Durham Vs Lancashire: ఒక్క నిమిషం ఊపిరాగినంత పనైపోయింది.. క్యాచ్ అలా ఎలా పట్టావు భయ్యా?.. వీడియో వైరల్

సాధారణంగా బ్యాటర్ కొట్టిన బంతి నేరుగా తల వైపు దూసుకు వస్తే ఏ బౌలర్ అయినా చేతులు అడ్డం పెడతాడు. లేకుంటే తనను తాను ఏదో ఒక రూపంలో రక్షించుకునే ప్రయత్నం చేస్తాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 17, 2024 10:11 am

Durham Vs Lancashire

Follow us on

Durham Vs Lancashire: క్రికెట్లో బౌలర్ వేసే బంతి ఎంత వేగంతో అయితే దూసుకెళ్తుందో.. దానిని బ్యాటర్ కొడితే రెట్టింపు వేగంతో తిరిగి దూసుకు వస్తుంది. అలాంటి బంతిని ఆపాలంటే ఆటగాళ్లకు ఎంతో ఓర్పు ఉండాలి. మరి ఎంతో ఫిట్ నెస్ కలిగి ఉండాలి. అయితే ఈ ఆటగాడికి భూదేవంత ఓర్పు ఉంది కావచ్చు. జాంటీ రోడ్స్ ను మించిన ఫిట్ నెస్ ఉంది కావచ్చు. అందుకే ఆ స్థాయిలో క్యాచ్ పట్టాడు. అది చూసినవారు షాక్ అవుతున్నారు.

సాధారణంగా బ్యాటర్ కొట్టిన బంతి నేరుగా తల వైపు దూసుకు వస్తే ఏ బౌలర్ అయినా చేతులు అడ్డం పెడతాడు. లేకుంటే తనను తాను ఏదో ఒక రూపంలో రక్షించుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ ఈ బౌలర్ మాత్రం బ్యాటర్ కొట్టిన భారీ షాట్ ను అడ్డుకున్నాడు. ఒంటి చేత్తో క్యాచ్ పట్టాడు. ఏ బౌలర్ లేదా ఫీల్డర్ కలలో కూడా ఊహించని అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఒళ్ళు గగుర్పాటుకు గురి చేసే క్యాచ్ పట్టి ఔరా అనిపించాడు.

ఇటీవల లంక షైర్ క్రికెట్ క్లబ్, దర్హాం కౌంటింగ్ క్రికెట్ క్లబ్ జట్ల మధ్య ఓ టి 20 మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా దర్హాం పేస్ బౌలర్ పాల్ కోగ్లిన్ వేసిన బంతిని.. ప్రత్యర్థి బ్యాటర్ ఫ్రంట్ ఫూట్ కు వచ్చి బలంగా కొట్టాడు. ఆ బంతి నేరుగా కోగ్లిన్ తల వైపుకు దూసుకు వచ్చింది. ఆ బంతి దూసుకు వచ్చే వేగానికి కోగ్లిన్ పక్కకు తప్పుకుంటాడని అందరూ భావించారు. కానీ ఎవరు ఊహించని విధంగా వేగంగా వస్తున్న ఆ బంతిని అతడు వంటి చేత్తో అందుకున్నాడు. దీంతో బ్యాటర్ తో పాటు, ఆటగాళ్లు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.

వేగంగా దూసుకు వచ్చే ఆ బంతి కనుక మిస్ అయి ఉంటే.. అతని తలకాయ పుచ్చకాయ మాదిరి పగిలిపోయి ఉండేది. అలాంటి అనితర సాధ్యమైన క్యాచ్ పట్టి కోగ్లిన్ వారెవా అనిపించాడు. ఆ క్యాచ్ పట్టిన విధానం చూసిన వారంతా ఒక్కసారిగా ఊపిరి బిగబట్టుకున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ప్రపంచంలోనే అత్యుత్తమ కాట్ అండ్ బౌల్డ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.