Stomach Surgery China: సాధారణంగా పగటిపూట వచ్చే కలలు నిజం కావు అంటారు. రాత్రిపూట కలగనేవి కూడా వాస్తవరూపం దాల్చవు అంటారు. ఒక ముక్కలో చెప్పాలంటే కలలేవీ యదార్థం కావని పెద్దలు చెబుతుంటారు. అందువల్లే కలలో బతకడానికంటే వాస్తవంలో జీవించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తుంటారు. కలలో ఎన్నైనా అద్భుతాలు కనిపిస్తుంటాయి. ఆశ్చర్యాలు కళ్ళ ముందు ఉంటాయి.
ఆ సమయంలో మనం మానవాతీత శక్తి లాగా కనిపిస్తుంటాం. అతీంద్రియ బలాలతో దర్శనమిస్తుంటాం. కళ్ళు తెరిచి చూస్తే చాలు అవన్నీ మాయమవుతాయి. మనం నిమిత్తమాత్రులం అనే నిజం కళ్ళ ముందు కనిపిస్తుంది. అలా ఓ యువకుడికి కలలో స్పూన్ మింగినట్టు అనిపించింది. అతడు దానిని అత్యంత తేలికగా తీసుకున్నాడు.. ఆస్పత్రికి వెళ్ళిన తర్వాత అసలు విషయం తెలియడంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు.
Also Read: బుక్స్ చదువుతూ కూడా ఇంత హాట్ షోనా అమ్మడూ..?
చైనా దేశానికి చెందిన యాన్ అనే వ్యక్తి ఇటీవల షాంగై లోని ఆసుపత్రికి వెళ్ళాడు. అక్కడి వైద్యులు అతనికి పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో అతని కడుపులో ఏదో ఉన్నట్టు కనిపించింది. వైద్యులు అతని కడుపులో ఉన్న దాన్ని గురించి మరింత తెలుసుకోవడానికి ఎండోస్కోపీ నిర్వహించారు. దానిద్వారా అతని పేగుల్లో పదిహేను సెంటీమీటర్ల పొడవు ఉన్న ఒక సిరామిక్ చెంచా కనిపించింది. దీంతో వైద్యులు అతడికి శస్త్ర చికిత్స నిర్వహించి ఆ చెంచాను బయటకు తీశారు. ఆ వ్యక్తికి ఇటీవలి కాలం నుంచి కడుపులో నొప్పిగా అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అతడు ఆసుపత్రికి వెళ్లాడు. ఆ సమయంలో వైద్యులు స్పూన్ ఎలా మింగారు అని అడిగిన ప్రశ్నకు.. తాను ఓ ప్రాంతంలో ఆహారం తింటున్నప్పుడు ప్లాస్టిక్ స్పూన్ మింగి ఉంటానని సమాధానంగా చెప్పాడు. అయితే ఆ సమయంలో వైద్యులు అతనికి పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత ఎండోస్కోపీలో అతని కడుపులో సిరామిక్ స్పూన్ ఉన్నట్టు తెలిసింది.
చిన్న పేగు పై భాగంలో సిరామిక్ స్పూన్ కనిపించింది. అదృష్టవశాత్తు ఆ స్పూన్ చిన్న పేగును రెండుగా చీల్చలేదు. పైగా దాని స్థానం పేగులో అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉంది. ఒకవేళ ఏదైనా ఆకస్మిక కదిలిక గనుక చోటు చేసుకుంటే పేగు గోడ విచ్చిన్నమయ్యేది. అది ప్రాణాపాయానికి దారి తీసేది. శస్త్ర చికిత్స తర్వాత యాన్ తాను ఎలా స్పూన్ మింగాడో గుర్తుకు తెచ్చుకున్నాడు.
Also Read: అందాల ఆరబోతలో దిట్ట ఈ బొమ్మ. చూస్తే ఫిదా అవాల్సిందే
సరిగ్గా ఆరు నెలల క్రితం అతడు థాయిలాండ్ వెళ్ళాడు. అక్కడ ఒక హోటల్లో మద్యం తాగాడు. విపరీతమైన తలనొప్పి రావడంతో అతడు స్పూన్ ద్వారా వాంతి చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో స్పూన్ అలాగే మింగాడు. ఆ మింగిన సంఘటన అతడికి గుర్తుకులేదు. పైగా ఆ స్పూన్ తన నోట్లోకి వెళ్లిన తీరును అతడు కలగానే అనుకున్నాడు. అందువల్లే అతడికి స్పూన్ మింగినట్టు కల వచ్చిందని భావించాడు. వైద్యులు చివరికి గంటలపాటు శస్త్ర చికిత్స చేసి అతడి కడుపులో ఉన్న స్పూన్ బయటికి తీశారు.