https://oktelugu.com/

Kiran Kumar Reddy : ఆ మాజీ సీఎంకు కలిసి రాని కాలం!

Kiran Kumar Reddy : ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో( Bhartiya Janata Party) ఉన్నారు. మధ్యలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు కానీ.. అక్కడ ఇమడలేకపోయారు. బిజెపి ద్వారా ఉన్నత పదవులు ఆశిస్తున్నారు. రాజ్యసభ పదవి పై ఆశలు పెట్టుకున్నారు.

Written By: , Updated On : March 22, 2025 / 02:02 PM IST
 Kirankumar Reddy

 Kirankumar Reddy

Follow us on

Kiran Kumar Reddy : మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ( nallari Kiran Kumar Reddy ) కలిసి రావడం లేదు. ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి ఆయన. రాజశేఖర్ రెడ్డి మరణంతో రోశయ్య సీఎం అయ్యారు. కానీ కొద్ది రోజులకే ఆయన రాజీనామా చేశారు. అప్పటివరకు స్పీకర్ గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఉమ్మడి రాష్ట్రానికి చివరి మూడేళ్లు కిరణ్ కుమార్ రెడ్డి సీఎం గా కొనసాగారు. మంచి పాలన అందించారన్న పేరు పొందారు. కానీ తరువాత రాజకీయ సంక్లిష్ట పరిస్థితులతో పదేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. ఈ ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన ఆయన పరిస్థితి ఇప్పుడు డిఫెన్స్ లో పడింది.

Also Read : రాజ్యసభకు కూటమి అభ్యర్థి ఫిక్స్.. ఆ ఇద్దరిలో ఒకరికి ఛాన్స్

* రాజకీయ నేపథ్యం..
రాజకీయ నేపథ్య కుటుంబం నుంచి వచ్చారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన తండ్రి అమరనాథ్ రెడ్డి( Amarnath Reddy ) సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో సేవలు అందించారు. కీలక పదవులు చేపట్టారు. 1987లో ఆయన అకాల మరణం చెందారు. 1988లో వాయల్పాడు ఉప ఎన్నికల్లో కిరణ్ తల్లి సరోజమ్మ పోటీ చేసి ఓడిపోయారు. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 1989 ఎన్నికల్లో అదే నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు కిరణ్. 1994లో ఓడిపోయిన కిరణ్.. 1999, 2004 ఎన్నికల్లో విజయం సాధించారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో పీలేరుకు మారారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించడంతో రాజశేఖర్ రెడ్డి ఆయనకు స్పీకర్ పదవి కట్టబెట్టారు. అయితే అంతకుముందు 2004లో చీఫ్ విప్ గా ఉండేవారు. రాజశేఖర్ రెడ్డి కి కుడి భుజంగా వ్యవహరించేవారు. అందుకే తరువాత కిరణ్ ను స్పీకర్ చేశారు రాజశేఖర్ రెడ్డి.

* సుపరిపాలన
రాజశేఖర్ రెడ్డి ( Rajasekhar Reddy )అకాల మరణంతో ఆ పదవి కిరణ్ కుమార్ రెడ్డికి వచ్చింది. ఆయన హయాంలో ప్రవేశపెట్టిన పథకాలు, ధరల నియంత్రణ పర్యవేక్షణ కమిటీ, మీసేవ వంటివి ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. నిరుపేదలకు ప్రభుత్వ పరంగా సహాయం అందేలా రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అప్పట్లో విద్యకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాలను పెద్ద ఎత్తున భర్తీ చేశారు. అయితే 2014లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన నిర్ణయం కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ జీవితానికి శాపంగా మారింది. కాంగ్రెస్ పార్టీతో విభేదించి సమైక్యాంధ్ర పార్టీని ఏర్పాటు చేసిన ఫలితం లేకపోయింది.

* రాజ్యసభ పదవి పై ఆశలు..
ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో( Bhartiya Janata Party) ఉన్నారు. మధ్యలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు కానీ.. అక్కడ ఇమడలేకపోయారు. బిజెపి ద్వారా ఉన్నత పదవులు ఆశిస్తున్నారు. రాజ్యసభ పదవి పై ఆశలు పెట్టుకున్నారు. రాజ్యసభ ద్వారా ఎంపీగా ఎన్నికై కేంద్ర మంత్రి కావాలన్నది కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచన. అప్పుడే ఒక మాజీ సీఎం గా తనకు గుర్తింపు ఉంటుందని భావిస్తున్నారు కిరణ్. అయితే పదవులు వచ్చినట్టే వచ్చి కిరణ్ కు చేజారి పోతున్నాయి. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ పదవి తనకు దక్కుతుందని ఆశతో ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Also Read : పెద్దిరెడ్డికి షాక్.. అరెస్టుకు లైన్ క్లియర్!