీఎం.

రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీతో విభేదించారు కిరణ్ కుమార్ రెడ్డి. సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. 2014ఎన్నికల్లో పోటీ చేశారు. ఒక్క స్థానాన్ని కూడా గెలవలేకపోయారు. అయితే ఓట్లు చీల్చి వైసిపి ఓటమికి కారణమయ్యారు. అక్కడ నుంచి పొలిటికల్ గా సైలెంట్ అయ్యారు. 2019 ఎన్నికల్లో సైతం కనిపించలేదు. కానీ ఈ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరారు. కానీ ఎక్కువ రోజులు అక్కడ ఇమడ లేకపోయారు. బిజెపి హై కమాండ్ పెద్దల పిలుపు మేరకు ఆ పార్టీలో చేరారు. ఏపీలో పొత్తుల్లో భాగంగా రాజంపేట ఎంపీ స్థానం నుంచి పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి మిధున్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు. అయితే అటు కేంద్రంలో బిజెపి అధికారంలోకి రావడం, ఇటు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో విజయం సాధించడంతో కిరణ్ కు మంచి ఛాన్స్ ఇవ్వాలని కేంద్ర పెద్దలు భావిస్తున్నారు. కిరణ్ విషయంలో చంద్రబాబు సైతం సుముఖంగా ఉండడంతో ఆయన పేరును గవర్నర్ పోస్ట్ కు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి రాష్ట్రంపై కిరణ్ కు మంచి పట్టు ఉంది. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ గా ఉన్న తమిళ సై తిరిగి రాజకీయాల్లో ప్రవేశించారు. తమిళనాడు రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. తెలంగాణలో బిజెపి ఎనిమిది ఎంపీ సీట్లను గెలుచుకుంది. ఈ తరుణంలో రాష్ట్రంపై సమగ్ర అవగాహన ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గవర్నర్ అయితే బిజెపికి తప్పకుండా ప్రయోజనం చేకూరుతుంది. అందుకే కిరణ్ పేరు ఖరారు చేసినట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Jogi Ramesh: చిక్కుల్లో మాజీ మంత్రి రమేష్ ఫ్యామిలీ!

Jogi Ramesh: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వ్యక్తిగత కేసులు చుట్టుముడుతున్నాయి. మొన్నటికి మొన్న మాజీ మంత్రి అప్పలరాజు తన కుమారుడు ప్రమాదం మూలంగా చిక్కుల్లో పడ్డారు. బైక్ ప్రమాదానికి కారణమైన తన...

Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...
Oktelugu Epaper
Exit mobile version