Kommineni Bail Behind Reasons: జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు( kommineni Srinivasa Rao) సుప్రీంకోర్టులో బెయిల్ లభించింది. అయితే దీనిపై రకరకాల చర్చ నడుస్తోంది. అంత రెడ్ హ్యాండెడ్ గా.. వీడియోలో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి.. దానిని సమర్థించిన కొమ్మినేని కి ఎలా బెయిల్ ఇస్తారని ఎక్కువమంది ప్రశ్నిస్తున్నారు. తెర వెనుక ఏదో జరిగిందన్న అనుమానాలు ఎక్కువమంది వ్యక్తం చేస్తున్నారు. అసలు హైకోర్టుకు వెళ్లకుండా.. నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకోవడం పై రకరకాల అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. కొద్ది రోజుల కిందట సాక్షి ఛానల్ లో డిబేట్ నిర్వహించారు. ఆ కార్యక్రమం నిర్వాహకుడిగా సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు ఉన్నారు. జర్నలిస్ట్ కృష్ణంరాజు ఆ డిబేట్లో పాల్గొన్నారు. అమరావతిలో ఆ తరహా మహిళలు ఉన్నారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దానిని సమర్థిస్తూ మాట్లాడారు కొమ్మినేని. అది విపరీతంగా వైరల్ కావడం.. అమరావతి రైతులు ఫిర్యాదు చేయడంతో కొమ్మినేని అరెస్టు చేశారు. తరువాత జర్నలిస్ట్ కృష్ణంరాజు అరెస్ట్ కూడా జరిగింది. అయితే కోర్టు కొమ్మినేని కి 14 రోజులపాటు రిమాండ్ విధించింది.
Also Read: AP journalism Updates: ప్రజా గొంతుకలు రాజకీయ గళాలవుతున్నాయా? కొమ్మినేని ఉదాహరణ!
నేరుగా సుప్రీంకోర్టుకు..
ముందస్తు బెయిల్ పిటిషన్( bail petition) వేశారు కొమ్మినేని శ్రీనివాసరావు. అయితే బెయిల్ తిరస్కరణకు గురైంది. ఆయన సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేయాలి. కానీ ఏకంగా సుప్రీంకోర్టు తలుపు తట్టారు. అక్కడ సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత కొమ్మినేని శ్రీనివాసరావుకు బెయిల్ లభించింది. అయితే ఈ బెయిల్ పై రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పక్షపాత ధోరణితో, రాజకీయ కక్షతో మీడియాలో డిబేట్లు నిర్వహించే కొమ్మినేనికి ఎలా బెయిల్ ఇస్తారని ఎక్కువమంది ప్రశ్నిస్తున్నారు. ఆయనకు బ్రెయిన్ లభించడం వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరపతి ఉందని అనుమానిస్తున్నారు. గతంలో హైకోర్టులో పని చేసిన ఓ జడ్జ్ అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పులు ఇచ్చేవారని ఒక విమర్శ ఉంది. ఈ ధర్మాసనంలో కూడా ఆయన ఒక సభ్యుడు. అందుకే కుమ్మినేనికి బెయిల్ లభించింది అన్నది ఎక్కువమంది అనుమానం. దానిపైనే ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు.
విశాల దృక్పథంతో తీర్పులు
అయితే సుప్రీం కోర్టు( Supreme Court) అన్నది అత్యున్నత, సర్వోన్నత న్యాయస్థానం. అక్కడ విశాల దృక్పథంతో మాత్రమే తీర్పులు ఇస్తారు. సాధారణంగా రాష్ట్రంలో ఉండే కోర్టులకు ఇక్కడ పరిస్థితులు తెలుసు. ఇక్కడ మనుషులు వ్యవహరించే తీరు తెలుసు. అందునా మీడియా రంగంలో ఉన్నవారికి నిత్యం చూస్తుంటారు. అందుకే ఇక్కడి కోర్టుల్లో కొమ్మినేనికి బెయిల్ లభించలేదు. అయితే సుప్రీం కోర్టు జాతీయస్థాయిలో ఉంటుంది. దానిపై పని భారం ఉంటుంది. ఆపై ప్రజాస్వామ్యంలో కీలకమైన మీడియా రంగంపై ఉక్కు పాదం మోపితే ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు రెచ్చిపోతాయని సుప్రీంకోర్టు భావించి ఉండవచ్చు. అందుకే కొమ్మినేని కి బెయిల్ ఇస్తూ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు.
Also Read: Kommineni Srinivasa Rao: ‘కొమ్మినేని’ .. జగన్‌కు కొమ్ముకాస్తే ఇంతేనయా.. చీవాట్లు తప్పవు
డిబేట్ లలో రాజకీయ వివక్ష
ఒక్క మాట మాత్రం నిజం. కొమ్మినేని శ్రీనివాసరావు డిబేట్లు, వ్యవహరించే తీరు రాజకీయ పక్షపాతంగా ఉంటాయి. అది ఎవరు కాదనలేని నిజం. అయితే దానిని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోదు. ఈ దేశ విశాల ప్రయోజనాలు, వ్యవస్థల రక్షణ వంటి వాటిని ప్రాధాన్యతగా తీసుకుంటుంది. అందుకే కొమ్మినేని విషయంలో చాలా రకాల వార్నింగులు ఇచ్చింది. మరోసారి అటువంటి తప్పిదాలు వద్దని హెచ్చరించింది. ఒక్కమాటలో చెప్పాలంటే కొమ్మినేని శ్రీనివాసరావు విషయంలో ఆయనను వ్యతిరేకించే వారికి ఈ తీర్పు వ్యతిరేకంగా భావించవచ్చు. కానీ సర్వోన్నత న్యాయస్థానం విశాల దృక్పథంతో తీర్పులిస్తుందన్న విషయాన్ని మాత్రం గ్రహించాలి.