Homeఆంధ్రప్రదేశ్‌Kodali Nani : అవమాన భారంతో కొడాలి నాని.. ఏం జరిగిందంటే

Kodali Nani : అవమాన భారంతో కొడాలి నాని.. ఏం జరిగిందంటే

Kodali Nani : గుడివాడ నా అడ్డా అంటూ తరచూ కొడాలి నాని చెబుతుంటారు. నాపై పోటీచేయండి అంటూ చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ కు సవాల్ చేస్తుంటారు. చిన్నాపెద్దా వయసు తారతమ్యం చూడరు. నోటికి ఎంత వస్తే అంత మాట అనేస్తుంటారు. మొన్నటికి మొన్న దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ పైనే ఎడాపెడా తిట్ల దండకానికి పూనుకున్నారు. చివరకు ఆయన శరీరాకృతిపై సైతం తూలనాడారు. అయితే ఆయన ధైర్యమంతా గుడివాడ. ఆపై సీఎం జగన్ తన వెంట ఉన్నారన్న ధీమా. అయితే నాని విషయంలో ఏమనుకుంటున్నారో తెలియదు కానీ.. జగన్ ఆయనకు తరచూ హ్యండిస్తున్నారు.

తొలి మంత్రివర్గంలో కొడాలి నానికి చోటిచ్చారు. నా మనిషి అంటూ చెప్పుకొచ్చారు. దీంతో కొడాలి నాని వెనుకా ముందూ చూడలేదు. సామాజిక సమీకరణలతో ఉన్న మంత్రి పదవిని జగన్ తొలగించారు. దీంతో పవర్ సెంటర్ ను నాని నుంచి దూరం చేశారు. సహజంగానే తన నోటి దురుసుతో నాని శత్రువులను పెంచుకున్నారు. దీంతో గుడివాడలో కాస్తా టైట్ అవుతోంది. దీని నుంచి అధిగమించేందుకు సీఎం జగన్ ను తెచ్చి గుడివాడలో హడావుడి చేయాలని చూశారు. కానీ జగన్ అందుకు ససేమిరా అన్నారు. ఈ పరిణామాన్ని కొడాలి నాని అవమానంగా ఫీలవుతున్నారు.

టీడీపీ హయాంలో గుడివాడ నియోజకవర్గాన్ని చంద్రబాబు టాప్ ప్రయారిటీ ఇచ్చారు. పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారు. అందులో భాగంగా వేలాది టిడ్కో ఇళ్లను నిర్మించారు. వాటిని లబ్దిదారులకు కేటాయించారు. చివరికి రోడ్లు, కరెంట్ వంటి సదుపాయాలు కల్పించి లబ్దిదారులకు హ్యాండోవర్ చేయాల్సిన సమయంలో ప్రభుత్వం మారింది. నాలుగేళ్లయింది. ఆ రోడ్లు.. కరెంట్ పనులు చేయలేదు. కానీ ప్రారంభానికి ముహుర్తం ఫిక్స్ చేసేశారు. సీఎం జగన్ వచ్చి ప్రారభించడానికి ఏర్పాట్లు చేశారు.  కానీ చివరి నిమిషంలో సీఎం పర్యటన రద్ధయ్యింది.

దాదాపు టీడీపీ హయాంలోనే ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. కానీ లేఅవుట్ లో మౌలిక వసతులు మాత్రం కల్పించలేకపోయారు. నాలుగేళ్లలో సమయం వృథా చేశారు. ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి అనుకొని ప్రారంభోత్సవానికి పూనుకున్నారు. కానీ ఇటీవల ఇటువంటి ప్రారంభోత్సవాలకు చుక్కెదురవుతోంది.  అమరావతిలో చంద్రబాబు హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లను ప్రారంభించారు. అందులోఉండేలా నీరు.. కరెంట్.. లాంటి మౌలిక వసతులు కల్పించకపోవడంతో లబ్దిదారులు ప్రభుత్వాన్ని శాపనార్ధాలు పెట్టారు. గుడివాలో అలాంటి పరిస్థితి రాకుండా సీఎం జగన్ పర్యటన వాయిదా వేసుకున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న తరువాత సీఎం పర్యటన రద్దు కావడంతో కొడాలి నాని అవమానభారంగా ఫీలవుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Oktelugu Epaper