Kommineni Srinivasa Rao: పేరుకు ప్రెస్ అకామీ చైర్మన్.. పదవి చేపట్టి మూడు నెలలు దాటింది. నాడు ఒక్క జర్నలిస్టు గురించి పట్టించుకోలేదు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏమీ చేయలేదు. జర్నలిస్టుల సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నమూ చేయలేదు. నెలనెలా ప్రజల సొమ్మును వేతనంగా తీసుకుంటున్నాడు. మీరు జర్నలిస్టుల కోసం మీరేం చేశారని అడిగితే మాత్రం ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. అసహనం మాటల్లో వ్యక్తమవుతోంది.. చేతగానితనం.. కళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. సమాధానం చెప్పుకోలేక తాను చేత కాని వాడినని ఒప్పుకోవాల్సిన పరిస్థితి. నిలదీస్తున్న జర్నలిస్టులకు చెప్పేందుకు సమాధానం లేక.. తప్పించుకునేందుకు.. తాను తెలివిగా చెప్పానని అనుకుంటున్నారు. కానీ చేతగాని వారికి పదవి ఎందుకన్న ప్రశ్న తలెత్తుతోంది. తనకు ప్రభుత్వం పదవి ఇచ్చింది కాబట్టి తాను అంతే మాట్లాడతానని కొమ్మినేని వితండవాదం చేశారు. ఈ ప్రభుత్వంలో అందరూ అంతే ఉన్నారు. ఎవరైనా నిలదీస్తే చేతకాదని అంటున్నారు. సీపీఎస్ రద్దు దగ్గర్నుంచి సన్నబియ్యం వరకూ అంతే. అంత చేతకానప్పుడు అన్ని మాటలు చెప్పి పదవిలోకి ఎందుకు వచ్చారు..? చేతకాదని తెలిసినప్పుడు ఎందుకు పదవి నుంచి దిగిపోరు అన్నది మాత్రం ఎవరికీ అర్థం కాదు. చేతకాదు అని చెప్పుకోవడం ఏమైనా గొప్ప అచీవ్ మెంట్ అనుకుంటున్నారా ఏంటి?

-కందుకూరులో బుక్కయ్యాడు..
అసలు కొమ్మినేని శ్రీనివాసరావు జర్నలిస్టులకు దొరికింది కందుకూరులో. అక్కడ తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి రాజకీయ విమర్శలు చేసేందుకు ఆయనకు టాస్క్ ఇచ్చారు. ఆయన వచ్చారు. ఆయన వస్తారని జర్నలిస్టులు కవర్ చేయాలని మీడియాకు సమాచారం ఇచ్చారు. కానీ వచ్చిన వారంతా ఆయనను ప్రెస్ అకాడమీ చైర్మన్‌గానే చూసి సమస్యలపై నిలదీశారు. ఏపీలో జర్నలిస్టులు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నానా ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం కేటాయించిన స్థలాలు, ఇళ్లనూ ఇవ్వడం లేదు. కోవిడ్ సమయంలో మరణించిన వారికి రూ.5 లక్షలు ఇస్తామని జీవో ఇచ్చి ప్రచారం చేసుకున్నారు. కానీ పైసా ఇవ్వలేదు. అక్రిడిటేషన్లు కూడా ఇష్టం వచ్చిన వారికి ఇస్తున్నారు. ఇలా జర్నలిస్టులను రాచి రంపాన పెడుతున్నారు. ఈ ఆగ్రహం కొమ్మినేనిపై కందుకూరులో చూపించారు.

-చేతకాక చేతులెత్తేశారు..
దాదాసు 40 ఏళ్ల జర్నలిజం ఫీడ్డు.. ఎన్నో సంచలన కథనాలు, ఇన్వెస్టిగేషన్ స్టోరీలు ఇచ్చిన అనుభవం..ప్రజా సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లిన రికార్డు ఆయనకు ఉన్నాయి. కానీ ఒక పదవి ఆయనను కట్టిపడేసింది. చేతకానివాడిని చేసింది. చివరకు ఆయనే స్వయంగా తాను చేతకానివాడిని అని అంగీకరించేస్థాయికి దిగజార్చింది. జర్నలిస్టుల ప్రతినిధిగా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లలేని అచేతనుడిగా మార్చిందీ ప్రభుత్వం. అందేకే కందుకూరులో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఆయన తనకు నేతకాదని ఓపెన్‌గా చేతులెత్తారు. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్న చందంగా అక్కడి నుంచి జారుకున్నారు.