Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన లాభం ఉండనుంది. మరికొన్ని రాశుల వారి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): . ఈ రాశి వారు ఈ రోజు కెరీర్ విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో అనుకున్న ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. ఈ రాశి వారికి ఈ రోజు శ్రీమన్నారాయణ ఆశీస్సులు ఉంటాయి. దీంతో వ్యాపారులు అధికంగా లాభాలు పొందుతారు. దూర ప్రయాణాలు చేయడం మానుకోవాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు కార్యాలయంలో కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు. అనవసరంగా వాదనలకు దిగకుండా ఉండాలి. చెడు పనులు చేయాలని కొందరు ఒత్తిడి చేస్తారు. ఇలాంటి వారికి దూరంగా ఉండడమే మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈ రోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. వీరికి నారాయణుడి ఆశీస్సులు ఉంటాయి. దీంతో వ్యాపారులు ఆకస్మికంగా ధన లాభం పొందుతారు. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. విదేశీ విద్య కోసం ఎదురుచూసేవారు శుభవార్తలు వింటారు. చాలావరకు సమస్యలను ఈరోజు పరిష్కరించుకుంటారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి గతంలో కంటే ఇప్పుడు మెరుగుపడుతుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదన వస్తాయి. ధన లాభం పొందేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. లక్ష్మీదేవి ఆశీస్సులతో అన్ని విజయాలే ఉంటాయి. మిగతా వారి కంటే సమాజంలో ప్రత్యేక గుర్తింపును పొందుతారు. కుటుంబ సభ్యుల మద్దతుతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం ఏర్పడడానికి మార్గం ఏర్పడుతుంది. ఇంట్లో కుటుంబ జీవితం సంతోషంగా సాగుతోంది. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. వారికి కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తారు. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంటారు.
కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కొత్త పనులు మొదలు పెడితే వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. వీరికి శని దేవుడు ఆశీస్సులు ఉండడంవల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు పూర్తవుతాయి. వ్యాపారులకు అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. పెండింగ్ పనులలో పూర్తి చేస్తారు. ఇతరుల వద్ద ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు లక్ష్మి నారాయణ ఆశీస్సులు ఉంటాయి. గతంలో కంటే మీరు ఈరోజు సంతోషంగా గడుపుతారు. ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి ముందుకు వస్తారు. అర్హులైన వారికే వివాహ ప్రతిపాదనలు వస్తాయి. వ్యాపారులకు అధిక లాభాలు ఉంటాయి. ప్రియమైన వారి నుంచి బహుమతులు అందుకుంటారు. మనోధైర్యం పెరగడంతో కొన్ని కష్టమైన పనులను సైతం పూర్తి చేస్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి సమాజంలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు అధిక లాభాలు ఉంటాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులు ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అవసరమైన ఏర్పాటు చేసుకుంటారు. అనుకోకుండా శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి. అన్నింట్లోనూ శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు కొన్ని ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులకు గణనీయమైన లాభాలు ఉంటాయి. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామితో ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తారు. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా వీరికి అన్ని అనుకూల ఫలితాలు ఉంటాయి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి. వ్యాపారులు ఊహించిన దాని కంటే ఎక్కువ లాభాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగులు తోటి వారితో సంయమను పాటించడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను వెంటనే పూర్తిచేస్తారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు కొత్త అవకాశాలు ఏర్పడతాయి. మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. ఉద్యోగులు నైపుణ్య ప్రదర్శనతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారులకు లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండడంతో అధిక లాభాలు పొందుతారు. ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి అవసరమైన సమయం ఏర్పడుతుంది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు చాలా విషయాలు అదృష్టాన్ని కలిగి ఉంటారు. రాజకీయాల్లో ఉండేవారికి ప్రజల నుంచి మద్దతు ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. మిగతా వారి కంటే వీరు సంతోషంగా ఉండగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కొత్త ఆదాయ వనరులను సమీకరిస్తారు.



