Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి గుర్తింపైతే దక్కింది. నాగేశ్వరరావు లాంటి నటుడు ఎలాంటి ఇమేజ్ ను సంపాదించుకున్నాడో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన తర్వాత నాగార్జున సైతం ప్రేక్షకులను మెప్పిస్తూ స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక ఏది ఏమైనా కూడా నాగార్జునకి దక్కిన ఇమేజ్ తన కొడుకులైన నాగ చైతన్య, అఖిల్ కి దక్కడం లేదు. వాళ్ళు స్టార్ హీరోలుగా మారడం లేదు అనేది ప్రతి ఒక్కరు నోట వినిపిస్తుంది. నాగచైతన్య కొంత వరకు బెటరే అనిపించినప్పటికీ అఖిల్ మాత్రం అనుకున్న మేరకు సక్సెస్ లను సాధించడంలో విఫలమవుతున్నాడు.
రీసెంట్ గా ‘లెనిన్’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన ఆయన తన తదుపరి సినిమాల విషయంలో కూడా చాలా కేర్ఫుల్ గా వ్యవహరించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అఖిల్ చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా చాలా సాహసోపేతంగా ఉన్నప్పటికి ఆయనకు విజయాలు మాత్రం రావడం లేదు. ఇప్పుడు తన ట్రాక్ మొత్తాన్ని చేంజ్ చేశాడు. గొప్ప దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.
కథల విషయంలో ఆయన ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావడం లేదు. ఇక దానికి తోడుగా ప్రస్తుతం ఆయన రెమ్యూనరేషన్ ను కూడా భారీగా పెంచాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. లెనిన్ సినిమాకి చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కేవలం ఆయన 6 కోట్ల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకున్నారట.
ఇక ఇప్పుడు రాబోయే సినిమాల కోసం తను 20 కోట్లు వరకు రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా 20 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకొని తన సినిమాని నెక్స్ట్ లెవెల్ సక్సెస్ గా నిలిపితే మాత్రం ఆయన రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ రెమ్యూనరేషన్ ఛార్జ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి…



