Padai Thalaivan Movie Review: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు విజయ్ కాంత్ (Vijayakanth)… తన కొడుకు అయిన షణ్ముగ పాండియన్ (Shanmuga Pandiyan) సైతం సినిమాల్లో హీరోగా మారి ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. అయితే ఆయన గతంలో చేసిన సినిమాలు అతనికి పెద్దగా గుర్తింపును తీసుకురాలేదు. ఇక ఇప్పుడు ‘పడై తలైవన్’ (Padai Thalaivan) అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు… ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే అడవి పక్కన ఉండే ఒక ఊరిలో నివసించే షణ్ముగ పాండియన్ ఒక ఏనుగుని పెంచుకుంటూ ఉంటాడు. ఇక ఆ ఏనుగు వల్ల కొన్ని అనర్ధాలు జరిగాయి అంటూ కొంతమంది అతన్ని దూషిస్తూ ఆయన నుంచి ఆ ఏనుగును దూరం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే షణ్ముగ పాండియన్ తన కుటుంబాన్ని తన ఏనుగును ఎలా రక్షించుకున్నాడు. తనకున్న శత్రువులను ఎలా ఎదిరించాడు అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు అంబు ఎక్కడా కూడా డివియెట్ అవ్వకుండా తను ఏ కథనైతే ఎంచుకున్నాడో దాన్ని హార్ట్ ఫుల్ గా చెప్పే ప్రయత్నం చేశాడు. జంతువులకి మనుషులకు మధ్య ఉండే ఒక బాండింగ్ ని ఎమోషనల్ గా తెరకెక్కించిన విధానం అయితే చాలా బాగుంది. షణ్ముగ పాండియన్ ను సైతం ఈ సినిమాలో చాలా అద్భుతంగా చూపించాడు. ముఖ్యంగా అతని కోసం రాసుకున్న క్యారెక్టర్ లో ఉన్న వేరియేషన్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తూ ఎక్కడ బోర్ కొట్టకుండా ముందుకు సాగుతోంది…
సినిమాలో ఉన్న ఫ్లేవర్ ను సైతం ఎక్కడా మిస్ అవ్వకుండా నాచురాలిటీ కి చాలా దగ్గరగా ఉండే సన్నివేశాలను చిత్రీకరించడంలో అంబు చాలా వరకు సక్సెస్ అయ్యాడు… ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని యాక్షన్ సీన్స్ సైతం ఈ సినిమాకి చాలావరకు హెల్ప్ అయ్యాయి. ఆ సీన్ల వల్లే సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. ఇక క్లైమాక్స్ విషయంలో దర్శకుడు తీసుకున్న కేర్ కూడా మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది…
ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమాలు చాలా తక్కువైపోయాయి. కాబట్టి చాలా కొత్తగా ప్రయత్నం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను చేసి ఒక ప్రయోగాత్మకమైన సినిమా చేసిన దర్శకుడిగా నిలిచిపోయాడు…అయితే సెకండాఫ్ స్టార్టింగ్ లో కొంచెం స్లో అయింది…అలాగే కొన్ని సీన్స్ లాగ్ అయ్యాయి. ఆ ఒక్కటి చూసుకుంటే బాగుండేది.. ఇక ఇళయరాజా (Ilayaraja) మ్యూజిక్ కూడా ఈ సినిమాకు చాలా వరకు ప్లస్ అయింది. బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా చాలా వరకు డీసెంట్ మ్యూజిక్ ఇచ్చే ప్రయత్నం చేశాడు…
Also Read: Bhairavam Movie Review : ‘భైరవం’ మూవీ మొట్టమొదటి రివ్యూ..మంచు మనోజ్ కి గేమ్ చేంజర్ కానుందా?
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో షణ్ముగ పాండియన్ చాలా అద్భుతంగా నటించాడు. కెప్టెన్ విజయ్ కాంత్ ను మరిపించేలా తన నటన ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. తన క్యారెక్టర్ లోని ఆర్క్ ను పట్టుకొని ట్రైబల్ ఏరియాలో నివశించే ఒక వ్యక్తి ఎలా ఉంటాడు అతని హావ భావాలు ఎలా ఉంటాయి అనే దాని మీద బాగా రీసెర్చ్ చేసి మరి ఆయన నటించినట్టుగా తెలుస్తోంది… ముఖ్యంగా ఏనుగును తన నుంచి దూరం చేయాలనే ఉద్దేశ్యంతో కొంతమంది ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ఏనుగు కి తనకి ఉన్న బాండింగ్ తెలియజేసే ఒక సీన్లో షణ్ముగ పాండియన్ అద్భుతంగా నటించాడు.
ఆ ఒక్క సీన్ తో తనలోని నటన ప్రతిభ ఏంటో చెప్పాడు… ఇక యామిని చందర్ (Yamini Chander) సైతం తన పాత్రకి న్యాయం చేసింది. ఆమె తప్ప ఆ పాత్రను ఎవరు చేయలేరు అనేంతలా నటించి మెప్పించింది….ఇక శ్రీజిత్ రవి పాత్ర పరిధి మేరకు చాలా బాగా నటించాడు. ముఖ్యంగా సినిమాకు హెల్ప్ అయ్యే క్యారెక్టర్ లో ఆయన పండించిన హావభావాలు సైతం సినిమాకి హైలైట్ గా నిలిచాయి.
అరుల్ దాస్ పర్ఫెక్ట్ గా తన క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు…అలాగే మునిశ్ కాంత్ అక్కడక్కడ కామెడీ ని పండిస్తూనే ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగా నటించాడు…కెజిఎఫ్ లో గరుడ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న రామచంద్ర రాజు ఈ సినిమాలో మెయిన్ విలన్ గా చేశాడు…ఆయన విలనిజం బాగా ఎలివేట్ అయింది. ఆయన పర్ఫెక్ట్ గా ఆ పాత్ర కోసమే పుట్టారేమో అనిపించింది…
Also Read: Anaganaga Movie Review: ‘అనగనగా’ ఫుల్ మూవీ రివ్యూ
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఇళయరాజా మ్యూజిక్ చాలా బాగుంది ముఖ్యంగా ఒక పాట అయితే సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడిని హుక్ చేసి సినిమా అయిపోయిన తర్వాత కూడా ఆ పాట అతన్ని వెంటాడుతూ ఉంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక బ్యాగ్రౌండ్ విషయంలో కూడా ఆయన చాలా వరకు కేర్ అయితే తీసుకున్నాడు… విజువల్స్ పరంగా కూడా సినిమాటోగ్రాఫర్ ఈ సినిమాకి మంచి విజువల్స్ ను అయితే ఇచ్చాడు. అందువల్లే ఈ సినిమా స్క్రీన్ మీద చాలా గ్రాండియర్ గా కనిపిస్తూ సినిమా చూసే ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తుంది…
ప్లస్ పాయింట్స్
కథ
షణ్ముగ పాండియన్ యాక్టింగ్
డైరెక్షన్
మైనస్ పాయింట్స్
సెకండాఫ్ స్టార్టింగ్ లో కొంచెం బోర్ గా ఉంది…
ఏనుగు మీద కొన్ని అనవసరపు సీన్స్ ఉన్నాయి…
రేటింగ్
ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.5/5